PVR Inox: సినిమా నచ్చలేదా? మధ్యలో వచ్చేసినా మీ డబ్బు రిఫండ్ ..ఎలా అంటే?

భారతదేశంలో సినిమా ఒక వినోద సాధనం. స్మార్ట్ ఫోన్ వచ్చి టీవీలు, రేడియోలు, ఆటలను ఇలా ఒక్కొక్క దానిని మింగేస్తున్న ఇప్పటికీ మనదేశంలో మెజారిటీ ప్రజలు వినోదం కోసం ఆశ్రయించేది సినిమానే. ఇది వినోదం మాత్రమే కాదు ఎమోషనల్ బాండింగ్ . సినీ తారలను తమ కుటుంబ సభ్యులుగా, దేవుళ్లుగా కొలిచే అభిమానులు ఇండియాలో ఉన్నారు. అందుకే ఎన్ని వినోద సాధనాలు వచ్చినా సరే మనదేశంలో సినిమాకు తిరుగులేదు.

వారం మొత్తం విద్య, ఉద్యోగం, వ్యాపారాలతో ఊపిరి సలపనంత బిజీగా ఉండే ప్రజలు వీకెండ్‌లో ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు, సన్నిహితులను వెంట బెట్టుకుని సరదా సినిమాగా వెళ్లి బాధలు, బాధ్యతలన్నీ మరిచిపోతారు. ఓ సినిమా చూసి అటు నుంచి అటే మంచి రెస్టారెంట్‌లో భోజనం చేసి ఇళ్లకు బయల్దేరే వారు ఎందరో. అంతలా భారతీయుల జీవితంలో సినిమా ఒక భాగమైంది. అయితే అన్ని సినిమాలు అందరీకీ నచ్చాలని లేదు, అలాగే కొన్ని అత్యవసర పనుల వల్ల సినిమాను మధ్యలోనే వదిలి వచ్చేయాల్సి వస్తుంది. కానీ అలా మధ్యలో రావడానికి మనసు ఒప్పదు. ఎలాగోలా క్లైమాక్స్ వరకు ఉండి ఖర్చు పెట్టిన రూపాయికి న్యాయం చేయాలని చాలా మంది అనుకుంటారు.

multiplex chain pvr inox introduces money back offer when you leave the movie mid way

ఇక థియేటర్లకు ప్రేక్షకులను రప్పించడానికి మల్టిప్లెక్స్ యాజమాన్యాలు రకరకాల ఆఫర్స్‌తో ముందుకొస్తుంటాయి. డిస్కౌంట్స్‌తో పాటు వన్ ప్లస్ వన్ ఆఫర్ అంటూ ప్రేక్షకులను ఊరిస్తూ ఉంటాయి. తాజాగా పీవీఆర్ అండ్ ఐనాక్స్ ఓ అద్భుతమైన ఆఫర్‌ను ప్రకటించి కలకలం రేపింది. అది కూడా అలాంటి ఇలాంటి ఆఫర్ కాదు. జనాలకు మైండ్ బ్లాకయ్యే ఆఫర్. ఇంతకీ అదేంటి అంటే.. పీవీఆర్ ఐనాక్స్‌లలో టికెట్లు బుక్ చేసుకున్న తర్వాత సినిమా కనుక నచ్చకుంటే ప్రేక్షకుడికి టికెట్ డబ్బులు రిఫండ్ చేస్తారట.

ఐడీయా బాగానే ఉంది కానీ.. ఈ స్కీమ్‌ను అమలు చేయడం అంత తేలిక కాదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇది ఎలా అమలు చేయనున్నారో ఒకసారి పరిశీలిస్తే. దేశంలోనే మల్టీప్లెక్స్ చైన్‌గా ఉన్న పీవీఆర్ ఐనాక్స్ లిమిటెడ్.. దాని ప్రేక్షకుల సంఖ్యను పెంచుకోవడానికి, సినిమాకి వెళ్లే ఫ్రీక్వెన్సీని మెరుగుపరచుకోవడానికి చేసే ప్రయత్నాల్లో భాగంగా ఈ రిఫండ్ పాలసీని తీసుకొచ్చింది. సినిమా నచ్చక మధ్యలోనే వచ్చేస్తే.. పాక్షికంగా నగదును తిరిగి చెల్లించనుంది.

అయితే ఈ ప్లాన్ అమలు చేయడానికి ముందే పీవీఆర్ తమ టికెట్ ధరలను పెంచే ఆలోచనలో ఉందట. తమ టికెట్‌పై రిఫండ్ రావాలంటే ముందు.. టికెట్‌ ధరకు అదనంగా 10 శాతం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అయితే దేశవ్యాప్తంగా ఉన్న పీవీఆర్ ఐనాక్స్ స్క్రీన్‌లలో ఒకేసారి ఈ ప్లాన్‌ను అమలు చేయడం కష్టం కాబట్టి ముందుగా దీనిని ఢిల్లీలో ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది. ఇక్కడ వర్కవుట్ అయితే నెమ్మదిగా దేశవ్యాప్తంగా విస్తరించాలని పీవీఆర్ ఐనాక్స్ యాజమాన్యం భావిస్తోంది.

దేశ రాజధాని ప్రాంతంలోని ఢిల్లీ, గురుగ్రామ్ ఏరియాలలోని దాదాపు 170 స్క్రీన్‌లలో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. ముందుగా పీవీఆర్ యాప్‌లోకి వెళ్లి ఏ సమయంలోనైనా షో మధ్యలో నుంచి వచ్చేయడానికి , పాక్షిక వాపసును క్లెయిమ్ చేయడానికి '' FLEXI '' షాపింగ్ టైటిల్‌ను ఎంచుకోవాలి. అలాగే నిష్క్రమించడానికి సమయాన్ని రికార్డ్ చేయడానికి టచ్ పాయింట్ వద్ద టికెట్ లేదా క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయాలి . ఇలా చేస్తే దాదాపు 30 నుంచి 60 వరకు నగదును రిఫండ్ చేసుకోవచ్చు. ఈ రీఫండ్‌లు ప్రేక్షకుల వ్యాలెట్‌లో జమ కావడానికి దాదాపు ఐదు రోజుల సమయం పడుతుందని పీవీఆర్ ఐనాక్స్ తెలిపింది.

More from Filmibeat

Read more about: pvr inox movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X