twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పూరీ జగన్నాథ్, సుధాకర్ రెడ్డి నా దేవుళ్లు.. ఆగస్టు 12న వారి రుణం.. దర్శకుడు శేఖర్ ఎమోషనల్

    |

    నితిన్, కృతిశెట్టి జంటగా నటించిన మాచర్ల నియోజకవర్గం చిత్రం ఆగస్టు 12 రిలీజ్ కాబోతున్నది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక సందర్భంగా దర్శకుడు రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. మమల్ని ఆశీర్వదించడానికి వచ్చిన సురేందర్ రెడ్డి, మెహర్ రమేష్, మేర్లపాక గాంధీకి థ్యాంక్స్. ఈ స్థాయికి రావడానికి 15 ఏళ్లు పట్టింది. ప్రతీ ఒక్కరి జీవితంలో చాలా కష్టాలు ఉంటాయి. కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. నేను ఇంటర్మీడియెట్ చదివేటప్పుడు మా నాన్న గారు చనిపోయారు. అప్పటి నుంచి నాకు సపోర్ట్ చేసిన నా కుటుంబ సభ్యులందరికీ థ్యాంక్స్. ఎడిటింగ్ అసిస్టెంట్‌గా చేస్తున్నప్పుడు నేను ఎడిటర్ కావడానికి కారణమైన మా అన్నయ్య దినేష్‌కు రుణపడి ఉంటాను అని రాజశేఖర్ అన్నారు.

    MS Rajashekhar Reddy speech

    ఇండస్ట్రీలో టెక్నీషియన్‌గా గుర్తింపు రావడానికి కారణమైన నా దేవుడు పూరీ జగన్నాథ్‌కు బిగ్ థ్యాంక్స్. నేను ఎంత కష్టపెట్టినా నన్ను నా భార్యకు బిగ్ థ్యాంక్స్. నన్ను ఎడిటర్ నుంచి డైరెక్టర్‌గా చేసిన నితిన్ చాలా పెద్ద థ్యాంక్స్. కానీ ఒక విషయం మీకు చెప్పాలి. 2011లో లై సినిమా యూఎస్‌లో చేసేటప్పుడు.. ఏదైనా కథ ఉంటే చెప్పవచ్చు కదరా అని అంటే.. రాస్తే ఒప్పుకొంటావా అని నేను అడిగాను. నచ్చితే ఇస్తా అని అన్నాడు. ఆ తర్వాత సంక్రాంతి రోజున వెళ్లి కథ చెప్పాను. నాకు డైరెక్టర్‌గా ఆఫర్ ఇచ్చారు. మాట నిలబెట్టుకోవడం చాలా తక్కువ మంది చేస్తారు. అలాంటి మనసున్న మా వాడు నితిన్. ఇది నాకు చాలా ఎమోషనల్ ఫీలింగ్. ఫ్రెండ్ షిప్‌ను నిలబెట్టుకోవడం చాలా కష్టం. అలా నిలబెట్టుకొనే వారిలో నితిన్ ముందుంటాడు అని రాజశేఖర్ రెడ్డి అన్నారు.

    ఆగస్టు నెలలో రిలీజైన లై సినిమా హను రాఘవపూడి, నితిన్, నాకు చేదు అనుభవాన్ని ఇచ్చింది. కానీ ఆగస్టు నెలలో హను రాఘవపూడి సీతారామం సినిమాతో మంచి హిట్ ఇచ్చేశాడు. త్వరలోనే మేము కూడా మంచి హిట్ కొట్టబోతున్నాం అని శేఖర్ అన్నారు.

    పూరీ జగన్నాథ్ వద్ద నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏడాదిపాటు చాలా కష్టాలు అనుభవించాను. అవకాశాలు వస్తాయా రావా అనేది తెలియదు. అలాంటి సమయంలో నిర్మాత సుధాకర్ రెడ్డి గారు దేవుడిలా నన్ను పిలిచి ఆయన బ్యానర్‌లో వరుసగా అవకాశాలు ఇచ్చి ఆదుకొన్నారు. ఆ దేవుడి రుణాన్ని ఆగస్టు 12న తీర్చుకోబోతున్నాను. నిఖితా రెడ్డి అక్క కూడా టార్గెట్ రీచ్ అవుతున్నారు అని శేఖర్ అన్నారు.

    టెక్నిషియన్స్ గురించి మాట్లాడుతూ.. మావిడాల తిరుపతి డైలాగ్స్‌ను బుల్లెట్స్‌లా దించుతాయి. కథ విషయంలో సహాయం అందించిన ఆర్కే, వినోద్, చైతన్య వక్కాంతంకు థ్యాంక్స్. డీవోపీ ప్రసాద్ మూరేళ్ల గురించి కాస్త ఎక్కువగానే చెప్పాలి. ఆయన సపోర్ట్ మరిచిపోలేను. నన్ను చాలా అర్దం చేసుకొన్నారు. మహతి సాగర్ అద్బుతమైన సాంగ్స్ ఇచ్చారు అని శేఖర్ తెలిపారు.

    English summary
    Nithiin's Macherla Niyojakavargam is set to release on August 01th. In this occassion, Movie unit organised Pre Release Event in Hyderabad. Here is the MS Rajashekhar Reddy speech
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X