Most Desirable Man 2020: రాంచరణ్ స్థానాన్ని ఆక్రమించిన రామ్ పోతినేని.. ఎన్టీఆర్ దూకుడు చూస్తే మతిపోవడం ఖాయం!

దేశంలోనే అతిపెద్ద న్యూస్ నెట్ వర్క్ గ్రూప్ టైమ్స్ ఆఫ్ ఇండియాకు చెందిన హైదరాబాద్ టైమ్స్ విభాగం రూపొందించే 30 మందితో కూడిన మోస్ట్ డిజైరబుల్ మెన్, 2020 జాబితాలో విజయ్ దేవరకొండ టాప్ స్థానాన్ని దక్కించుకోగా.. ఆ తర్వాత పలువురు టాలీవుడ్ హీరోలు ఆ జాబితాలో చోటు దక్కించుకొన్నారు.

హైదరాబాద్ టైమ్స్ 30 మోస్ట్ డిజైరబుల్ మెన్, 2020 జాబితాలో యువ హీరో రామ్ పోతినేని తన స్థానాన్ని మెరుగుపరుచుకొన్నారు. గతేడాది మూడోస్థానంలో ఉన్న రామ్ పోతినేని ఈ ఏడాది రెండోస్థానానికి చేరుకొన్నాడు. ఇక గతేడాది రెండోస్థానంలో ఉన్న మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఈ ఏడాది నాలుగోస్థానానికి పడిపోయారు.

మోస్ట్ డిజైరబుల్ మెన్ జాబితాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అనూహ్యమైన దూకుడు ప్రదర్శించాడు. గతేడాది 19వ స్థానంలో ఉన్న ఆయన ఈ ఏడాది మూడోస్థానానికి చేరుకొన్నాడు.గతేడాది 11వ స్థానంలో ఉన్న నాగ చైతన్య ఈ ఏడాది 6వ స్థానాన్ని దక్కించుకొన్నాడు. అలాగే 15వ స్థానంలో ఉన్న నవదీప్ 10వ స్థానానికి చేరుకొన్నాడు.

Ram Pothineni, Jr NTR, Ram Charan are in Hyderabad Times 30 Most Desirable Men 2020 list

గత ఏడాదితో పోల్చుకొంటే 8 స్థానంలో ఉన్న సుధీర్ బాబు ఈ సారి 15వ స్థానానికి, 12వ స్థానంలో ఉన్న అల్లు అర్జున్ 16వ స్థానానికి, 7వ స్థానంలో ఉన్న వరుణ్ తేజ్ 17వ స్థానానికి, 20వ స్థానంలో ఉన్న కార్తీకేయ 19వ స్థానానికి, 29వ స్థానంలో ఉన్న అడివి శేషు 22వ స్థానంలోకి, 30 స్థానంలో విశ్వక్ సేన్ 24వ స్థానంలోకి, 23వ స్థానంలో ఉన్న నితిన్ 25వ స్థానంలోకి, 25వ స్థానంలో ఉన్న ఆది పినిశెట్టి 27వ స్థానంలోకి, 24వ స్థానంలో ఉన్న తరుణ్ భాస్కర్ 30 స్థానంలో నిలిచారు.

ఇక నాగశౌర్య, రానా దగ్గుబాటి, సిద్దు జొన్నలగడ్డ, అఖిల్ సార్థక్, ఆనంద్ దేవరకొండ, కొత్తగా ఈ జాబితాలోకి ప్రవేశించారు. సినీ పరిశ్రమకు సంబంధం లేని వారిలో ముస్తాఫ్ దావూద్, మహ్మద్ సిరాజ్, బాసీర్ ఆలీ తదితరులు ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X