‘అర్ధరాత్రి 3 గంటలైనా నాకే ఫోన్.. త్రిషకు నేనంటే ప్రాణం’

గత కొద్దిరోజులుగా సినీ, రాజకీయ రంగాల్లో మారుమోగుతున్న ఒకే ఒక్క పేరు త్రిషా కృష్ణన్. కోలీవుడ్ అగ్ర కథానాయకుడు, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌తో రిలేషన్‌షిప్ రూమర్స్‌‌కి తోడు.. తమిళ రాజకీయాల్లో హడావుడి కారణంగా త్రిష వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ఈ నేపథ్యంలో త్రిష ఏం చేసినా .. ఏం మాట్లాడినా అది హాట్ టాపిక్‌గా మారుతోంది. కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ త్రిషకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలో త్రిషతో బంధంపై నిర్మాత, దర్శకుడు ఎంఎస్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..

సుమంత్ ఆర్ట్ పొడక్షన్స్ బ్యానర్‌పై 1987లో మనవాడొస్తున్నాడు సినిమాతో తన ప్రస్థానం ప్రారంభించారు ఎంఎస్ రాజు. ఆ తర్వాత శత్రువు, పోలీస్ లాకప్, స్ట్రీట్ ఫైటర్, దేవి, దేవిపుత్రుడు, మనంతా నువ్వే, నీ స్నేహం, ఒక్కడు, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా?, పౌర్ణమి, ఆట, వాన, మస్కా తదితర చిత్రాలతో తెలుగునాట తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే గత కొంతకాలంగా సినీ నిర్మాణానికి దూరంగా ఉంటున్నారు ఎంఎస్ రాజు. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో అగథ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీ ప్రమోషన్స్ కార్యక్రమంలో భాగంగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్, త్రిషతో అనుబంధంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

MS Raju Reveals Emotional Bond With Trisha Krishnan During Varsham Days

త్రిష నన్ను చూసుకున్నట్లు.. నాపై కెరీర్ తీసుకున్నట్లు ఎవరూ తీసుకోలేదు. ఆమెకు నేను దేవుడితో సమానం. ఒక వర్షం సక్సెస్ అలాంటిది. ఎందుకు ఆమెకు పెట్టుకున్నానో నాకే తెలియదు. అప్పటికీ ఆ అమ్మాయికి క్యారెక్టర్ కానీ అర్జున్ అనే సినిమాకు సెట్ అవ్వలేదు. వాళ్లకు వేరే రకమైన ఫేస్ కావాలి. ఆ టైంలో ఫోటోలు మాత్రమే ఉండేవి. ఇప్పటిలా ల్యాప్‌టాప్‌లు లేవు. ఆ ఫోటోలు మహేశ్ బాబు దగ్గర చూసి ఈ అమ్మాయి బాగుంది కదా బాబు అన్నాను. అయితే క్యారెక్టర్‌కు సూట్ కావడం లేదని డైరెక్టర్‌గారు చెప్పారని బాబు నాతో అన్నారు. నేను పెట్టుకోవచ్చా అని అడిగితే పెట్టుకోండి అన్నారు. నేను ఆ సినిమాలో లేను అనే బాధ అప్పుడు త్రిషలో ఉన్నట్లుగా ఉంది. నా నుంచి ఫోన్ రాగానే ఒక కేక.. వెంటనే మేం వస్తున్నాం అని ఆ అమ్మాయి చెప్పగా.. సాంగ్స్ రికార్డింగ్ కోసం నేనే చెన్నైకి వస్తున్నానని చెప్పానని ఎంఎస్ రాజు తెలిపారు.

