Don't Miss!
- News
ముగిసిన అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ: తనపై దుష్ప్రచారం చేస్తున్నారన్న ఎంపీ
- Finance
air india: చరిత్ర సృష్టించనున్న ఎయిర్ ఇండియా.. ప్రపంచంలో అలా చేస్తున్న మొదటి సంస్థ టాటానే..
- Sports
అంతర్జాతీయంగా ఉన్న సమస్య అదే: ఏబీ డివిలియర్స్
- Lifestyle
Astrology Tips: స్త్రీలు చేయకూడని పనులు.. వాటిని చేయడం వల్ల ఇంట్లో దరిద్రమే
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
NTR30: ఎన్టీఆర్‌కు జోడీగా హైదరాబాద్ యువరాణి.. శ్రీదేవి కూతురి కోరిక అంతేనా!
బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తనదైన యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్, సాంగ్స్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ టాలీవుడ్‌లో సుదీర్ఘ కాలంగా టాప్ హీరోగా వెలుగొందుతోన్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ భీకరమైన ఫామ్‌లో ఉన్న అతడు.. రాజమౌళి తెరకెక్కించిన RRR (రౌద్రం రణం రుధిరం) మూవీతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. అప్పటి నుంచి మరింత ఉత్సాహంతో ప్రాజెక్టులు లైన్‌లో పెడుతున్నాడు. అందులో కొరటాల శివ తీసే సినిమా ఒకటి.
గుర్తుందా శీతాకాలం ట్విట్టర్ రివ్యూ: తమన్నాతో సత్యదేవ్ రొమాన్స్.. సినిమా టాక్ అలా.. ఇంతకీ హిట్టేనా!
RRR (రౌద్రం రణం రుధిరం) మూవీ షూటింగ్ జరుగుతోన్న సమయంలోనే టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తన 30వ చిత్రాన్ని బడా డైరెక్టర్ కొరటాల శివతో చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అయితే, ఈ సినిమా అనుకున్న సమయానికి మొదలు కావడం లేదు. దీంతో అసలు ఈ ప్రాజెక్టు ఉంటుందా? లేదా? అన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితమే దీనికి సంబంధించిన గ్లింప్స్‌ను వదిలారు. అలాగే, ఇటీవలే ఈ మూవీ నుంచి వరుసగా అప్‌డేట్లు వస్తున్నాయి. దీంతో త్వరలోనే ఇది మొదలవుతుందని క్లారిటీ వచ్చేసింది.

పాన్ ఇండియా రేంజ్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాను డిసెంబర్ మూడో వారం నుంచి మొదలు పెట్టబోతున్నట్లు ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇందులో నటించే హీరోయిన్ గురించి ఓ ఆసక్తికరమైన వార్త లీకైంది. ఈ సినిమా కోసం జాన్వీ కపూర్ కోరిక మేరకు చిత్ర యూనిట్ ఆమెనే తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోన్నా.. తాజాగా సీతా రామం ఫేం మృణాల్ ఠాకూర్‌ను ఫైనల్ చేశారని తెలిసింది. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన కూడా అధికారికంగా రాబోతుందని అంటున్నారు. ఇక, మృణాల్‌ను ఎంపిక చేశారన్న వార్తలతో తారక్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషీ అవుతున్నారు.
బ్రాలో అరాచకంగా ఆదా శర్మ: వామ్మో ఇంత దారుణంగా చూపిస్తే ఎలా!
జూనియర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కలయిలో రాబోతున్న ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి కోలీవుడ్ యంగ్ సెన్సేషన్ అనిరుథ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇది హిస్టారికల్ స్టోరీతో రూపొందబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.