సుశాంత్ సింగ్ బయోపిక్ .. అసలు నిజాలు అందులోనే చూపిస్తారట.. సూసైడ్ or మర్డర్?
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ బాలీవుడ్ లో ఏ స్థాయిలో సంచలనం సృష్టించిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. గతంలో ఎప్పుడు లేని విధంగా కొంతమంది బాలీవుడ్ సినీ ప్రముఖులపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇక నెక్స్ట్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ లైఫ్ అండ్ డేత్ పై ఒక సినిమా కూడా తెరకెక్కబోతున్నట్లు ఎనౌన్స్ చేశారు.
Recommended Video

అసలు కారణం ఏమిటి..
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణాంతరం అతని మృతికి అసలు కారణం ఏమిటనేది ఇంతవరకు నిర్దారణ కాలేదు. రకరకాల రూమర్స్ ఇండస్ట్రీలో ఒక రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. సుశాంత్ సింగ్ మృతిజి కారణం సినిమా ఇండస్ట్రీలో ఉన్న నెపోటీజమ్, గ్రూప్స్, డిప్రెషన్ అని ఆరోపణలు వస్తున్నాయి.

కొత్తగా వచ్చేవారిని తోక్కేస్తున్నారని..
కేవలం సెలబ్రెటీస్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నవాళ్లను మాత్రమే ఇండస్ట్రీలో ఎక్కువగా అవకాశాలు లభిస్తున్నాయని, కొత్తగా వచ్చేవారిని తోక్కేస్తున్నారని కొంతమంది సినీ ప్రముఖులే కామెంట్స్ చేస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. సల్మాన్ ఖాన్, కరణ్ జోహార్, అలియా భట్ వంటి వారిపై విమర్శలు వస్తున్నాయి. సుశాంత్ సింగ్ మృతిపై ఊహించని సస్పెన్స్ నెలకొంది. ప్రస్తుతం పోలీసులు అన్ని వైపులా విచారణ జరుపుతున్నారు.

సుశాంత్ సింగ్ మృతిపై సినిమా..
ఇక ఈ తరుణంలో సుశాంత్ సింగ్ మృతిపై ఒక సినిమా తెరకెక్కబోతున్నట్లు ఎనౌన్స్మెంట్ వచ్చింది. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ విజయ్ శేఖర్ గుప్తా సుశాంత్ లైఫ్ అండ్ డెత్ పై సినిమా చేయబోతున్నట్లు ఎనౌన్స్ చేశారు. 'సూసైడ్ or మర్డర్?- ఎ స్టార్ వాజ్ లాస్ట్' అనే టైటిల్ ని ఫిక్స్ చేసిన చిత్ర యూనిట్ స్పెషల్ గా మోషన్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు.
మోషన్ పోస్టర్ వైరల్
ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పట్లో తెలిసేలా లేవు. ఇంకా సుశాంత్ సింగ్ సూసైడ్ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అతను ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది అనే విషయం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ కేసులో పోలీసులు ఎలాంటి విషయాల్ని బయటపెడతారో చూడాలి.


Click it and Unblock the Notifications