చెన్నైలో త్రిష వాళ్ల ఫ్లాట్‌కి వెళ్లాం.. అప్పుడు ఆ అమ్మాయి లేదు, వాళ్లమ్మగారు ఉన్నారు. ఆమెతో అది ఇది అని మాట్లాడుతున్నాను. వాళ్లకు నేను ఈ సినిమాలో పెట్టుకుంటే బాగుండు అని బలంగా ఉంది. నేను మాత్రం ఆ అమ్మాయిని చూసిన తర్వాత ఫైనల్ చేద్దాం అనిపించింది. అప్పుడే జీన్స్‌లో త్రిష వచ్చింది. చిన్న ఎక్సైజ్ చేయమని చెబితే .. వెంటనే వాళ్లమ్మగారు అయితే మీరు సినిమాలో పెట్టుకుంటున్నారా? అని అడిగింది. అక్కడి నుంచి ఆ అమ్మాయి వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఒక్క ప్రశ్న అడగలేదు.. ఆ అమ్మాయికి నేనంటే ఎంత అభిమానం అంటే, నేనంటే ప్రాణం. అప్పటి నుంచి సీన్ చూడదు.. స్పాట్‌లో సీన్ తీసుకునేది. ఏం చేయమంటే అది చేస్తాను.. 75 రోజులు ఆ అమ్మాయి మీద వర్షం పడింది. ఆ సినిమాకు వంశీ పైడిపల్లి నా దగ్గర పనిచేశారు.. తను రెయిన్‌కి ఇన్‌ఛార్జ్. అప్పుడు ఆ అమ్మాయి వర్షం కొంచెం పక్కన వేయమని చెబితే నేను అరిసేవాడిని. కొన్ని సీక్వెన్స్‌లైతే నా వల్ల కాదని ఏడ్చేది పాపం.. రైలు వెళ్తుంటే దూకాలి. ఏడిస్తే ఎలా? లేదంటే వెళ్లిపోమని చెబితే చేస్తానని చెప్పింది. అప్పటి నుంచి మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్‌లా క్లోజ్ అయిపోయింది.

ఆ తర్వాత నువ్వొస్తానంటే నేనొద్దంటానాకు ఆ అమ్మాయిని అనుకోలేదు. మళ్లీ ఆ అమ్మాయిని రిపీట్ చేయడం ఎందుకు అనుకున్నాం. ఆ అమ్మాయి ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా మా ఇంటికి వచ్చి బుక్ తీసుకొచ్చింది. భోజనం చేసి, డైరీ బయటకు తీసి డేట్స్ ఎప్పుడు కావాలో చెప్పమని అడిగింది. అలా ఏ హీరో కానీ, హీరోయిన్ కానీ నన్ను అడగలేదు. రాత్రి 3 గంటలకు మీరు ఫోన్ చేసి మీరు ఎవరితో మాట్లాడటానికి మీరు కంఫర్ట్‌గా ఫీల్ అవుతారని ఒక ఇంగ్లీష్ పత్రిక వాళ్లు అడిగితే ఓన్లీ ఎంఎస్ రాజు అని ఆన్సర్ ఇచ్చింది. అలాంటి అమ్మాయి ఈరోజుకీ హీరోయిన్‌గా కొనసాగుతోంది, మంచి పొజిషన్‌లో ఉంది, నాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు మద్రాస్ వెళ్లినా వాళ్లింటికీ వెళ్తాను. నాతో సినిమా చేయొచ్చు కదా అని అడిగితే.. 3 సినిమాలు చేశాం కదా అని చెప్పేవాడిని. ఆట సినిమాకు ఇలియానాను సెలెక్ట్ చేసినందుకు నా మీద త్రిష అలిగింది. నేను షూటింగ్ లోకేషన్‌కి వచ్చేస్తానని ఫోన్ల మీద ఫోన్లు చేసింది. మేం రాజమండ్రిలో షూటింగ్ స్టార్ట్ చేసేశాం.. బోటు మధ్యలో ఉన్నామని చెబితే అప్పుడు కూల్ అయ్యిందని ఎంఎస్ రాజు గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం రాజుగారి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read more about: ms raju trisha krishnan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X