పుష్ప లేటెస్ట్ అప్డేట్.. షూటింగ్ పై క్లారిటీ ఇచ్చిన సుకుమార్ టీమ్

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మొదటిసారి చేస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ పుష్ప. దర్శకుడు సుకుమార్ కూడా తన రేంజ్ ని ఇంకాస్త పెంచుకోవాలని అనుకుంటున్నాడు. ఇక కరోనా లాక్ డౌన్ కారణంగా దాదాపు ఏడెనిమిది నెలలు షూటింగ్ కి దూరమైన చిత్ర యూనిట్ మొత్తానికి సినిమాను స్టార్ట్ చేయడానికి సిద్ధమైంది. గతంలో ఎప్పుడు లేని విధంగా సరికొత్త లుక్ తో కనిపించనున్న బన్నీ ఎలాంటి హిట్ అందుకుంటాడని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఇక సినిమాకు సంబంధించిన ఒక ప్రీ ప్రొడక్షన్ వర్క్ వీడియోను రిలీజ్ చేసిన సుకుమార్ టీమ్ అలాగే సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందనే విషయంపై కూడా అప్డేట్ ఇచ్చింది. నవంబర్ 10 నుంచి అంటే మంగళవారం నుంచి షూటింగ్ స్పీడ్ పెంచాలని డిసైడ్ అయ్యారు. చాలా కాలంగా బన్నీ పుష్ప లుక్ తోనే గడిపాడు. షూటింగ్ ఏ సమయంలోనైనా స్టార్ట్ కావచ్చని హెయిర్ స్టైల్ ని ఏ మాత్రం మార్చలేదు. ఎంత ఇబ్బంది అనిపించినా కూడా ఓపికతో మెయింటైన్ చేశాడు.

Most anticipated Pushpa Shoot commences from Nov 10th

ఇక ఫైనల్ గా రేపు సుకుమార్ టీమ్ పుష్పతో బిజీగా మారనుంది. ఏ మాత్రం గ్యాప్ లేకుండా వీలైనంత త్వరగా షూటింగ్ పనులను ముగించుకోవాలని అనుకుంటున్నారు. ఐదు భాషల్లో విడుదల కానున్న పుష్ప సినిమా హైప్ క్రియేట్ చేసేలా మధ్యలో కొన్ని టీజర్స్ ని కూడా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. ఇక సినిమాలో విలన్ పాత్రపై కూడా త్వరలోనే ఒక క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరి సినిమా ఏ రేంజ్ లో క్లిక్కవుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X