For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అక్కినేని ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్: వాటిలో కూడా రాబోతున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ మూవీ

  |

  'అఖిల్' అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అక్కినేని నట వారసుడు అఖిల్. హ్యాండ్సమ్ లుక్స్‌తో పాటు యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ ఇలా అన్ని రకాల విభాగాల్లో రాణించే సత్తా ఉన్నప్పటికీ.. అతడికి లక్ అంతగా కలిసి రాలేదు. అందుకే మొదటి చిత్రంతో పాటు ఆ తర్వాత వచ్చిన 'హలో', 'మిస్టర్ మజ్నూ' చిత్రాలతో నిరాశనే ఎదుర్కొన్నాడు. వరుసగా ఫ్లాపులు వస్తుండడంతో అతడి కెరీర్‌ ప్రశ్నార్థంగా మారిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి ఎలాగైనా విజాయన్ని సొంతం చేసుకోవాలన్న కసితో అక్కినేని అఖిల్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' అనే సినిమాను చేశాడు.

  Bigg Boss 5 Telugu Wild Card Entry: ఎలిమినేట్ అయిన బ్యూటీకి బాస్ ఆఫర్.. షోలోకి ఆ లేడీ కంటెస్టెంట్ రీఎంట్రీ!

  బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అక్కినేని అఖిల్ నటించిన చిత్రమే 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'. రొమాంటిక్ జోనర్‌లో వచ్చిన ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఎప్పుడో పూర్తైంది. అయితే, ఆ తర్వాత కొన్ని రీషూట్స్‌తో పాటు పలు ఆటంకాలు ఎదురు కావడం వల్ల పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం అయ్యాయి. దీంతో సినిమా కూడా అనుకున్న టైమ్‌కు విడుదల కాలేదు. ఇక, ఈ మూవీపై ఆరంభం నుంచే అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఈ చిత్రం నుంచి ఏది విడుదలైన భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇక, దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా మంచి టాక్ వచ్చింది. దీంతో చిత్ర యూనిట్ ఎంతో సంతోషంగా ఉంది.

  చాలా కాలంగా హిట్ కోసం వేచి చూస్తోన్న అఖిల్‌కు 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' సంతృప్తిని కలిగించింది. ఈ చిత్రం కేవలం ఐదు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకుంది. ఫలితంగా ఈ యంగ్ హీరో ఖాతాలో మొట్టమొదటి విజయం వచ్చి చేరింది. దాదాపు రూ. 19 కోట్ల టార్గెట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి ఆరు రోజుల్లో రూ. 20.95 కోట్లు వచ్చాయి. దీంతో దీనికి హిట్ స్టేటస్ అందుకోవడంతో పాటు రూ. 1.95 కోట్లు లాభాలు కూడా వచ్చాయి. దీనిపై అక్కినేని అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు.

  మితిమీరిన జాన్వీ కపూర్ హాట్ షో: ఘాటు ఫోజులో అందాలను మొత్తం చూపిస్తోన్న శ్రీదేవి కూతురు

  Most Eligible Bachelor Movie US Locations will Increase From October 22nd

  ఫీల్ గుడ్ రొమాంటిక్ జోనర్‌లో వచ్చిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అమెరికాలో సైతం భారీ స్థాయిలో స్పందన వచ్చింది. దీంతో అక్కడ మాంచి ఓపెనింగ్స్ దక్కించుకున్న ఈ చిత్రం.. ఆరు రోజుల్లోనే 5 లక్షల అమెరికన్ డాలర్లను వసూలు చేసింది. ఈ నేపథ్యంలో యూఎస్‌లో మరిన్ని లొకేషన్స్‌ను పెంచాలని డిస్ట్రిబ్యూషన్ సంస్థ సరిగమ సినిమాస్ నిర్ణయించింది. ఈ మేరకు వచ్చే శుక్రవారం అంటే అక్టోబర్ 22 నుంచి మరో ఎనిమిది ప్రాంతాల్లో ఈ సినిమాను ప్రదర్శించబోతున్నట్లు ఓ ప్రకటననను వెల్లడించింది.

  క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' మూవీలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాను అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌ బ్యానర్‌పై బన్నీవాస్‌, వాసు వర్మ సంయుక్తంగా నిర్మించారు. గోపీ సుందర్ సంగీతం అందించాడు. ఇక, ఇందులో ఇషా రెబ్బా, ఫరియా అబ్దాల్లా సహా పలువురు నటీమణులు కామియో రోల్స్ చేసిన విషయం తెలిసిందే.

  English summary
  Young Hero Akhil Akkineni Did Most Eligible Bachelor Under Bommarillu Bhaskar. This Movie US Locations will Increase From October 22nd.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X