Year End 2023: సెన్సేషన్ క్రియేట్ చేసిన మోస్ట్ కాంట్రవర్షియల్ చిత్రాలివే.. సూపర్ హిట్లతో పాటు అట్టర్ ఫ్లాప్‌లూ
సినిమా వినోదానికి ఓ మంచి వేదిక. అయితే అన్ని సార్లూ సినిమా కేవలం వినోదానికి మాత్రమే పరిమితం కాకుండా ఆగ్రవేశాలకు, వివాదాలకు దారితీస్తుంటాయి. ముఖ్యంగా.. నిజ జీవిత సంఘటనల ఆధారంగా చేసుకుని తెరకెక్కించే చిత్రాలు, ఆటోబయోగ్రఫీలు, చరిత్ర, ఇతిహాస సినిమాల చుట్టూ వివాదాలు అల్లుకుంటాయి. ఉన్నది ఉన్నట్టుగా చూపించినా, లేనిది ఉన్నట్టుగా చూపించినా, ఉన్నది లేనట్టుగా చూపించినా వివాదం తలెత్తుతుంది. అలాంటి సినిమాలు, సీన్లు వివాదానికి దారి తీస్తుంటాయి.
సినిమాల్లో చరిత్రను వక్రీకరించడం, అభిప్రాయాలను అణగదొక్కడం, మెజారిటీ ప్రజల మనోభావాలను కించపరిచేలా చిత్రీకరించడం, సంభాషణలు, పాత్ర వేషధారణ ఇలా చాలా వాటి వల్ల వివాదాలు రేకెత్తుతాయి. అలా ఈ 2023 ఏడాదిలో వచ్చిన సినిమాల్లో వివాదాస్పదంగా నిలిచిన చిత్రాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆదిపురుష్:ఈ సినిమాపై క్రియేట్ అయిన బజ్ అంతా ఇంతా కాదు. ఎవరి నోటా విన్నా ఆదిపురుష్ గురించే. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముడిగా కనిపించడం, సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్ర పోషించడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. కానీ ఈ సినిమా ఏ స్థాయిలోనూ అంచనాలను అందుకోలేకపోయింది. దాంతో పాటు ఈ సినిమాలో చూపించిన సంఘటనలు, సంభాషణలపై విపరీతమైన విమర్శలు వచ్చాయి. ఇతిహాస చిత్రంగా వచ్చి, వివాదాస్పద చిత్రంగా మారింది. ఈ సినిమాలో జూన్ 16వ తేదీన దేశవ్యాప్తంగా విడుదలైంది.
మిసెస్ ఛటర్జీ vs నార్వే:రాణి ముఖర్జీ నటించిన ఈ మూవీ మార్చి 17వ తేదీన విడుదలైంది. తన కన్నబిడ్డను తిరిగి పొందేందుకు సాగరికా చక్రవర్తి అనే మహిళ నార్వే ప్రభుత్వంపై, న్యాయవ్యవస్థపై చేసిన పోరాటం గురించి ఈ సినిమాలో చూపించారు. అయితే నార్వే దేశ న్యాయవ్యవస్థ గురించి చెప్పడంతో ఈ చిత్రం కాస్త వివాదాస్పదంగా మారింది.

జైలర్:తలైవా రజినీకాంత్‌కు మంచి హిట్ పడి చాలా కాలం అయిపోయింది. రజినీ స్టైల్, స్వాగ్ చూసి కూడా సంవత్సరాలు దాటి పోయింది. అలాంటి టైం లో వచ్చిందే జైలర్. ఒకప్పటి రజినీకాంత్ ను చూసినట్లుగా అనిపించింది ఈ మూవీతో. సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది జైలర్. జైలర్ మూవీ రిలీజ్ కు ముందు కొన్ని వివాదాలు చుట్టుముట్టాయి. సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాపై ఏకంగా కోర్టునే ఆశ్రయించింది. మలయాళ దర్శకుడు సక్కిర్ మడతిల్ జైలర్ టైటిల్ తనదని కోర్టుకెక్కాడు. అలాగే జైలర్ మూవీ కథ కూడా కాపీ అని విమర్శలు వచ్చాయి.
కేరళ స్టోరీ:ఆదా శర్మ ప్రధాన పాత్రలో దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి తెరకెక్కించిన చిత్రం కేరళ స్టోరీ మే 5వ తేదీన విడుదలైంది. కేరళలో 2018-19లో మహిళలను ఇస్లాం మతంలోకి మార్చి.. వారికి మైండ్ వాష్ చేసి అక్రమంగా ఐసిస్, ఇతర ఇస్లామిక్ యుద్ధ ప్రాంతాలకు తరలించిన నిజ ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కేరళ రాష్ట్రాన్ని, అక్కడి ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకే ఇలాంటి సినిమా తెరకెక్కించారని తీవ్ర విమర్శలు వచ్చాయి. అలా ఈ మూవీ వివాదాస్పదంగా నిలిచింది.

యానిమల్:సందీప్ రెడ్డి వంగా, రణబీర్ కపూర్ కాంబోలో వచ్చిన మూవీ యానిమల్. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అంచనాలను అందుకుని, ప్రేక్షకులకు అంతకుమించిన ఎక్స్‌పీరియన్స్ ఇస్తూ విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా చుట్టూ అనేక వివాదాలు ముసురుకున్నాయి. సెలబ్రిటీలు ఈ సినిమాను పొగుడుతూ.. డైరెక్టర్, యాక్టర్ల పర్ఫార్మెన్స్ ను ఆకాశానికి ఎత్తేస్తుంటే.. సినీ విశ్లేషకులు మాత్రం యానిమల్ సినిమాపై విమర్శలు గుప్పిస్తూ రివ్యూలు ఇస్తున్నారు.


Click it and Unblock the Notifications











