7 Days 6 Nights యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్.. ప్రేక్షకులకు ఎంఎస్ రాజు ఇచ్చిన బంపర్ ఆఫర్ ఎమిటో తెలుసా?
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో సుమంత్ అశ్విన్ ఎం, రజనీకాంత్ ఎస్ నిర్మించారు. వైల్డ్ హనీ ప్రోడక్షన్స్, వింటేజ్ పిక్చర్స్, ఏబిజి క్రియేషన్స్ సంయుక్తంగా స్టార్ ప్రొడ్యూసర్ ఎం ఎస్ రాజు దర్శకత్వం వహించిన తాజా సినిమా 7 డేస్ 6 నైట్స్. సుమంత్ అశ్విన్, రోహన్ హీరోలుగా నటించగా మెహర్ చాహల్, కృతికా శెట్టి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం జూన్ 24న సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా మీడియా సమాశంలో ఎంఎస్ రాజు మాట్లాడుతూ..
7 డేస్ 6 నైట్స్ చిత్రానికి సంబంధించిన కొత్త ట్రైలర్ విడుదల చేశాం. యూత్‌ఫుల్ ట్రైలర్‌గా ఆకట్టుకొంటున్నది. ఈ సినిమా విషయంలో నిర్మాణ భాగస్వాములు అయిన రజనీకాంత్ గారు, ఏజీబీ క్రియేషన్స్, శ్రీనివాస రాజుకు థాంక్స్. రామరాజు, కిరణ్ ఉపేంద్ర, విజయ్... మా టీమ్‌లో అందరికీ థాంక్స్. సినిమాకు వస్తే... లో బడ్జెట్ సినిమాగా తీసి.. ప్రేక్షకుల మీదకు తోసేయాలని అనుకోలేదు. లాక్‌డౌన్ పరిస్థితులను ఎదుర్కొని ప్రేక్షకులకు మంచి సినిమా ఇవ్వాలని ప్రయత్నం చేశాం. చిన్న సినిమా థియేటర్లలో వండర్స్ క్రియేట్ చేస్తుందో చూపించాలని అనుకుంటున్నాం. 7 డేస్ 6 నైట్స్ అనే బాంబు తీసుకొస్తున్నాం. తెలంగాణ, రాయలసీమ, ఆంధ్రాలో ఎంత తక్కువ టికెట్ రేట్ ఉంటే అంతకు అమ్మమని డిస్ట్రిబ్యూటర్లకు చెప్పాను. ఓటీటీలో 'డర్టీ హరి'లో పెద్ద హిట్. ఈ '7 డేస్ 6 నైట్స్'ను యువతరంతో పాటు కుటుంబ ప్రేక్షకులు కూడా చూడాలని తక్కువ ధరకే టికెట్ల్ రేట్ పెడుతున్నాం అని తెలిపారు.

7 డేస్ 6 నైట్స్ చిత్రం ఫ్యామిలీ ఆడియెన్స్ చూడదగిన చిత్రం. ప్రస్తుతం కాలేజీలు ఓపెన్ అయ్యాయి. అమ్మాయిలు, అబ్బాయిలు క్లాసులు ఎగ్గొడతారో? లేదో? వాళ్ళకు కావాల్సిన కంటెంట్ సినిమాలో ఉంది. ఈ సినిమాతో నిర్మాతలుగా మారిన మా అబ్బాయి, అమ్మాయికి ఆల్ ది బెస్ట్. సుమంత్ అశ్విన్ నటించిన సినిమాల్లో నాకు నచ్చిన చిత్రమిది. డీ గ్లామర్ రోల్ చేశాడు. తనతో పాటు రోహన్ లైవ్లీగా చేశారు. హీరోయిన్లు ఇద్దరూ కొత్తవాళ్లు అయినా బాగా చేశారు అని అన్నారు.
7 డేస్ 6 నైట్స్ సినిమాను నేను చూశాను. నాకు బాగా నచ్చింది. మీరు కూడా చూడండి.. మీకు నచ్చుతుంది. జూన్ 24న తప్పకుండా థియేటర్లలో సినిమా చూడండి. ఆల్ ది బెస్ట్ నాన్నా అని ఎంఎస్ రాజు కుమార్తె రిషితా దేవి అన్నారు.
7 డేస్ 6 నైట్స్ సినిమా ఫస్ట్ కాపీ చూశాం. చాలా హ్యాపీగా ఉన్నాం. ఒక్క మాటలో నిజాయతీగా చెప్పాలంటే... నాకు'7 డేస్ 6 నైట్స్' ఒక మాస్టర్ పీస్‌లా కనిపించింది. మా పార్ట్‌నర్స్, సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్. జూన్ 24న థియేటర్లలో సినిమా చూడండి. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు అని హీరో, ప్రొడ్యూసర్ సుమంత్ అశ్విన్ చెప్పారు.
ఈ కార్యక్రమంలో నిర్మాతల్లో ఒకరైన రజనీకాంత్ .ఎస్, హీరోయిన్లు మెహర్ చాహల్, కృతికా శెట్టి, లిరిక్ రైటర్ కృష్ణకాంత్ (కేకే), సంగీత దర్శకుడు సమర్థ్ గొల్లపూడి, కో ప్రొడ్యూసర్ శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











