MS Dhoni- Sandeep Reddy: మాస్ గ్యాంగ్‌స్టర్‌గా ఎంఎస్ ధోని.. ఆ రెండు కలిపి సందీప్ రెడ్డి వంగ అదరగొట్టేశాడుగా

కబీర్ సింగ్, యానిమల్ సినిమాలతో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్‌లో పాగా వేశాడు. ఆయనతో సినిమాలు తీయడానికి టాప్ నిర్మాతలు క్యూ కడుతున్నారంటే ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఇక క్రికెట్ రంగాన్ని శాసిస్తున్న ఎంఎస్ ధోని అంటే క్రికెట్, సినీ అభిమానుల్లో పిచ్చ క్రేజ్ ఉందనడంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. ఆయన తెరపై కనిపిస్తే చూడాలనుకొనే వారు కోకొల్లలు. అలాంటి సందీప్ రెడ్డి వంగా, ఎంఎస్ ధోని కలిసి సినిమా చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవడమే కష్టం. వారిద్దరి కాంబినేషన్‌లో వస్తే.. దేశమంతా సీటీమార్ కొట్టాల్సిందే. అయితే వారిద్దరి కలయికలో ఓ యాడ్ వచ్చింది. ఆ వ్యాపార ప్రకటన కోసం తీసిన ప్రోమో చూస్తే మతిపోవాల్సిందే. ఈ వీడియోను మీరే చూడండి..

ఈమోటోరాడ్ అనే ఎలక్ట్రానిక్ సైకిల్ ఉత్పత్తి కంపెనీ ప్రమోషన్స్ కోసం ఎంఎస్ ధోని, సందీప్ రెడ్డి వంగా చేతులు కలిపారు. ఈ యాడ్ కోసం ధోనిని ఓ రేంజ్‌లో మాస్ హీరో అవతారాన్ని క్రియేట్ చేశాడు. క్రికెట్ రంగంలోకి MSD అడుగు పెట్టిన రోజుల్లో తలవెనుక పొడుగాటి జుట్టుతో క్రేజీగా లుక్‌ను మేకోవర్ చేశారు. ఇంకే ముందు ఆయనను సందీప్ సైకిల్ ఎక్కించి మ్యాజిక్ చేశాడు.

MS Dhoni joins hands with Sandeep Reddy Vanga for EMotorad

యాడ్ ప్రారంభంలో వరుసగా నాలుగు కార్లు ఆగగానే స్టైలిష్‌గా ధోని కారు డోర్ తెరుచుకొని బయటకు వచ్చాడు. కళ్లకు నల్లని గాగుల్స్, బ్లూ కోట్‌తో స్టార్ హీరోలకు ఏ మాత్రం తగ్గని విధంగా ఎంట్రీ ఇచ్చి అదరగొట్టాడు. నోట్లో టూత్ పిక్ పెట్టుకొని సైగ చేయగానే.. నలుగురు గన్స్ పట్టుకొని వెంటరాగా.. ధోని సైకిల్‌ను నడిపించుకొంటూ వెళ్లాడు. అంతలోనే కట్.. కట్.. కట్ అంటూ గట్టిగా ఓ అరుపు వినిపించింది. మైండ్ బ్లోయింగ్.. ఫెంటాస్టిక్.. విజిల్స్ కొట్టడం ఖాయం అని సందీప్ అంటే.. నేను చెవిటి వాడిని కాదు.. నాకు వినిపిస్తూనే ఉంది అంటూ కొంత చిరాకు పడ్డాడు. ఆ మాటలు వినకుండానే నాకు హీరో దొరికేశాడు అంటూ సందీప్ అన్నాడు.

Take a Poll

ఆ తర్వాత షాట్‌లో ధోని స్టైయిల్‌గా సైకిల్‌పై వచ్చి.. మరింత స్టయిల్‌గా స్టాండ్ వేసి.. కీ చేతులోకి తీసుకొన్నాడు. అంతలోనే కట్ అంటూ సందీప్ చెప్పాడు. ఆ తర్వాత ధోని వైపు నడుచుకొంటూ వచ్చి.. సాండీ.. నాకు వెనుక జుట్టు కాస్త ఎక్కువ కాలేదా? అని అడిగితే.. అంతే ఉండాలి అంటే.. యార్ ఇది ఎలక్ట్రికల్ సైకిల్ యాడ్ అంటే.. నెక్ట్స్ సీన్ ఏమౌతుందో చూడు అంటూ సందీప్ కట్ చేశాడు.

MS DHONI Banger

ఆ తర్వాత షాట్‌లో వెనుక జట్టు లేకుండా రెగ్యులర్ కట్‌తో ధోని ఎంట్రీ ఇచ్చాడు. సైకిల్ ముందుకు వచ్చి.. సందీప్ రెడ్డి వంగా స్టయిల్‌లో చేతితో ఓ సిగ్నల్ ఇచ్చాడు. దాంతో ఎలక్ట్రికల్ సైకిల్ యాడ్ పూర్తయింది. ఈ యాడ్‌ను ధోని, సందీప్ తమదైన రీతిలో డాషింగ్ స్టయిల్‌లో పూర్తి చేశారు. ముఖ్యంగా అర్జున్ రెడ్డి, యానిమల్‌ను మిక్స్ చేసి కొత్త జోనర్‌ను క్రియేట్ చేశారు. ఈ యాడ్ చూసిన వెంటనే వారిద్దరి కాంబినేషన్‌లో మాస్, గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఓ సినిమా వస్తే ఎలా ఉంటుందనే ఆలోచన ప్రతీ ఒక్కరికి కలగడం సహజంగానే అనిపిస్తుంది. ఆ యాడ్‌పై మీరు కూడా ఓ లుక్ వేయండి.

సందీప్ రెడ్డి వంగా విషయానికి వస్తే.. యానిమల్ సినిమా తర్వాత స్పిరిట్ సినిమా కోసం రెడీ అవుతున్నారు. ఆ తర్వాత యానిమల్ పార్క్ సినిమాను చేయనున్నారు. ఇంకా అల్లు అర్జున్, రాంచరణ్‌తో కలిసి సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. ఇంకా చాలా ప్రాజెక్టులు ఆయన వద్ద ఉన్నాయి. రానున్న రోజుల్లో వాటి వివరాలు తెలుస్తాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X