పోసాని మూవీ ‘ముఖ్యమంత్రిగారు మీరు మాటిచ్చారు’.. కుక్కతో, గాడిదతో సమానం, చంద్రబాబు గురించి కాదట!

ఎన్నికల వేళ ప్రముఖ నటుడు, దర్శకుడు, రచయిత పోసాని కృష్ణ మురళి పొలిటికల్ మూవీ ప్రారంభించి సంచలనానికి తెరలేపారు. గురువారం హైదరాబాద్‌లో ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్ లాంచ్ చేశారు. 'ముఖ్యమంత్రిగారు మీరు మాటిచ్చారు' అనే టైటిల్‌తో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ సందర్భంగా పోసాని మాట్లాడుతూ... 'ఈ చిత్రానికి కథ, మాటలు నేను రాయలేదు. నా కొడుకు రాశాడు. వాడి పేరు పోసాని ఉజ్వల్. నాకంటే ఫాస్ట్. తెలివిగలవాడు. ఇపుడు హంగేరీలో ఉంటూ మీడియా సైన్స్ అనే కోర్స్ చేస్తున్నాడు. నన్ను నా కొడుకు ఒరేయ్ అంటాడు... కథ, మాటలు రాసి ఒరేయ్ ఇది తీయ్ చాలా బావుంటుంది, కొత్తగా ఉంటుంది అని చెప్పాడు.' అని తెలిపారు.

కుక్కతో, గాడిదతో సమానం

కుక్కతో, గాడిదతో సమానం

‘‘ఓట్లను దబ్బులిచ్చి కొనుక్కునేవాడు గాడిదతో సమానం, ఓటర్లకు మందు తాగించేవాడు కుక్కతో సమానం, కులం పేరుతో రాజకీయాలు చేసేవాడు లోఫర్‌తో సమానం. వెన్నపోటు పొడిచేవాడు బ్రోకర్‌తో సమానం... నీతిగా ప్రజాసేవ చేసేవాడు దేవుడితో సమానం'' అంటూ పోసాని తన సినిమా పోస్టార్ లాంచ్ ఈవెంటులో ఆకట్టుకునేలా కొటేషన్స్ పెట్టారు.

హైదరాబాద్‌కు కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో షూటింగ్

హైదరాబాద్‌కు కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో షూటింగ్

‘ముఖ్యమంత్రిగారు మీరు మాటిచ్చారు' మూవీ షూటింగ్ హైదరాబాద్‌కు కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో జరిగింది. నిన్నటి వరకు నా సినిమా టైటిల్ ఇది, మా ప్రొడ్యూసర్లు వీరు అని నేను ఎవరికీ చెప్పలేదు, ఏ ప్రెస్ మీటూ పెట్టలేదు. ఇపుడు సినిమా అయిపోయింది. ఎవరో ఒక వ్యక్తి ఎన్నికల సంఘానికి రిపోర్ట్ చేశారు. పోసాని సినిమా తీశారని, చంద్రబాబును అన్ పాపులర్ చేయడానికి, ఆయన్ను చండాలంగా చూపించడానికి సినిమా తీశారు.. ఈ సినిమా రిలీజ్ మీరు ఆపండి అని ఎన్నికల సంఘానికి రిపోర్ట్ చేస్తే వారు నాకు నోటీస్ పంపారు... అని పోసాని గుర్తు చేసుకున్నారు.

చంద్రబాబు గురించి ఏదైనా బ్యాడ్ ఉంటే..

చంద్రబాబు గురించి ఏదైనా బ్యాడ్ ఉంటే..

ఎన్నికల అధికారులు పంపిన నోటీసులో... ‘ముఖ్యమంత్రిగారు మీరు మాట తప్పారు' ఆ టైటిల్‌తో రిపోర్ట్ ఇస్తే ఎన్నికల సంఘం వారు అందులో నిజా నిజాలు విచారించకుండా నాకు నోటీసులు పంపారు. నేను అధికారులకు ఫోన్ చేసి ‘సార్.. నేను ఆ టైటిల్‌తో సినిమా చేయలేదు. నేను ఆ సినిమా ప్రొడ్యూసర్ కాదు. అతడు ఎందుకు మీకు ఫిర్యాదు చేశారో తెలియదు. ఆ టైటిల్ మీద నేను సినిమా చేయనపుడు దానితో నాకు ఎలాంటి సంబంధం ఉండదు, కాబట్టి మీకు వివరణ ఇవ్వడానికి నేను రాలేను, నా ఆరోగ్యం బాగోలేదని చెప్పాను. మా సినిమాలో చంద్రబాబు గురించి ఏదైనా బ్యాడ్ ఉంటే సినిమానే కాదు, నన్ను కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి బ్యాన్ చేయండి అని చెప్పినట్లు.. పోసాని తెలిపారు.

