మా ఎన్నికలపై తుది నిర్ణయం.. ఈ వారంలోనే కొత్త ట్విస్ట్
టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) ఎన్నికల సమరానికి స్టార్స్ అందరూ బాగానే సిద్ధం అయ్యారు గాని అసలు ఎన్నికలు ఎప్పుడు అనే విషయంలో మాత్రం ఎవరికి క్లారిటీ లేదు. హఠాత్తుగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నట్లుగానే సడన్ గా ఎన్నికల పోటీకి రావడం కాస్త కన్ఫ్యూజన్ ను క్రియేట్ చేసింది. ప్రస్తుత ప్యానెల్ గడువు పూర్తవ్వకముందే ముందే ఈ గోల ఏమిటని కొందరు విమర్శలు కూడా చేశారు.
ఇక మోహన్ బాబు వారసుడు మంచు విష్ణు అందరికంటే ముందుగానే అగ్ర నటీనటుల నుంచి మద్దతు అందుకోగా అనంతరం ప్రకాష్ రాజ్ కూడా మెగాస్టార్ చిరంజీవి అండతో రంగంలోకి దిగారు. ఎవరికి వారు విమర్శలు, ప్రతి విమర్శలు, కౌంటర్లు వేసుకుంటూ రెండు వారాల పాటు బాగానే హైలెట్ అయ్యారు. కానీ ఎన్నికలు ఎప్పుడు అనే విషయంలో కనీసం హింట్ కూడా ఇవ్వలేదు.

ఆ మధ్య ప్రకాశ్ రాజ్ జస్ట్ అస్కింగ్ ట్యాగ్ తో ఎన్నికలు ఎప్పుడు అని ప్రశ్నించారు. ఇక నందమూరి బాలకృష్ణ కూడా మా అసోసియేషన్ లో డబ్బులు ఏమవుతున్నాయి అంటూ పెద్ద కౌంటర్ ఇచ్చారు. ఇక ఎన్నికలు ఉంటాయా లేదా అనే విషయంపై ఫుల్ క్లారిటీ ఇవ్వాలని మా పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చారు. మా' ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఈసీ) సమావేశాన్ని వీలైనంత త్వరగా నిర్వహించనిర్ణయించి ఈ వారంలోనే సస్పెన్స్ కు తెరదించాలని అనుకుంటున్నారు. బుధవారం లేదా గురువారంలో సమావేశాలని నిర్వహించవచ్చని టాక్ వస్తోంది. కరోనా నిబంధనలకు విరుద్ధంగా మీటింగ్స్ వద్దని వర్చువల్‌గానే ఈ మీటింగ్ జరపాలని మా పెద్దలు నిర్ణయించారు. మరి ఆ మీటింగ్స్ లో సినీ ప్రముఖులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.


Click it and Unblock the Notifications











