30 సెకండ్ల యాడ్.. ఎంఎస్ ధోనీ ఎన్ని కోట్లు తీసుకున్నారో తెలుసా? షాకింగ్
స్టార్ క్రికెటర్, తలా, మహేంద్ర సింగ్ ధోని రీసెంట్ గా ఒక కమర్షియల్ యాడ్ లో నటించారు. ఆ యాడ్ కు సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ మధ్య వచ్చిన ఆ యాడ్ కు విశేష స్పందన లభించింది. మహేంద్ర సింగ్ ధోనికీ ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ లో తెలిసిందే. మరోవైపు సందీప్ రెడ్డి వంగ కూడా తన చిత్రాలతో ఇండియాలో సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
కాగా వీరిద్దరి కాంబినేషన్లో కమర్షియల్ యాడ్ రూపుదిద్దుకోవడం సెన్సేషన్ గా మారింది. ఇద్దరు లెజెండ్స్ కలిసి చేసిన ప్రాజెక్ట్ విజయవంతమైంది. ఇటీవల ఆ యాడ్ కూడా విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. కాగా, గ్రేట్ క్రికెటర్ ఎంఎస్ ధోని డైరెక్ట్ చేయాలని ఎంతోమంది దర్శకులు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇక ఆ అవకాశం సందీప్ రెడ్డి వంగకు దక్కడం విశేషంగా మారింది. కమర్షియల్ యాడ్ తో నైనా సందీప్ రెడ్డి వంగ మహేంద్రసింగ్ ధోని నీ డైరెక్ట్ చేసే అవకాశాన్ని దక్కించుకున్నారని అంటున్నారు.

ప్రస్తుతం యాడ్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎలక్ట్రిక్ బైస్కిల్ కు సంబంధించిన ఈ కమర్షియల్ యాడ్ ను సందీప్ రెడ్డి వంగ తన బ్లాక్ బాస్టర్ మూవీ యానిమల్ లోని కొన్ని కీలక సన్నివేశాల స్ఫూర్తితో క్రియేట్ చేశారు. యానిమల్ చిత్రంలో రన్బీర్ కపూర్ గ్యాంగ్ తో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లే సన్నివేశాన్ని, ఇక సినిమా ప్రారంభంలో రన్బీర్ కపూర్ బైక్ పై వెళ్లే సీన్ ను, అలాగే చివర్లో అనిమల్ సిగ్నేచర్ సీన్ కలిపి ఈ యాడ్ ఫిలిమ్ ను షూట్ చేశారు.
ఈ యాడ్ షూట్ లో సందీప్ రెడ్డి వంగ ఎంఎస్ ధోనీని డైరెక్ట్ చేయడంతో పాటు తను కూడా కనిపించడం ఫ్యాన్స్ ని ఎంతగానో కృషి చేసింది. అయితే ఇప్పుడు ఈ కమర్షియల్ యాడ్ ఫిల్మ్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఎంఎస్ ధోని ఈ యాడ్ ఫిలింలో నటించేందుకు భారీ పారితోషకం తీసుకున్నట్టు తెలుస్తుంది. 30 సెకండ్ల నిడివి ఉండే ఈ యాడ్ ఫిలిం కోసం మహేంద్రసింగ్ ధోని ఏకంగా 8 కోట్ల రూపాయలు ఛార్జ్ చేశారంట. ఈ న్యూస్ ఇప్పుడు సెన్సేషనల్ గా మారింది. పలువురు ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకున్నారా అంటూ షాక్ అవుతున్నారు.
మరోవైపు మహేంద్రసింగ్ ధోని రేంజ్ అది అంటూ గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇక సందీప్ రెడ్డి వంగకు రెండు చిత్రాలతోనే ఏకంగా ఇంటర్నేషనల్ స్టార్ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనిని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చిందంటూ కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక సందీప్ రెడ్డి నెక్స్ట్ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తో క్రేజీ ప్రాజెక్టును తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ప్రభాస్ ను సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా చూపించబోతున్నారు. ఉగాది నుంచి షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం కూడా ఉందని అంటున్నారు. నాన్ స్టాప్ గా 69 రోజుల షూట్ చేసేందుకు సందీప్ రెడ్డి వంగ సీన్లను సెట్ చేసి పెట్టారంట. ఇక ఈ చిత్రంలో కూడా భారీ తారాగణం ఉండబోతుందని సమాచారం.


Click it and Unblock the Notifications











