ఎన్టీఆర్ డబ్బులిచ్చి జై కొట్టించుకున్నాడా? దేవర ఈవెంట్‌పై షాకింగ్ గా ట్రొలింగ్

NTR Devara Trailer Event: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ 'దేవర'. ఈ మూవీ టైలర్ లాంచ్ ఈవెంట్ ముంబాయిలో చాలా గ్రాండ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్, గ్లింప్స్ లాగానే ట్రైలర్ కూడా భారీ రెస్పాన్స్ వస్తుంది. విడుదలైన గంటలో రికార్డు స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకుంది. కేవలం తెలుగు లోనే కాకుండా తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ అయిన ట్రైలర్ కు అద్భుత స్పందన వస్తోంది. ఇక్కడ వరకు అంతా బాగున్న 'దేవర' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ పై ముంబై చెందిన ఓ జర్నలిస్ట్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో తెగ వైరలవుతోంది. అసలేం ఏం అన్నారో మీరు కూడా ఓ లూక్కేయండి.

సినీ ఇండస్ట్రీలో సౌత్ వర్సెస్ నార్త్ ఫీలింగ్ రోజురోజుకూ ఎక్కువవుతోంది. కన్నడ మూవీ కేజీఎఫ్ బాలీవుడ్ ను షేక్ చేసింది. బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్లను వసూళు చేసింది. అప్పటి నుంచి సౌత్ వర్సెస్ నార్త్ మారిపోతోంది. వాస్తవానికి కేజీఎఫ్ 2 కంటే ముందే బాహుబలి 1,బాహుబలి 2
లతో పాటు సాహోలు కూడా నార్త్ రికార్డు కలెక్షన్లు రాబట్టాయి. ఆ తరువాత అల్లు అర్జున్ 'పుష్ప', రాజమౌళి 'ఆర్ఆర్ఆర్', యశ్ మరోసారి కేజీఎఫ్2 తో నార్త్ లో సత్తా చాటారు. దీంతో ఉత్తరాదిలో దక్షిణాది సినిమాలు ఆడటమే కాకుండా.. భారీ కలెక్షన్లు కొల్లాగొట్టగలవని నిరూపించారు. ఇలా సౌత్ మూవీ పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కావడంతో బాలీవుడ్ వారికి మింగుడుపడటం లేదు. మరో రకంగా చెప్పాలంటే.. దక్షిణాది నుంచి వస్తున్న కంటెంట్ బాలీవుడ్‌ను ఓవర్ టేక్ చేయడంతో వారిలో ఓ రకమైన భయం మొదలైంది. ఇలాంటి తరుణంలోనే దక్షిణాది సినిమాపై ఉత్తరాది వాళ్లు నోరు పారేసుకుంటారు.

Mumbai journalist made shocking comments on Junior NTR about Devara trailer launch event video viral

అలానే ముంబైలోని ఓ జర్నలిస్ట్ జూనియర్ ఎన్టీఆర్ పై నోరుపారేసుకున్నారు. ఇంతకీ ఆ వైరల్ వీడియో ఏముందంటే.. ' జూనియర్ ఎన్టీఆర్ 'దేవర'మూవీ ట్రైలర్ ఈవెంట్‌లో కొంతమంది పదే పదే జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ అరుస్తున్నారు. మేం మీడియా తరుపున కాస్త ముందు కూర్చొన్నాం, మా వెనకాల సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్, వారి వెనకాల ఓ బ్యాచ్ ఉంది. ఆ బ్యాచ్ పదే పదే జై ఎన్టీఆర్.. జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేస్తున్నారు. ట్రైలర్ కూడా సరిగ్గా చూడనివ్వలేదు. కనీసం డైలాగ్స్ కూడా సరిగ్గా వినిపించలేదు. అదంతా పెయిడ్ బ్యాచ్. వారిందరికీ డబ్బులు ఇచ్చి జై ఎన్టీఆర్ అని నినాదాలు చేయించుకున్నారు' అంటూ ఆ వ్యక్తి షాకింగ్ చేశారు.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరలవుతోంది. నిజానికి దేవర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు తారక్ ఫ్యాన్స్ భారీ సంఖ్యలోనే హాజరయ్యారు. కామన్ గా తన అభిమాన నటుడి సినిమా ట్రెలర్ అంటే మామూలుగా ఉంటుందా? అందులోనూ ఎన్టీఆర్, నందమూరి ఫ్యాన్ అంటే మామూలుగా ఉండదు. తమ ఎదుట తమ అభిమాన నటుడు కనిపిస్తే.. ఫ్యాన్స్ పూనకాలు మామూలుగా ఉండవుగా మరీ. ఏదిఏమైనా.. ఈ మధ్యకాలంలో సౌత్ సినిమాలు ఫాన్ ఇండియా మూవీగా విడుదల కావడం నార్త్ వాళ్లకు మింగుడుపడటం లేదనే చెప్పాలి. ఇప్పటికే దేవర పలు రికార్డులను బ్రేక్ చేసింది. ట్రైలర్ కూడా విడుదల కాకుండా.. కేవలం లిరికల్ సాంగ్స్, పోస్టర్లు విడుదల చూసే..అభిమానులు ఓ రేంజ్ లో అంచనాలు పెట్టుకున్నారు.

Mumbai journalist made shocking comments on Junior NTR about Devara trailer launch event video viral
ఇదిలా ఉంటే.. దేవర మూవీ డైరెక్టర్ కొరటాల శివ రెండు భాగాలుగా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. దేవర ఫస్ట్ పార్ట్ ను ఈనెల 27న రిలీజ్ చేయనున్నారు. నిజానికి ట్రిబుల్ ఆర్ మూవీ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఈ మూవీ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. తాజా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ లో జూనియర్ ఎన్టీఆర్ తన నట విశ్వరూపాన్ని చూపించారు. చాలా కాలం తర్వాత జూనియర్ ఎన్టీఆర్ పూర్తిగా ఊర్ మాస్ లుక్‏లో యాక్షన్ అదరగొట్టేశాడు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. దీంతో ఈసారి ఎన్టీఆర్ హిట్ కొట్టడం పక్కా అంటున్నారు. ట్రైలర్ విడుదలైన కొన్ని నిమిషాల్లోనే మంచి రెస్పాన్స్ రావడంతో దేవర సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X