మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ఫస్ట్‌లుక్: అక్కినేని వారసుడు అదుర్స్

''అఖిల్, హలో, మిస్టర్ మజ్ను'' సినిమాలతో ఆశించిన ఫలితం రాబట్టకపోవడంతో కనీసం నాలుగో సినిమాతోనైనా బ్రేక్ తెచ్చుకోవాలని కసిగా ఉన్నాడు అక్కినేని అఖిల్. ఈ మేరకు న్యూ అండ్ క్రేజీ లుక్ లోకి మారి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తన నాలుగో సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో అఖిల్‌ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.

లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ కలగలిపి చూపించడంలో సిద్ధహస్తుడైన బొమ్మరిల్లు భాస్కర్ ఈ ప్రత్యేక శ్రద్ద పెట్టారు. అఖిల్ కెరీర్ టర్న్ అయ్యేలా ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ రూపొందిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు ''మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'' అనే క్రేజీ టైటిల్ ఫిక్స్ చేశారు. ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన చిత్రయూనిట్.. తాజాగా అఖిల్ ఫస్ట్‌లుక్ రిలీజ్ చేసింది.

Most Eligible Bachelor First Look Released

ఈ పోస్టర్‌లో అఖిల్ న్యూ లుక్ కొత్తగా అట్రాక్ట్ చేస్తోంది. విదేశీ వీధుల్లో నిట్ క్యాప్, మెడలో స్కార్ఫ్ ధరించి, పాదరక్షలు లేకుండా ఒట్టి కాళ్ళతో నడిరోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న ఈ అక్కినేని వారసుడి లుక్ ఆసక్తి రేపుతోంది. ఈ లుక్ చూసిన అభిమానులు ఈ సినిమా అఖిల్‌కి ది బెస్ట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అతిత్వరలో మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X