మృణాల్ ఠాకూర్‌ నాకు క్రష్.. బ్యూటీపై మనసుపడ్డ టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్

సినిమాలతో కంటే వ్యక్తిగత వివాదాలతోనే నిత్యం వార్తల్లో ఉంటారు స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్. అందం, అభినయంతో టాలీవుడ్, బాలీవుడ్‌లలో గట్టిగా జెండా పాతింది మృణాల్. తొలుత బుల్లితెరపై తన అదృష్టం పరీక్షించుకున్న మృణాల్‌కు ఆ తర్వాత సినీరంగంలో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. గ్లామర్ రోల్స్‌తో పాటు నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు పడటంతో మృణాల్‌‌ టాప్ హీరోయిన్ రేసులో దూసుకెళ్తున్నారు. వచ్చిన ప్రతి ఆఫర్‌ను అంగీకరించకుండా కథకు స్కోప్ ఉన్న పాత్రలకే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు ఈ ముద్దుగుమ్మ.

మృణాల్‌పై గాసిప్స్
ఇక మృణాల్‌పై వచ్చినన్ని రూమర్స్ ఏ హీరోయిన్‌పై రాలేదని చెప్పొచ్చు. ఆమె ఫలానా స్టార్‌తో ఎఫైర్ సాగిస్తోందంటూ కుప్పలు తెప్పలుగా వార్తలు వచ్చాయి. ఇక ఈ ఏడాది కోలీవుడ్ స్టార్ హీరోతో ధనుష్ ఎక్కువగా కనిపించడంతో వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని గాసిప్స్ వైరల్ అయ్యాయి. వీటిపై ఇద్దరూ చెక్ పెట్టినా పుకార్లు ఆగలేదు. ఆ తర్వాత టాలీవుడ్ హీరో సుమంత్, టీమిండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్‌తోనూ మృణాల్ ప్రేమాయణం నడుపుతోందని గుసగుసలు వినిపించినా ఆ తర్వాత ఇవన్నీ గాలివార్తలుగా మారాయి. తాజాగా మృణాల్ ఠాకూర్ నా క్రష్ అంటూ బాంబు పేల్చారు టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ.

Mrunal Thakur is my Crush says Suryadevara Naga Vamsi His Comments Go Viral on Social Media

స్టార్ ప్రొడ్యూసర్‌గా నాగవంశీ
సాధారణ డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్ ప్రారంభించిన నాగవంశీ.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై చిన్నాచితకా చిత్రాలు తీస్తూ ఆ తర్వాత స్టార్ ప్రొడ్యూసర్ అనిపించుకున్నారు. చిన్న హీరోల నుంచి స్టార్ హీరోల వరకు ఏడాదికి కనీసం అరడజనుకు పైగా సినిమాలు చేస్తూ ప్రస్తుతం టాలీవుడ్‌లో మంచి ఊపులో ఉన్నారు నాగవంశీ. ఈ ఏడాది డాకు మహారాజ్, మ్యాడ్ స్క్వేర్, కింగ్డమ్, మాస్ జాతర సినిమాలను నిర్మించి విడుదల చేశారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ నటించిన హిందీ చిత్రం వార్ 2ను తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేశారు.

నాగవంశీపై ట్రోలింగ్
వీటిలో కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరచడంతో ఆయనపై దారుణంగా ట్రోలింగ్ జరిగింది. ఇండియాను వదిలేసి దుబాయ్‌కి మకాం మార్చారంటూ వంశీపై కామెంట్స్ పెట్టారు. వీటిన్నంటినీ ఎదుర్కొన్న ఆయన పట్టుదలగా సినిమాలు చేస్తున్నారు. ఈసారి గట్టిగా కమ్‌బ్యాక్ ఇస్తానని నాగవంశీ పలు ఇంటర్వ్యూలలో చెబుతున్నారు. కొత్త సంవత్సరంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నుంచి భారీ లైనప్ ఉంది. దాదాపు 10 సినిమాల వరకు వంశీ చేతిలో ఉన్నాయి.

2026లో సితారదే హవా
లెనిన్, అనగనగా ఒకరాజు, సూర్య 46, ఫంకీ, ఆల్కహాల్, ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్, వాయుపుత్ర, మేజిక్, విసా- వింటారా సరదాగా తదితర సినిమాలను ఆయన నిర్మిస్తున్నారు. ఈ సంక్రాంతికి నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నటించిన అనగనగా ఒకరాజు సినిమా రిలీజ్ కానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండగా.. దీనికి సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సూర్యదేవర నాగవంశీ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఆ హీరోయిన్ నా క్రష్
2025 సంవత్సరం తను అనుకున్నట్లు సాగలేదని.. అందుకే 2026 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు వంశీ తెలిపారు. ఒక సినిమాతో లాభం వస్తే.. మరో సినిమాతో నష్టం రావడం సహజం. కొన్ని డెసిషన్స్ నేను ఓవర్ కాన్ఫిడెన్స్‌తో తీసుకున్నాను.. కానీ అవన్నీ మిస్‌ఫైర్ అయ్యాయి. మనకి కొంచెం ఎక్కువైంది అనిపించినప్పుడు దేవుడు కిందపడేస్తాడు అని వంశీ తెలిపారు. సంక్రాంతికి విడుదలయ్యే నా సినిమా విషయంతో రిస్క్ తీసుకోదలచుకోలేదు. అందుకే త్రివిక్రమ్ గారి సలహా సూచనలు తీసుకుంటున్నా అని వంశీ చెప్పారు. ఇక మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు? మీ క్రష్ ఎవరు? అని యాంకర్ ప్రశ్నించగా.. ఈ మధ్యన నా క్రష్ ఎక్కువగా మృణాల్ ఠాకూర్ అని ఆన్సర్ ఇచ్చారు సూర్యదేవర నాగవంశీ. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X