For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Liger: విజయ్ మూవీలో అదే హైలైట్.. ఆమె వల్ల హీరో క్యారెక్టర్‌ మారుతుందట

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలోకి స్వయంకృషితో ఎంట్రీ ఇచ్చిన వారిలో క్రేజీ గాయ్ విజయ్ దేవరకొండ ఒకడు. చిన్న పాత్రలతో కెరీర్‌ను ఆరంభించి.. 'పెళ్లి చూపులు' అనే సినిమాతో హీరోగా మారాడు. మొదటి సినిమాలోనే తనదైన నటనతో అందరి దృష్టినీ ఆకర్షించడంతో పాటు భారీ విజయాన్ని కూడా సొంతం చేసుకున్నాడు. ఆ వెంటనే 'అర్జున్ రెడ్డి' మూవీతో మరో పెద్ద హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాదు, ఈ చిత్రంతో విజయ్ స్టార్‌డమ్‌ను కూడా దక్కించుకున్నాడు. ఇక, 'గీత గోవిందం'తో వంద కోట్ల క్లబ్‌లో చేరిన ఈ టాలెంటెడ్ హీరో.. ఆ వెంటనే 'టాక్సీవాలా'తో మరో సక్సెస్‌ను కూడా చేజిక్కించుకున్నాడు. దీంతో అతడి కెరీర్‌ గ్రాఫ్‌తో పాటు మార్కెట్ కూడా భారీగా పెరిగింది.

  బుల్లి గౌనుతో రెచ్చిపోయిన యాంకర్ వర్షిణి: వామ్మో ఈ హాట్ షో మామూలుగా లేదుగా!

  హీరోగా పరిచయం అయిన తొలినాళ్లలోనే ఎన్నో విజయాలను అందుకుని చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు విజయ్ దేవరకొండ. ఇలాంటి పరిస్థితుల్లో అతడికి కొంత కాలంగా వరుసగా ఫ్లాపుల మీద ఫ్లాపులు వస్తున్నాయి. కొన్నేళ్ల క్రితం వచ్చిన ద్విభాషా చిత్రం 'నోటా' నుంచి మొదలుకొని.. 'డియర్ కామ్రేడ్', 'వరల్డ్ ఫేమస్ లవర్' వంటి పరాజయాలతో విజయ్ తెగ ఇబ్బందులు పడుతున్నాడు. దీంతో అతడి అభిమానులు తీవ్ర నిరాశలో ఉండిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో విజయ్ దేవరకొండ ఈ సారి ఎలాగైనా విజయాన్ని అందుకోవాలన్న పట్టుదలతో కనిపిస్తున్నాడు.

  Mother Sentiment Highlight in Vijay devarakondas Liger Movie

  బిగ్గెస్ట్ హిట్ కోసం వేచి చూస్తోన్న టాలీవుడ్ యంగ్ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం టాలీవుడ్‌ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ తెరకెక్కిస్తోన్న 'లైగర్' అనే సినిమాలో నటిస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందుతోన్న ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయింది. కానీ, అనివార్య కారణాల వల్ల తరచూ వాయిదా పడుతుండడంతో చాలా కాలం వరకూ టాకీ పార్ట్ మాత్రం కంప్లీట్ కాలేదు. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితమే ముంబైలో ఫైనల్ షెడ్యూల్‌ను మొదలు పెట్టడంతో పాటు వెంటనే దాన్ని పూర్తి చేసేశారు. ఇక, తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన న్యూస్ ఒకటి ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోంది.

  హాట్ వీడియోతో షాకిచ్చిన యాంకర్ మంజూష: ఆమెను ఇలా చూస్తే తట్టుకోలేరు!

  'లైగర్' మూవీ బాక్సింగ్ నేపథ్యంతో వస్తున్న విషయం తెలిసిందే. ఇక, ఇందులో హీరో విజయ్ దేవరకొండ తల్లిగా సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ నటిస్తుందట. ఆ మధ్య వచ్చిన టీజర్‌లో కూడా ఆమె పాత్రకు సంబంధించిన కొన్ని విజువల్స్‌ను చూపించారు. ఈమె పాత్ర సినిమాలో హైలైట్‌గా నిలుస్తుందని తాజాగా తెలిసింది. మరీ ముఖ్యంగా విజయ్‌ - రమ్యకృష్ణ మధ్య వచ్చే సెంటిమెంట్ సీన్స్ సినిమాకే హైలైట్‌గా నిలవబోతున్నాయని అంటున్నారు. అసలు ఆమె వల్లే హీరో బాక్సర్‌గా మారతాడని ప్రచారం జరుగుతోంది. అంటే విజయ్ తర్వాత రమ్యకృష్ణ పాత్రకే ప్రాధాన్యం ఎక్కువగా ఉండబోతుందన్న మాట.

  'లైగర్' మూవీలో విజయ్ దేవరకొండ ప్రొఫెషనల్ బాక్సర్‌గా నటిస్తున్నాడు. ఇందులో బాలీవుడ్ స్టార్ డాటర్ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక, ఈ సినిమాను కరణ్ జోహార్, హీరోయిన్ ఛార్మీలతో కలిసి పూరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇందులో రమ్యకృష్ణ కీలక పాత్రను చేస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.

  English summary
  Vijay Devarakonda Now Doing Liger Movie Under Puri Jagannadh Direction. Mother Sentiment will be Highlight in This Movie
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X