Year End 2023: ఈ ఏడాది నెట్టింటిని షేక్ చేసిన టాప్ మీమ్స్ ఇవే.. చూశారంటే సో బ్యూటిఫుల్ సో ఎలిగెంట్ అనాల్సిందే!
మరికొద్ది రోజుల్లో 2023 సంవత్సరానికి గుడ్ బై చెప్పేసి 2024వ సంవత్సరానికి ఆహ్వానం పలికేస్తాం. ఈక్రమంలోనే ఈ ఏడాది హైలెట్ గా నిలిచిన అన్నింటినీ మరోసారి గుర్తు చేసుకోవాల్సిందే. ముఖ్యంగా ఫుల్ వైరల్ గా నిలిచిన అన్ని వార్తలను ఓసారి తెలుసుకుందాం. అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది సోషల్ మీడియాను వాడడంతో చాలా వీడియోలు పాపులర్ అవుతున్నాయి. ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ వేధికగా చాలా మీమ్స్ వైరల్ అవుతుంటాయి. ఈ ఏడాది ఫుల్ ట్రెండ్ అయి వైరల్ గా మారిన టాప్ మీమ్స్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకందాం.
జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్..
ఈ మీమ్ ఇప్పటికీ వైరల్ అవుతోంది. ముఖ్యంగా జస్ట్ లుకింగ్ లైక్ వావ్ అనే ఈ డైలాగ్ ను ఢిల్లీకి చెందిన జాస్మీన్ కౌర్ కొట్టగా. ఫుల్ పాపులర్ అయింది. బట్టల వ్యాపారం చేసే ఈమె... డ్రెస్ లు చూపిస్తూ.. సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్ జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్ అంటూ చెప్పడం అందరినీ ఆకట్టుకుంది. దీనిపై నెట్టింట ఎన్నో రీల్స్ వచ్చాయి.

మోయే మోయే
ఒక పాటు మీమ్ గా మారడం చాలా పాత విషయమే. కానీ మోయే మోయే కి ఉన్న రెస్పాన్స్ చూస్తే అంతా షాకవుతారు. ఈ పాటను సెర్బియా గాయకుడు, గేయరచయిత తేయా డోరా పాడారు. ఈ పాట బాధకు సంబంధించింది కాగా.. నెట్టింట్లో మాత్రం కామెడీ కోసం ఉపయోగించారు.
ఎల్విష్ భాయ్ మీమ్
ఎల్విష్ యాదవ్ పేరును ఉల్లాసంగా అరుస్తూ ఓ వ్యక్తి చెప్పగా ఫుల్ వైరల్ అయింది. ముఖ్యంగా లక్షలాది మందిని ఈ మీమ్ నవ్వించింది. బిగ్ బాస్ ఓటీటీ 2 విజేతగా ఎల్విష్ యాదవ్ నిలవగా.. బయట ఉన్న ఓ అభిమాని ఇలా అరిచాడు. దీంతో వైరల్ అయిపోయింది.

భూపేంద్ర జోగి
మధ్యప్రదేశ్ కు చెందిన భూపేంద్ర జోగి రాత్రికి రాత్రే స్టార్ అయిపోయాడు. ఎన్నికల సమయంలో ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నలకు పదే పదే తన పేరును చెప్పిన ఫుల్ వైరల్ అయిపోయాడు. ఈ మీమ్ నెట్టింటిని షేక్ చేసింది.
ఆయేన్ మీమ్
బీహార్‌కు చెందిన 6వ తరగతి బాలుడు ఓ డైలాగ్ కొట్టి నెట్టింట ట్రెండింగ్ లో నిలిచాడు. నీకు ఏ సబ్జెక్ట్ అంటే ఎక్కువ ఇష్టం అని అడగ్గా.. ఆయేన్ అని సమాదానం చెప్పాడు. ఈ వీడియో సోషల్ మీడియాను ఓ ఊపు ఊపింది.
ఔకాత్ దిఖా ది
ఔకత్ దేఖా ది అనే పదం కూడా మీమ్ గా మారి నెట్టింట వైరల్ గా మారింది. దీన్ని చూసి లక్షలాది మంది కడుపుబ్బా నవ్వుకున్నారు.

ది బాయ్స్
బాయ్స్ మీమ్ లో స్నేహితులంతా కలిసి క్లాసులో తరగతులు వినకుండా... లాప్ టాప్ లో తమకు నచ్చిన కార్టూన్ ఛానెల్స్ చూస్తూ ఉంటారు. ఈక్రమంలోనే బ్యాక్ గ్రౌండ్ లో 'ఇమాజిన్ డ్రాగన్స్' యొక్క ప్రసిద్ధ పాట 'బోన్స్' వస్తుంది. ఇలా ఈ మీమ్ తెగ వైరల్ అయింది.


Click it and Unblock the Notifications











