టాప్ హీరోలని సైతం తలదన్నే రెమ్యునరేషన్.. కేవలం 8 గంటలకి ఇన్ని కోట్లు ఛార్జ్ చేసిన ఎంఎస్ ధోని
ప్రస్తుతం ఇండియాలో సినిమా మార్కెట్ అంతా మారిపోయింది. ప్రొడక్షన్ కాస్ట్ తో పాటుగా గ్లోబల్ వైడ్ గా మరింత లెవెల్లో భారతీయ సినిమా పెర్ఫామ్ చేస్తుండడంతో భారీ వసూళ్లు వచ్చి పడుతున్నాయ్. కాగా దీనితోనే సినిమాలు చేసే నటీనటులు కూడా భారీ మొత్తంలో రేట్లు చెప్పినప్పటికీ వారి మార్కెట్ మీద నమ్మకం ఉంటే అంత మొత్తం ఇచ్చి మరీ సినిమాలు చేయించుకునే నిర్మాతలు ఉన్నారు.
అలా ఇప్పుడు ఇండియాలో టాప్ రెమ్యునరేషన్ తీసుకునే హీరో హీరోయిన్స్ చాలా మందే కనిపిస్తాయి. కాగా మొన్ననే దళపతి విజయ్ తన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం సినిమాకి ఏకంగా 200 కోట్లు తీసుకున్నాడని నిర్మాతలు చెప్పారు అలాగే తన లాస్ట్ సినిమాకి ఏకంగా 250 నుంచి 275 కోట్ల రెమ్యునరేషన్ ని తీసుకుంటున్నట్టుగా కూడా టాక్ వచ్చింది.

ఇక తనతో పాటుగా అల్లు అర్జున్, ప్రభాస్ లాంటి స్టార్స్ సౌత్ మార్కెట్ లో ఈజీగా 100 కోట్లకి పైగానే రెమ్యునరేషన్ లు అందుకుంటున్నారు. కాగా ఒకో హీరోకి వారి మాస్ మార్కెట్ డిమాండ్ బట్టి రోజు వారీగా కూడా రెమ్యునరేషన్ లు చెల్లించే వారు కూడా ఉన్నాయి. కానీ ఈ అందరి బిగ్ స్టార్స్ ని తలదన్నేలా థలా మహేంద్ర సింగ్ ధోని అందుకున్న రెమ్యునరేషన్ వింటే కళ్ళు చెదారాల్సిందే.
సినిమాల్లో మనకి పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ లాంటి హీరోలు ఎలాంటి మాస్ క్రేజ్ ని సొంతం చేసుకున్నారో అలాగే క్రికెట్ లో మహేంద్ర సింగ్ ధోనికి దేశ వ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. అలాగే ఐపీఎల్ లాంటి మ్యాచులు కూడా ధోని నమ స్మరణ తోనే డామినేట్ అయ్యిన సందర్భాలు ఉన్నాయి. అందుకే ధోని కూడా ఎక్కువే ఛార్జ్ చేస్తాడని తెలుసు.
కాగా ధోని సినిమాల్లోకి ఎంటర్ కాలేదు కానీ సినిమా రిలేటెడ్ గా తన బయోపిక్ రిలీజ్ అయ్యింది అలాగే తన భార్యతో కలిసి నిర్మాతగా కూడా థలా మారాడు. కాగా ఇదే క్రేజ్ తో లేటెస్ట్ గా ధోని ఓ టీవీ కమర్షియల్ యాడ్ చేసాడట. ఈ యాడ్ కోసం కేవలం ధోని 8 గంటల సమయం మాత్రమే షూట్ చేసాడట. మరి ఈ 8 గంటలకి గాను ఏకంగా 25 కోట్ల రెమ్యునరేషన్ ని ఛార్జ్ చేసాడట.

దీనితో ఈ వార్త సినీ వర్గాల్లో కూడా వైరల్ గా మారింది. జెనరల్ గా ఒకో టాప్ స్టార్ రోజు పరంగా చూసుకున్నా మినిమమ్ 2 నుంచి 5 కోట్లు మాత్రమే ఛార్జ్ చేస్తారు కానీ కేవలం 8 గంటలకి 25 కోట్ల పారితోషికం అంటే ఇది మామూలు మాస్ కాదని చెప్పాలి. మొత్తానికి ఎం ఎస్ ధోని క్రేజ్ అయితే యాడ్ మార్కెట్ లో ఈ లెవెల్లో ఉందని చెప్పాలి.
కాగా ఇదే క్రేజ్ తోనే ఐపీఎల్ వారు మరొక్క సీజన్ వరకు ధోనిని కంటిన్యూ చెయ్యాలని చూస్తున్నారు. అయితే ధోని నిర్మాతగా మారిన తర్వాత తమిళ్ లో ఒక్క సినిమా మాత్రమే చేశారు. ఈ తర్వాత తమిళ్ లో కానీ తెలుగులో కానీ ఎలాంటి సినిమాకి కమిట్ కానట్టు తెలుస్తుంది. మొదటి సినిమా పెద్దగా హిట్ కాకపోయేసరికి రెండో సినిమా అయినా మంచిది ప్లాన్ చేసుకుంటున్నారు కాబోలు.


Click it and Unblock the Notifications











