1000 కోట్ల మహాభారతంపై కేసు.. విసిగిపోయిన రచయిత!
మహాభారత పురాణంపై ఇప్పటివరకు అనేక చిత్రాలు వచ్చాయి. కానీ ఇప్పటి గ్రాండ్ విజువల్స్, భారీ స్థాయి మేకింగ్ తో మహాభారతాన్ని తెరకెక్కించాలని చాలా మంది నటులకు, దర్శకులకు కోరిక ఉంది. దర్శక ధీరుడు రాజమౌళి, అమీర్ ఖాన్, మోహన్ లాన్ వంటి ప్రముఖుల నుంచి ఈ ప్రతిపాదనలు వచ్చాయి. 1000 కోట్లతో మహాభారతాన్ని వెండి తెరపై ఆవిష్కరించాలని మోహన్ లాల్ ప్రయత్నాలు మొదలు పెట్టారు కూడా.
కానీ ఈ భారీ ప్రాజెక్ట్ ముందుకు సాగే పరిస్థితి కనిపించడం లేదు. ప్రముఖ వ్యాపార వేత్త బిఆర్ శెట్టి నిర్మాణంలో, శ్రీకుమార్ దర్శత్వంలో ఈ చిత్రాన్ని ప్రారంభించాలని మోహన్ లాల్ ప్రయత్నాలు మొదలు పెట్టారు. ప్రముఖ వాసుదేవన్ నాయర్ వివిధ గ్రంధాల నుంచి ఈ చిత్రానికి స్క్రీన్ ప్లేకూడా అందించారు.

ఈ ప్రతిపాదన వచ్చి నాలుగేళ్లు గడుస్తున్నా ఇంతవరకు సినిమా ప్రారంభం కాకపోవడంతో వాసుదేవన్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఎదురుచూడడం తన వల్ల కాదని అంటున్నారట. తన స్క్రిప్ట్ ని తిరిగి పొందేందుకు ఆయన కోర్టులో కేసు నమోదు చేసే ఆలోచనలో ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











