ఆమెతో రెహమాన్ కి అఫైర్.. కుండ బద్దలుకొట్టే క్లారిటీ, ఇక నోళ్లు మూసుకుంటారా?

ఒక్క భారతీయ చిత్ర పరిశ్రమే కాకుండా ప్రపంచ సంగీత రంగంలో ఆస్కార్ అవార్డ్ విజేత, దిగ్గజ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ వేసుకున్న ముద్ర ఎలాంటిది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నో క్లాసిక్ అల్బమ్స్ ని రెహమాన్ అందరికీ అందించి ఒక మ్యూజికల్ గాడ్ గా నిలిచారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటివరకు కొత్త కొత్త ట్యూన్స్ అండ్ బీట్స్ తో అలరిస్తూ వస్తున్న రెహమాన్ జీవితంలో షాకింగ్ ఇన్సిడెంట్ ఇటీవల చోటు చేసుకుంది.

రెహమాన్ తన భార్య సైరా బాను నుంచి విడిపోవడం టోటల్ ఇండియా వైడ్ గా కూడా చర్చకు దారి తీశాయి. ఈ విడాకులతో రెహమాన్ ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టడంతో తనకి ఈ విడాకులు ఇష్టం లేదా అన్నట్టుగా కూడా టాక్ వచ్చింది. మళ్ళీ వెంటనే తన మాజీ భార్య సైరా బాను తమ విడాకుల విషయంలో ఎవరూ రెహమాన్‌ని నిందించడానికి లేదు ఆయన చాలా గొప్ప వ్యక్తి అంటూ ట్విస్ట్ ఇచ్చారు.

mohini dey opens on afire with ar rahman

సరే ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ అసలు రెహమాన్, సైరా బానుల విడాకుల అనంతరం ఇంకో క్రేజీ ట్విస్ట్ బయటకి వచ్చింది. అదే రెహమాన్ మ్యూజిక్ బృందంలో వర్క్ చేసే లేడీ గిటారిస్ట్ మోహిని దెయ్ తన భర్తకు విడాకులు ఇవ్వడం. ఈ వార్తలు మరో రకంగా డాట్స్ ని కనెక్ట్ చేసాయి . దీంతో ఇంకేముందు రెహమాన్ కి ఈమెకి అఫైర్ అంటూ పలు షాకింగ్ వార్తలు మొదలయ్యాయి.

ఆమె కారణం గానే రెహమాన్ సుమారు 29 ఏళ్ళు కాపురం చేసిన భార్యను వదులుకున్నాడు అంటూ సో కాల్డ్ నెటిజన్స్ ఎలా పడితే అలా కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో ఎవరితో అయితే రెహమాన్ కి అఫైర్ ఉంది అంటున్నారో స్వయంగా ఆమెనే ఇపుడు నోరు విప్పడం జరిగింది. తమపై వస్తున్న దారుణమైన వార్తలని ఖండించింది.

mohini dey opens on afire with ar rahman

కాగా మోహిని ఓ వీడియో రిలీజ్ చేసి రెహమాన్ గారికి తనకి అలాంటి సంబంధం లేదని ఆయన నన్నెప్పుడు ఒక కూతురిగానే ట్రీట్ చేశారు అని అందరి నోర్లు మూయించింది. అందుకే తాను రెహమాన్ తండ్రితో సమానం అంటూ అసలు విషయాన్ని వెల్లడించింది. దీనితో ఈమె రిలీజ్ చేసిన వీడియో ఇపుడు సినీ వర్గాల్లో బయటకి వచ్చి వైరల్ గా మారింది అని చెప్పాలి. అన్నట్టు ఈమె ఎప్పుడో రెహమాన్ బ్యాండ్ నుంచి బయటకి వెళ్లిపోయిందట.

ప్రస్తుతం యూఎస్ లో ఆమె సెటిల్ అయ్యింది అని తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి. సో వీరి విషయంలో రెహమాన్ ని తప్పుబట్టిన వారు అంతా పెద్ద తప్పే చేసారని చెప్పక తప్పదు. కాగా ఇపుడు రెహమాన్ తమిళ్ సహా తెలుగులో కూడా పలు సినిమాలు చేస్తున్నారు. తెలుగులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ - శంకర్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న గేమ్ ఛేంజర్ సినిమాకి కూడా ఆయన యూనిక్ సంగీతాన్ని తాను అందిస్తున్నారు.

More from Filmibeat

Read more about: ar rahman saira banu mohini dey
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X