MS Dhoni బ్యానర్‌పై LGM.. సాక్షి ధోని నిర్మాతగా మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
ఇండియన్ క్రికెట్ రంగంలో సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా చరిత్ర సృష్టించిన మహేంద్ర సింగ్ ధోని వినోద రంగంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. ధోని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌ను స్థాపించి తొలి ప్రాజెక్టును తెలుగులో ప్రారంభించడం సినీ అభిమానులు, క్రికెట్ అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. తెలుగు తమిళ భాషల్లో రూపొందుతున్న LGM (ఎల్‌జీఎం) సినిమాను విడుదలకు ముస్తాబు చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్‌కు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
ధోని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రూపొందుతున్న LGM (ఎల్‌జీఎం) చిత్రానికి రమేష్ తమిలమణి దర్శకత్వం వహిస్తున్నారు. ధోని సతీమణి సాక్షి ధోని నిర్మిస్తున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా పూర్తి చేసుకొంటున్నది. అయితే ఈ సినిమా రిలీజ్ గురించి దర్శకుడు రమేష్ పలు విషయాలను వెల్లడించారు.

దర్శకుడు రమేష్ తమిళ్‌మణి మాట్లాడుతూ .. LGM (ఎల్‌జీఎం) చిత్రం హ్యుమర్, ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తో కలబోసి రూపొందిస్తున్నాం. ఇది పక్కా కామెడీ ఫ్యామిలి డ్రామా. ఈ సినిమా ప్రయాణం ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతుంది. అంతేకాకుండా భావోద్వేగమైన అంశాలు హృదయాన్ని టచ్ చేసేలా ఉంటాయి. LGM (ఎల్‌జీఎం) చిత్రానికి మీరు అందిస్తున్న సహకారం, కురిపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు అని అన్నారు.

LGM (ఎల్‌జీఎం) సినిమాకు సంబంధించిన టీజర్‌ను ఇటీవల రిలీజ్ చేయగా బ్రహ్మండమైన రెస్సాన్స్ వచ్చింది. అలి తక్కువ కాలంలోనే డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌పై 7 మిలియన్ వ్యూస్ సాధించడం విశేషంగా మారింది. ఇక ఈ సినిమాకు దర్శకుడు రమేష్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో హరీష్ కల్యాణ్, నదియా, ఇవానా, యోగిబాబు, మిర్చి విజయ్ తదితరులు నటిస్తున్నారు.

LGM (ఎల్‌జీఎం) చిత్రం ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని రిలీజ్ సిద్దమవుతున్నది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించి.. ట్రైలర్ ఇతర ప్రమోషనల్ కార్యక్రమాలను చేపట్టేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











