‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ ఫస్ట్ కాపీ రెడీ: చిత్ర యూనిట్ రియాక్షన్ ఇదే
చాలా ఏళ్ల క్రితమే హీరోగా పరిచయం అయినా.. ఇప్పటి వరకూ ఒక్కటంటే ఒక్క హిట్‌ను కూడా అందుకోలేకపోయాడు అక్కినేని వారసుడు అఖిల్. ఈ క్రమంలోనే వరుస పెట్టి సినిమాలు చేస్తున్న సరైన ఫలితాన్ని మాత్రం రాబట్టలేకపోతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి కచ్చితంగా సక్సెస్‌ను అందుకోవాలని పట్టుదలతో ఉన్నాడు. ఇందులో భాగంగానే బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' అనే సినిమాను చేశాడు. ఎప్పుడో షూటింగ్ పూర్తైన ఈ సినిమా గురించి తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్ ఏరియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ప్యూర్ లవ్ స్టోరీతో తెరకెక్కిన చిత్రమే 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఎన్నో పుకార్లు షికార్లు చేశాయి. ఇటీవల కూడా ఈ మూవీ ఔట్‌పుట్ సరిగా రాలేదని ఓ న్యూస్ కలకలం రేపింది. అయితే, తాజా సమాచారం ప్రకారం.. చిత్ర యూనిట్ ఇప్పటికే ఫస్ట్ కాపీని చూసేసిందట. దీనిపై వాళ్లంతా సంతోషంగా ఉండడంతో పాటు సంతృప్తిగా ఫీల్ అవుతున్నారని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా అక్కినేని అఖిల్.. పూజా హెగ్డే మధ్య సీన్స్ అన్నీ ఎంతో చక్కగా వచ్చాయనే టాక్ వినిపిస్తోంది. ఇక, దీన్ని త్వరలోనే విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'లో అఖిల్ రొమాంటిక్ రోల్‌లో నటించాడు. అతడికి జోడీగా బుట్టబొమ్మ పూజా హెగ్డే పాత్రను అదిరిపోయేలా క్రియేట్ చేశారు. ఇక, ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీవాస్, వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ సంగీతం అందించాడు. ఈ చిత్రాన్ని ఇండిపెండెన్స్ డేకు రెండు రోజుల ముందు అంటే ఆగస్టు 13న విడుదల చేయాలని యూనిట్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











