twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సుశాంత్ కేసు దర్యాప్తు నిజాయితీగా జరిపించండి: మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు

    |

    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం వెనుక వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడానికి దర్యాప్తును పారదర్శకంగా జరుపాలని జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో పిటిషన్ దాఖలైంది. ది ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్, 1993 సెక్షన్లు 14, 17, 37 కింద ఈ కేసు నమోదైంది. సుశాంత్ మరణాన్ని అసహజమైన మరణంగా భావిస్తూ దర్యాప్తు చేయాలని పిటిషనర్ డిమాండ్ చేశారు. ముంబై యూనివర్సిటీలో న్యాయశాస్త్రం చదువుతున్న విద్యార్థి ఆశీష్ రాయ్ ఈ ఫిర్యాదును దాఖలు చేశారు.

    నేను భారత దేశ పౌరుడిగా, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అభిమానిగా నా బాధనే కాకుండా లక్షలాది మంది సినీ అభిమానుల తరఫున ఈ కేసును మీ దృష్టికి తీసుకువస్తున్నాను. ఆయన మరణం ఎంతో మందిని మానసికంగా కుంగిపోయేలా చేస్తున్నది అని జాతీయ మానవ హక్కుల సంఘానికి చేసిన ఫిర్యాదులో పిటిషనర్ తెలిపారు. ముంబై పోలీసులు జరుపుతున్న దర్యాప్తుపై అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి అని పిటిషనర్ తన ఫిర్యాదులో వెల్లడించారు.

    Mumbai Law student Filed petition in NHRC over Sushant Singh Rajput Case

    సుశాంత్ సూసైడ్ కేసులో మహారాష్ట్ర, బీహార్ ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరులో అనుమానాలు రేకెత్తుతున్నందున మానవ హక్కుల కమిషన్ జోక్యం చేసుకోవాల్సిన అవసరముందని పేర్కొన్నారు.

    బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ జూన్ 14వ తేదీన తన నివాసంలో అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం తెలిసిందే. ఈ కేసులో ముంబై పోలీసులు జరుపుతున్న దర్యాప్తుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సుశాంత్ తండ్రి ఫిర్యాదు చేయడంతో పాట్నా పోలీసులు రంగంలోకి దిగిన విషయం తెలిసిందే.

    English summary
    Mumbai University Law student Ashish Rai filed a case in National Human Rights Commission (NHRC). He requested a fair probe into Sushanth Singh Rajput death.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X