మా సినిమా కథ ఇదే

మా సినిమా కథ ఇదే

ఈ సినిమా కథ ఎన్నికల మానిఫెస్టోను ప్రస్తావిస్తూ సాగుతుంది. ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు. ఇండియా మొత్తానికి అన్ని రాస్ట్రాలకు సంబంధించిన సినిమా. ఏ పార్టీ అయినా, ఏముఖ్యమంత్రి అయినా ప్రజలారా మీరు నాకు ఓటేస్తే ఈ పనలు చేస్తాను అని చెప్పి మేనిఫెస్టో తయారు చేస్తే గెలిచిన తర్వాత ఆ మేనిఫెస్టోలో ఉన్న అన్ని వాగ్దానాలు నెరవేర్చాలి. ఎవరైనా నెరవేర్చలేక పోతే అతడు రాజకీయ సన్యాసం చేయించాలి. ఏ ప్రజల కోసం అయితే నువ్వు మాయమాటలు చెప్పి అబద్దాలు చెప్పి ఓట్లు వేయించుకున్నావో... ఆ పనులు చేయకుంటే నువ్వు ఎందుకు రాజకీయాల్లో ఉండాలి? అనేది ఈ సినిమా పాయింట్. భారత దేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్కడే కాదు. చాలా రాష్ట్రాలు ఉన్నాయి. ఎందరో ముఖ్యమంత్రులు ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యం గురించి, ప్రజల క్షేమం గురించి తీసిన సినిమా అని పోసాని స్పష్టం చేశారు.

చంద్రబాబుకు సంబంధం లేదు, నా జోలికి రావద్దు

చంద్రబాబుకు సంబంధం లేదు, నా జోలికి రావద్దు

ఈ సినిమాకు చంద్రబాబుకు సంబంధం ఏమిటి? ఇలాంటి సినిమా తీస్తే భయపడేది ఎవరు? ఎవరైతే వెధవ పనులు, అవినీతి పనులు, లంగా పనులు చేస్తారో వారు భయపడతారు. చంద్రబాబు అవినీతి పనులు చేయరు కదా! ఈ విషయం ప్రజలకు తెలుసుకదా.. చంద్రబాబు వెన్నుపోటు పొడవరు కదా! ఆయన మంచి ముఖ్యమంత్రి కదా! ఆయన ఎందుకు భయపడతారు? ఆయన భయపడ్డారని మీరెందుకు లెటర్ రాయడం? నేను పుట్టి సినిమా పరిశ్రమకు వచ్చింది చంద్రబాబును విమర్శించడానికి కాదు. నేను బ్రతకడానికి, వీలైతే కొద్దో గొప్పో ప్రజలకు మంచి చెప్పడానికి అందుకే ఈ సినిమా తీశాను. చంద్రబాబుకు ఈ సినిమాకు ఎలాంటి సంబంధం లేదు. నా జోలికి దయచేసి రాకండి... అంటూ పోసాని వ్యాఖ్యానించారు.

ఇదొక కామెడీ చిత్రం

ఇదొక కామెడీ చిత్రం

ఇదొక గొప్ప కామెడీ చిత్రం. సినిమాలో 2 రీళ్లు మాత్రమే పొలిటికల్ అంశాలు ఉంటాయి. మిగతా 12 రీల్లు అలీ, బాబుమోహన్, హేమ, కృష్ణ భగవాన్ కామెడీ ఉంటుంది. రైతు సమస్యల గురించి, నిరుద్యోగుల గురించి, మోసం చేసిన ప్రేమికుడి గురించి ఉంటుంది. రాజకీయం చాలా చాలా తక్కువగా ఉంటంది. ఒకరిని టార్గెట్ చేయడం లేనేది వంద శాతం లేదు. ఈ సినిమా చూసి ఆదరిస్తారని, మీరు చాలా తెలుసుకుంటారని, చైతన్యవంతులు అవుతారని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు పోసారి తెలిపారు. .

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X