ఎంపీ నందిగం సురేష్ కీలక పాత్రలో ఆటో రజని.. సీఎం జగన్‌ను కలిసి ఆశీర్వాదం

శ్రీ మహాలక్ష్మి ఎంటర్ప్రైజెస్ పతాకంపై జొన్నలగడ్డ హరికృష్ణ, మోక్ష జంటగా శ్రీనివాస్ జొన్నలగడ్డ దర్శకత్వంలో నిర్మిస్తున్న హై ఓల్టేజ్ లవ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఆటో రజిని. ఇటీవల చిత్ర యూనిట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎంపి నందిగాం సురేష్ అధ్వర్యంలో కలసింది. ఈ మూవీ లోని కొన్ని సన్నివేశాలను చూపించడమే కాకుండా చిత్ర విశేషాలను వివరించారు. ఈ సినిమా విజయవంతం కావాలని ఏపీ సీఎం నుంచి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ఈ చిత్రంలో ఎంపీ నందిగాం సురేష్ కూడా ఓ కీలక పాత్రలో నటించడం విశేషం.

ఆటో రజిని సినిమాకు సంబంధించి ఇటీవల ఓ భారీ యాక్షన్ షెడ్యుల్‌ను విజయవాడలో షూట్ చేశారు. ఈ షెడ్యూల్‌లో బాపట్ల ఎంపి గౌరవ నందిగం సురేష్, హీరో హరి జొన్నలగడ్డ కాంబినేషన్‌లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఫైట్ మాస్టర్ కనల్ కన్నన్ ఆధ్వర్యంలో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. అలాగే RRR మూవీలో నాటు నాటు సాంగ్ కంపోజ్ చేసిన కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ అధ్వర్యంలో 150 మంది డాన్సర్లతో ఓ పాటను చిత్రీకరించారు. జూన్ 10 నుంచి మరొక షెడ్యూల్‌ను విజయవాడ‌లో జరుపనున్నారు. జూలై 10 నుంచి క్లైమాక్స్ సన్నివేశాలను నెల్లూరు కృష్ణపట్నం పోర్ట్‌లో షూట్ చేస్తారని చిత్ర యూనిట్ తెలిపింది.

MP Nandigam Suresh tollywood entry with Auto Rajini, takes blessing for AP CM Jagan

దర్శకుడు శ్రీనివాస్ జొన్నలగడ్డ మాట్లాడుతూ.. ఆటోరజినీ సినిమా షూటింగ్‌కు అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన ఏపీ ప్రభుత్వానికి హృదయ పూర్వక కృతజ్ఞతలు. ఏపీ సీఎం జగన్‌ను కలసి అయన ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. అలాగే నా మీద నమ్మకంతో మా హీరో హరిపై అభిమానంతో ఈ సినిమాలో గౌరవ ఎంపీ నందిగం సురేష్ అన్నయ్య ఒక కీలక పాత్ర లో నటిస్తున్నారు. కొన్ని కీలక సన్నివేశాలతోపాటు ఎంపీ నందిగాం సురేష్, హిరో హరి కాంబినేషన్‌లో వచ్చే హై ఓల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్‌ను ఫైట్ మాస్టర్ కనల్ కన్నన్ షూట్ చేసాం. ఎంపీ నందిగం సురేష్ అద్భుతంగా నటిస్తున్నారు. మొదటి సినిమా నే అయిన ఎంతో మెచ్యూర్డ్ ఆర్టిస్ట్ లాగా నటిస్తున్నారు అని అన్నారు.

MP Nandigam Suresh tollywood entry with Auto Rajini, takes blessing for AP CM Jagan

నటీనటులు: జొన్నలగడ్డ హరికృష్ణ , మోక్ష (తొలి పరిచయం) తదితరులు
బ్యానర్: శ్రీ మహాలక్ష్మి ఎంటర్‌ప్రైజెస్
మ్యూజిక్: మణిశర్మ
కెమెరా: ప్రసాద్ బాబు
ఎడిటింగ్: గౌతం రాజు
డాన్స్: ప్రేమ్ రక్షిత్
ఫైట్స్: కనల్ కన్నన్
ఆర్ట్: చిన్న
కథ: విక్రమ్ రాజా
పబ్లిసిటీ: సురేష్ అంజన్
కో డైరెక్టర్: శ్రీనివాస రెడ్డి
స్క్రీన్ ప్లే, దర్శకత్వం : శ్రీనివాస్ జొన్నలగడ్డ

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X