twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అమ్మాయిలా ఉన్న ఆయన హీరో ఏంటి? స్టార్ ప్రొడ్యూసర్ ఎంఎస్ రాజు బయటపెట్టిన సీక్రెట్

    |

    శత్రువు అనే సినిమాతో టాలీవుడ్ కి నిర్మాతగా పరిచయం అయిన ఎమ్మెస్ రాజు ఆ తర్వాత కాలంలో చాలా సూపర్ హిట్ సినిమాలు నిర్మించారు. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సంస్థను స్థాపించి నిర్మాతగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందుకున్నారు. ఇక ఆయన దర్శకుడిగా మారి చేసిన డర్టీ హరి సినిమా కూడా గత ఏడాది రిలీజ్ అయి మంచి స్పందన తెచ్చుకుంది. అయితే తాజాగా ఆయన హీరో సిద్ధార్థ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆ వివరాల్లోకి వెళితే.

     శత్రువు సినిమాతో

    శత్రువు సినిమాతో

    విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన శత్రువు అనే సినిమాతో టాలీవుడ్ నిర్మాతగా మారిన ఎమ్మెస్ రాజు ఆ తర్వాత దేవి, దేవి పుత్రుడు, మనసంతా నువ్వే, ఒక్కడు, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి సూపర్ హిట్ సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. అయితే ఆయన తాను చేసిన ప్రతి సినిమా చాలా రిస్క్ తీసుకుని చేశానని చెబుతున్నారు. ఎవరూ ఊహించని కాంబినేషన్స్ తో ఊహించని వ్యక్తులతో తాను సినిమాలు చేశానని ఆయన చెబుతున్నారు..

    ప్రభుదేవా దర్శకుడిగా

    ప్రభుదేవా దర్శకుడిగా

    మరీ ముఖ్యంగా సిద్ధార్థ త్రిష హీరోయిన్ గా సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద చేసిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా గురించి ఆయన కొన్ని కీలక అంశాలు ఒక తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ సినిమా ద్వారా అప్పటిదాకా కొరియోగ్రాఫర్ గా ఉన్న ప్రభుదేవా దర్శకుడిగా పరిచయం అయ్యారు.. ఈ సినిమా అనుకున్నప్పటి నుంచి రిలీజ్ అయిన తర్వాత పరిణామాలు దాకా ఆయన ఇంటర్వ్యూ లు పంచుకున్నారు.

    సూపర్ సక్సెస్

    సూపర్ సక్సెస్

    ఒక పల్లెటూరి పేద అమ్మాయికి అమెరికా కోటీశ్వరుడికి మధ్య ప్రేమ పుడితే ఆ ప్రేమ కోసం సదరు కోటీశ్వరుడైన యువకుడు ఏమి చేశాడు అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. సినిమా సూపర్ హిట్ గా నిలవడం కాక అనేక అవార్డులు రివార్డులు కూడా సంపాదించింది. ఆ రోజుల్లో ఈ సినిమా 5 నంది అవార్డులు, 9 ఫిలింఫేర్ అవార్డులు, రెండు సంతోషం అవార్డులు అందుకుని రికార్డులకెక్కింది.

    ఆడ పిల్లలా ఉన్నాడేంటి

    ఆడ పిల్లలా ఉన్నాడేంటి

    నిజానికి ఈ సినిమాలో సిద్ధార్థ్ హీరో గా ఎంపికైన తర్వాత సినిమా యూనిట్ అంతా ఆయన గురించి రకరకాలుగా వ్యాఖ్యానించారట. చూడడానికి ఇలా ఉన్నాడు ఇతనిని ఎందుకు తీసుకున్నారు అని చాలా మంది ప్రశ్నించారట. పరుచూరి వెంకటేశ్వరరావు ఓ వైపు కథ రాస్తూనే 'ఇలాంటి కుర్రాన్ని తెచ్చావేంటయ్యా.. అతనేంటి అతని జుట్టు ఏంటి' అని కామెంట్ చేసేవారు అని నిర్మాత తెలిపారు. రిలీజ్ పోస్టర్ చూసి చాలామంది 'వీడేంటి అమ్మాయి లాగా ఆడ పిల్లలా ఉన్నాడేంటి' అని కామెంట్స్ చేశారు అని చెప్పుకొచ్చారు.

     కళ్ళు నెత్తికి ఎక్కాయని

    కళ్ళు నెత్తికి ఎక్కాయని

    అయితే తాను మాత్రం ఫారిన్ నుంచి వచ్చిన కుర్రాడు అలానే ఉండాలి అని ఫిక్స్ అయ్యానని చెప్పారు. ప్రభుదేవాకి డైరెక్షన్ బాధ్యత ఇచ్చిన విషయంలో కూడా తనకు కళ్ళు నెత్తికి ఎక్కాయని.. సక్సెస్ లో ఉన్నాడని ఇలా ఇష్టం వచ్చినట్లు చేస్తున్నాడని కామెంట్స్ చేశారు అని ఎమ్ ఎస్ రాజు చెప్పుకొచ్చారు. అయితే 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' సినిమా తర్వాత ప్రభుదేవా - సిద్ధార్థ్ - త్రిష - దేవిశ్రీ అందరూ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేకుండా పోయింది.

    English summary
    Renowned Producer MS Raju' turned director. his upcoming directorial has been officially announced by the makers recently. Now in a recent interview Film maker revealed some intresting facts about Siddharth in nuvvu vastanante nenu vaddantana movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X