Nivin Pauly:సినిమాలో ఆఫర్ ఇస్తానంటూ.. స్టార్ హీరోపై వేధింపుల కేసు..

Actor Nivin Pauly: మలయాళ సినీ పరిశ్రమలో ఇండస్ట్రీలో లైంగిక వేధింపులపై జస్టిస్‌ హేమ కమిటీ తన నివేదికను ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నివేదిక ద్వారా పలు సంచలన విషయాలు వెలుగులోకి రావడంతో ఇండస్టీల్లో ప్రకంపనలు చెలారేగుతున్నాయి. ఈ క్రమంలో పలువురు సినీ తారలు, ఇండస్ట్రీ ప్రముఖులు ఈ నివేదికపై తన అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. మరికొందరూ తాము ఎదుర్కొన్న, ఎదుర్కొంటున్న అనుభవాలను వెల్లబుచ్చుతున్నారు. తన కన్నీటీ కథలను బయటి ప్రపంచానికి తెలియజేస్తున్నారు.

ఈ క్రమంలో తాజాగా ఓ దారుణం వెలుగులోకి వచ్చింది. సినిమాలో అవకాశం ఇప్పిస్తానంటూ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఓ మహిళా నటి మలయాళం యంగ్ హీరోతో పాటు మరో ఆరుగురిపై ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో ఆ నటుడిపై ఎర్నాకులం రూరల్ సేష్టన్ లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఇంతకీ ఆ నటుడు ఎవరు? ఆ బాధితురాలు ఎవరు? అసలు ఏం జరిగింది ?

molestation case registered against Actor Nivin Pauly Under Non-Bailable Section

హేమ కమిటీ నివేదికల రావడంతో చిత్రనిర్మాతలు, నటీనటులపై పలు ఆరోపణలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో ఓ మహిళ నటుడు నివిన్ పౌలీపై తీవ్రమైన ఆరోపణలతో ముందుకు వచ్చింది. తనకు సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని నివిన్ తనను వేధిస్తున్నాడని ఆ మహిళ ఆరోపించింది. విషయం తీవ్రతను పరిగణనలోకి తీసుకుని నటుడిపై ఎర్నాకులం రూరల్ పోలీస్ స్టేషన్ లో నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసినట్లు సమాచారం.

ఈ కేసులో హీరో నివిన్ పౌలీతో పాటు మరో ఐదుగురు పేర్లను కూడా ఆ మహిళ పేర్కొంది. వారందరూ తనపై ఓ హోటల్ గదిలో తనపై వేధింపులకు పాల్పడ్డారని సంచలన ఆరోపణలు చేసింది. ఆ ఐదుగురు నిందితుల్లో సినీ నిర్మాత ఎకె సన్, కుట్టన్, శ్రేయ, బషీర్ ఉన్నారు. గత నవంబర్‌లో సినిమా అవకాశం గురించి మాట్లాడాలని తనను దుబాయ్ కు తీసుకెళ్లారని, అక్కడే తనపై అత్యాచారం జరిగిందని మహిళ ఫిర్యాదులో పేర్కొంది.

molestation case registered against Actor Nivin Pauly Under Non-Bailable Section

అది ఆసత్య ప్రచారం : నివిన్ పౌలీ

తనపై వచ్చిన వేధింపుల ఫిర్యాదుపై నటుడు నివిన్ పౌలీ స్పందించారు. అది అబద్దపు ప్రచారమనీ, ఆ వార్త వెనుక ఉన్న వారిని వెలుగులోకి తెస్తామని నివిన్ పౌలీ అన్నారు. యువతి పట్ల తాను అసభ్యంగా ప్రవర్తించానంటూ తప్పుడు వార్తలు వెలుగులోకి వస్తున్నాయనీ, అవి పూర్తిగా అవాస్తవమని దయచేసి తెలుసుకోండి. ఈ ఆరోపణలు నిరాధారమైనవని నిరూపించేందుకు తాను ఏమైనా చేశాననీ, బాధ్యులను వెలుగులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. వారిపై చట్టబద్ధపరమైన చర్యలు తీసుకుంటాననీ హెచ్చరించారు. ఇక ప్రముఖ నటుడు ,దర్శకుడు నివిన్ పౌలీ విషయానికి వస్తే.. ఆయనకు రెండు కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు, ఆరు SIIMA అవార్డులు, రెండు కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డులు, మూడు సౌత్ ఫిల్మ్‌ఫేర్ అవార్డులను అందుకున్నాడు.

More from Filmibeat

Read more about: nivin pauly
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X