Mrunal Thakur: టాలీవుడ్ స్టార్ హీరోతో మృణాల్.. మరో క్రేజీ ఆఫర్ పట్టిన బ్యూటీ
హీరోయిన్లుగా అవకాశాలను దక్కించుకోవాలంటే మామూలు విషయం కాదు. అలాంటిది మొదటి చిత్రంతోనే భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు క్రేజ్‌ను కూడా సొంతం చేసుకున్న నటి మృణాల్ ఠాకూర్. చాలా కాలం క్రితమే సీరియల్ నటిగా యమ ఫేమస్ అయిన ఈ అమ్మడు.. ఆ తర్వాత ఉత్తరాదిలో పలు సినిమాల్లో నటించి నేషనల్ వైడ్‌గా గుర్తింపును దక్కించుకుంది. ఈ క్రమంలోనే దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి తీసిన 'సీతా రామం' మూవీతో తెలుగులోకి హీరోయిన్‌గా ఎంటరైంది. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. తద్వారా ఆమెకు గ్రాండ్ ఎంట్రీ దక్కినట్లు అయింది.
మృణాల్ ఠాకూర్‌కు 'సీతా రామం' మూవీ వల్లే ఎనలేని రీతిలో క్రేజ్ వచ్చింది. దీంతో ఇప్పుడు ఈ భామ టాలీవుడ్‌లోని స్టార్ హీరోలతో నటించబోతుందని ప్రచారం జరుగుతోంది. అలాగే, దక్షిణాది భాషల్లోనూ కొన్ని ప్రాజెక్టుల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ సుందరాంగి నేచురల్ స్టార్ నాని నటిస్తోన్న 30వ సినిమాలో భాగం అయింది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్‌లో కూడా పాల్గొనబోతుంది. ఈ నేపథ్యంలో మృణాల్ ఠాకూర్ ఇప్పుడు మరో క్రేజీ ఆఫర్‌ను సొంతం చేసుకున్నట్లు ఫిలిం నగర్ ఏరియాలో ప్రచారం జరుగుతోంది.

ఈ మధ్య కాలంలో సినిమాలకు గ్యాప్ ఇచ్చిన విక్టరీ వెంకటేష్.. ఇప్పుడు 'హిట్' ఫ్రాంచైజీ డైరెక్టర్ శైలేష్ కొలనుతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. 'సైంధవ్' అనే టైటిల్‌తో రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యూలర్ షూట్ త్వరలోనే ప్రారంభం కాబోతుంది. ఇక, ఈ చిత్రంలో రుహానీ శర్మ ఒక హీరోయిన్‌గా నటిస్తున్నట్లు ఇప్పటికే న్యూస్ లీకైంది. ఇక, తాజా సమాచారం ప్రకారం.. ఇందులో క్యూట్ లేడీ మృణాల్ ఠాకూర్ కూడా హీరోయిన్‌గా చేస్తున్నట్లు తెలిసింది. ఇందులో ఆమె పాత్ర మరింత క్రేజీగా ఉండబోతుందనే టాక్ వినిపిస్తోంది.

'సైంధవ్' మూవీని పాన్ ఇండియా రేంజ్‌లో తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. అలాగే, నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయినపల్లి దీన్ని నిర్మిస్తున్నారు. ఇది సైంటిఫిక్ థ్రిల్లర్‌గా రాబోతుంది.


Click it and Unblock the Notifications











