స్టార్ హీరోయిన్ అయితే గొప్పా .. నా ఇగోని రెచ్చగొడితే... టాప్ ప్రొడ్యూసర్ షాకింగ్ కామెంట్స్

తెలుగులో బడా నిర్మాణ సంస్థగా ఒకప్పుడు ఓ వెలుగు వెలిగింది సుమంత్ ఆర్ట్ పొడక్షన్స్. 1987లో మనవాడొస్తున్నాడు సినిమాతో తన ప్రస్థానం ప్రారంభించారు ఎంఎస్ రాజు. ఆ తర్వాత శత్రువు, పోలీస్ లాకప్, స్ట్రీట్ ఫైటర్, దేవి, దేవిపుత్రుడు, మనంతా నువ్వే, నీ స్నేహం, ఒక్కడు, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా?, పౌర్ణమి, ఆట, వాన, మస్కా తదితర చిత్రాలతో తెలుగునాట తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే గత కొంతకాలంగా సినీ నిర్మాణానికి దూరంగా ఉంటున్నారు ఎంఎస్ రాజు. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్, ఇతర అంశాలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

భారీ చిత్రాలకు కేరాఫ్‌గా
ఒకప్పుడు టాలీవుడ్‌‌లో బడా చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచిన సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ ఈ మధ్య వెనుకబడింది. నిర్మాత నుంచి దర్శకుడిగానూ మారారు రాజుగారు. వాన సినిమాతో దర్శకుడిగా మెగా ఫోన్ పట్టారు. తునీగా తునీగా, డర్టీ హరి, సెవెన్ డేస్ 6 నెట్స్, మళ్లీ పెళ్లి సినిమాలను డైరెక్ట్ చేసినా వాటిని ప్రేక్షకులు అంతగా ఆదరించలేదు. దీంతో సరైన కమ్ బ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నారు. తునీగ తునీగ సినిమాతో తన తనయుడు సుమంత్ అశ్విన్‌ను వెండితెరకు పరిచయం చేశారు ఎంఎస్ రాజు. హీరోగా అంతకు ముందు ఆ తర్వాత, లవర్స్, చక్కిలిగింత, కేరింత, కొలంబస్, రైట్ రైట్, హ్యాపీ వెడ్డింగ్ తదితర సినిమాలు చేసినా సుమంత్ నిలదొక్కుకోలేకపోయాడు. తాజాగా రాజుగారు ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలను ప్రస్తావించారు.

MS Raju Clarity About clashes with Ileana D Cruz Issue

సినిమాలపై ఇంట్రెస్ట్ లేదు
ఎంఎస్ రాజుగారు మళ్లీ నిలబడాలని కోరుకునేవారే. ప్రభాస్, మహేశ్, త్రిష వంటి స్టార్స్‌ నిలదొక్కుకునేలా చేశా. వాళ్లందరినీ డేట్స్ అడగాలంటే నా దగ్గర మంచి సబ్జెక్ట్ ఉండాలి. నాకు ప్రస్తుతం సినిమాలు తీయడంపై ఇంట్రెస్ట్ లేదు. మైండ్‌లో టెన్షన్ పెట్టుకుని సినిమాలు తీయలేను. నా టెన్షన్ అంతా మంచి కథ, కాన్సెప్ట్ మీదే.. నాకు నచ్చిన కథతో చిన్న సినిమాలే తీస్తా. పెద్ద హీరోలు ఉన్నంత మాత్రాన ఓపెనింగ్స్ రావు.. చిన్న సినిమాకు కూడా ఓపెనింగ్స్ కూడా వస్తాయి అని ఎస్ఎస్ రాజు తెలిపారు.

నాతో గొడవపడితే
ఓ స్టార్ హీరోయిన్‌తో నేను గొడవ పడినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ హీరోయిన్ ఎవరో పేరు చెబితే ఏం జరిగిందో చెబుతా. స్టార్ హీరోయిన్ అనే కాదు.. ఎవరైనా నాతో గొడవ పెట్టుకుంటే, కోట్లు పోయినా పర్లేదు.. సగం సినిమా మధ్యలోనే ఆపేసి వెళ్లిపోతా. అలా నిజంగా ఒక పెద్ద సినిమాను ఆపేయబోయాను కూడా. వాళ్లంతా బతిమాలి మీరు అనుకున్నది చేయండి అని చెబితే సినిమాను కంటిన్యూ చేశాను. ఒక పెద్ద సినిమా, భారీ స్టార్ క్యాస్టింగ్.. ఒక షెడ్యూల్ జరిగిన తర్వాత ఆపేద్దాం అనుకున్నా అని ఎంఎస్ రాజు గుర్తుచేసుకున్నారు.

నా ఇగోని హర్ట్ చేస్తే
నాకు వ్యతిరేకంగా జరుగుతోంది అని తెలిసినప్పుడు ఇక వద్దు అనుకున్నా. డబ్బు పోతే పోయింది.. ఎక్కడి నుంచి వచ్చాం. ఏం లేకుండా వచ్చాం.. మళ్లీ మనం అక్కడికే వెళ్తాం. ఇగో అని అందరూ అనుకుంటారు.. కానీ అది ఆత్మాభిమానం. నేను అనుకున్న విధంగా జరగలేదని ఓ సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లలేదు. ఆ సబ్జెక్ట్‌ని వేరే వాళ్లు డీల్ చేశారు.. ఫ్లాప్ అయ్యింది అని ఎంఎస్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఎంఎస్ రాజుతో గొడవపడ్డ హీరోయిన్ ఎవరు? ఎందుకు గొడవైంది? అనే కామెంట్స్ పెడుతున్నారు.

More from Filmibeat

Read more about: ms raju ileana d cruz
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X