వాటి గురించి ఇప్పుడే మాట్లాడను.. ‘డర్టీ హరి’పై ఎంఎస్ రాజు కామెంట్స్ వైరల్
ఒకప్పుడు అందమైన ప్రేమ కథా చిత్రాలు, కుటుంబమంతా మెచ్చే సినిమాలు, అంతా కలిసి చూసే సినిమాలు నిర్మించాడు నిర్మాత ఎంఎస్ రాజు. కానీ ప్రస్తుతం ట్రెండ్‌కు తగ్గట్టు మారిపోయినట్టున్నాడు. అందుకే బోల్డ్ చిత్రాన్ని తెరకెక్కించాడు. డర్టి హరి అంటూ టైటిల్‌లోనే సినిమా ఎలా ఉంటందో వివరించాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలు, ట్రైలర్‌లతో డర్టీ హరి ఓ రేంజ్‌లో క్లిక్ అయింది.
డర్టీ హరి ఈ నెల 18 న ఫ్రైడే మూవీస్ ఆన్ లైన్ ATT ద్వారా ఈ సినిమా విడుదల కానుంది. దర్శకుడు ఎం.ఎస్. రాజు మాట్లాడుతూ.. నేను నిర్మాతగా చాలా జానర్‌లలో సినిమాలు తీశాను. దర్శకునిగా ఓ కొత్త జానర్ ప్రయత్నిద్దామని 'డర్టీ హరి' తీశాను. ఈ విషయంలో నాకు మంచి స్నేహితులైన గూడూరు శివరామకృష్ణ చాలా పెద్ద అండగా నిలబడ్డారు. ఎం.ఎస్.రాజు ఏంటి? ఇలాంటి సెక్స్ సినిమా తీసాడేంటని సోషల్ మీడియాలో కొంతమంది కామెంట్లు చేయడం చూసాను అని అన్నాడు

ఎం.ఎస్. రాజు మాట్లాడుతూ ఇంకా మాట్లాడుతూ.. అలాంటి కామెంట్ల గురించి ఇప్పుడేం మాట్లాడను. నేనెందుకీ సినిమా తీసాను ? ఇలా ఎందుకు తీసాను ? అనేది ఈ నెల 18 న సినిమా చూస్తే అర్ధమవుతుంది. ఈ సినిమా మేకింగ్‌ని పర్సనల్‌గా ఎంజాయ్ చేస్తూ తీశాను. నా కెరీర్ లోనే గొప్ప స్క్రీన్ ప్లే సినిమాగా నిలిచిపోతుంది. కథ విషయానికి వస్తే - ఇదొక విభిన్నమైన కాన్సెప్ట్ . ప్రతి మనిషిలోనూ అంతర్గతంగా ఇంకొక మనిషి దాగి ఉంటాడు. మనం రోజూ చూసే మనిషి, పైకి కనపడే మనిషి ఒక్కోసారి వేరే రకంగా కనిపిస్తారు. ఆ లోపలి మనిషి ఒక్కోసారి గాడి తప్పి ప్రవర్తించొచ్చు.
ఆ యానిమల్ ఇన్స్టింక్ట్ వల్ల చాలా పరిణామాలు సంభవిస్తాయి. ఇందులో హీరో పాత్రకు ఇద్దరమ్మాయిలతో ఏర్పడిన అనుబంధం అనేక పరిణామాలకు దారి తీస్తుంది. ఈ ముగ్గురి మధ్యన జరిగే డ్రామా చాలా కొత్తగా ఉంటుంది. హీరో శ్రవణ్ రెడ్డి స్క్రీన్ మీద మేజిక్ చేసాడు. సిమ్రత్ కౌర్ తన పాత్రలో జీవించింది. రుహాని శర్మ పాత్రకి మంచి మార్కులు పడతాయి. ఖర్చుకి వెనుకాడకుండా ఈ సినిమా తీసిన నిర్మాతలు గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్ లను ఈ సందర్భంగా అభినందిస్తున్నాను అని చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications











