twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అక్కడ కూడా సత్తా చాటిన బ్యాచ్‌లర్: కెరీర్‌లోనే భారీ రేటింగ్‌ను అందుకున్న అఖిల్

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది వారసులు హీరోలుగా పరిచయం అయ్యారు. కానీ, వారిలో చాలా అంటే చాలా తక్కువ మంది మాత్రమే సక్సెస్‌లకు అందుకుని స్టార్లుగా ఎదిగిపోయారు. మిగిలిన వాళ్లు మాత్రం విజయం కోసం చాలా కాలం పాటు నిరీక్షించాల్సి వచ్చింది. అలాంటి వారిలో అక్కినేని హీరో అఖిల్ ఒకడు. 'అఖిల్' అనే సినిమాతో పరిచయం అయిన అతడు.. ఆ తర్వాత 'హలో', 'మిస్టర్ మజ్నూ' వంటి చిత్రాలను చేశాడు. కానీ, ఇవేమీ అతడికి హిట్‌ను మాత్రం అందించలేకపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి ఎలాగైనా విజాయన్ని సొంతం చేసుకోవాలన్న అఖిల్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' అనే సినిమాతో ఆ మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చాడు.

    హాట్ డోస్ మరింత పెంచేసిన పూజా హెగ్డే: ఆమెను ఇంత ఘాటుగా ఎప్పుడూ చూసుండరుహాట్ డోస్ మరింత పెంచేసిన పూజా హెగ్డే: ఆమెను ఇంత ఘాటుగా ఎప్పుడూ చూసుండరు

    అక్కినేని అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన చిత్రమే 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'. రొమాంటిక్ జోనర్‌లో వచ్చిన ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఎప్పుడో పూర్తైంది. అయితే, అనివార్య కారణాల వల్ల ఈ సినిమా అనుకున్న సమయానికి విడుదల కాలేదు. దీంతో అసలు ఇది రిలీజ్ అవుతుందా? లేదా? అన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనుకున్న విధంగానే దీనికి ప్రపంచ వ్యాప్తంగా మంచి టాక్ వచ్చింది. దీనికితోడు రివ్యూలు కూడా పాజిటివ్‌గా వచ్చాయి.

     Most Eligible Bachelor Movie Got 9.31 TRP in 1st Time

    ఎన్నో ఏళ్లుగా హిట్ కోసం వేచి చూస్తోన్న అఖిల్‌కు 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' మూవీతో సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఈ చిత్రం కేవలం ఐదు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకుంది. ఇది తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఓవర్సీస్‌లోనూ ఈ చిత్రం సత్తా చాటింది. ఇక, దాదాపు రూ. 19 కోట్ల టార్గెట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి ఫుల్ రన్‌లో రూ. 23 కోట్లకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకుంది. దీంతో దీనికి హిట్ స్టేటస్ అందుకోవడంతో పాటు రూ. 4 కోట్లకు పైగా లాభాలు కూడా వచ్చాయి. దీనిపై అక్కినేని అఖిల్‌తో పాటు అతడి అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు.

    బ్రేకప్ తర్వాత గుడ్ న్యూస్ చెప్పిన షణ్ముఖ్: ఆ ప్రేమ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నా అంటూ పోస్ట్బ్రేకప్ తర్వాత గుడ్ న్యూస్ చెప్పిన షణ్ముఖ్: ఆ ప్రేమ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నా అంటూ పోస్ట్

    క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' మూవీని కొద్ది రోజుల క్రితమే తెలుగు ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్ చేయడం మొదలు పెట్టారు. అక్కడ కూడా దీనికి ఊహించని రీతిలో స్పందన దక్కింది. దీంతో తక్కువ సమయంలోనే ఎక్కువ వ్యూస్ అందుకున్న చిత్రంగా నిలిచింది. ఈ నేపథ్యంలోనే ఇటీవలే అఖిల్ నటించిన ఈ రొమాంటిక్ మూవీని స్టార్‌ మాలో ప్రసారం చేశారు. థియేటర్లు, ఓటీటీలో మాదిరిగానే బుల్లితెరపై కూడా దీనికి అనూహ్యమైన స్పందన వచ్చింది. ఫలితంగా ఈ చిత్రానికి 9.31 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. ఇది అక్కినేని అఖిల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ నెంబర్ అని అంటున్నారు.

    వరుస పరాజయాలతో సతమతం అవుతోన్న అక్కినేని అఖిల్ హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన చిత్రమే 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'. ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాను అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌ బ్యానర్‌పై బన్నీవాస్‌, వాసు వర్మ సంయుక్తంగా నిర్మించారు. గోపీ సుందర్ సంగీతం అందించాడు. ఇక, ఇందులో ఇషా రెబ్బా, ఫరియా అబ్దాల్లా సహా పలువురు నటీమణులు కామియో రోల్స్ చేశారు.

    English summary
    Tollywood Young Hero Akhil Akkineni Did Most Eligible Bachelor Under Bommarillu Bhaskar. Movie Got 9.31 TRP in 1st Time.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X