twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సుశాంత్ మరణం తర్వాత.. 80 వేల నకిలీ ట్విట్టర్ అకౌంట్లు..

    |

    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత ప్రజల్లో అనేక అనుమానాలు, సందేహాలు వ్యక్తమయ్యాయి. సుశాంత్‌ది ఆత్మహత్య కాదు.. హత్యే అంటూ సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్‌తో ట్రెండ్ చేశారు. సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించాలని, రియాను అరెస్ట్ చేయాలంటూ పలు హ్యాష్ ట్యాగ్‌లను వైరల్ చేశారు.

    అయితే తాజాగా సుశాంత్‌కు న్యాయం జరుగాలంటూ ట్విట్టర్‌లో ట్రెండింగ్ చేసిన అకౌంట్లపై ముంబై పోలీసులు, మహారాష్ట్ర ప్రభుత్వం ఆసక్తికరమైన రిపోర్టులను బయటపెట్టారు. దాదాపు 80 వేల నకిలీ అకౌంట్లు క్రియేట్ చేశారనే విషయాన్ని బయటపెట్టారు.

    Mumbai Police: 80000 fake twitter accounts created after Sushant Singh Rajputs death

    సుశాంత్ సింగ్‌కు న్యాయం చేయాలంటూ వేలాది ట్వీట్లు దేశవ్యాప్తంగా ట్రెండ్ అయ్యాయి. అలాంటి ట్రెండింగ్‌లో విదేశీ భాషలకు సంబంధించిన అకౌంట్లను గుర్తించాం. #justiceforsushant #sushantsinghrajput, #SSR లాంటి హ్యాష్ ట్యాగ్స్‌ను ఆధారంగా చేసుకొని పరిశోధన చేస్తున్నాం. మరికొన్ని అకౌంట్లను గుర్తించే పనిలో ఉన్నాం అని ముంబైకి చెందిన పోలీసు ఆఫీసర్ తెలిపారు. సుశాంత్ కోసం భారత్‌లోనే కాకుండా ఇటలీ, పోలండ్, స్లోవెనియా, ఇండోనేషియా, టర్కీ, థాయ్‌లాండ్, రొమెనియా, ప్రాన్స్ దేశాల్లో కూడా వేలాదిగా ట్వీట్లు చేశారు.

    కరోనా సమయంలో సేవలందిస్తూ 6 వేల మంది మహారాష్ట్ర పోలీసులు చనిపోయారు. అలాంటి సేవలందించిన పోలీసుల సేవలను కించపరిచే విధంగా సుశాంత్ కేసులో అనే దుష్ప్రచారం చేశారు. ముంబై పోలీసుల నిజాయితీని శంకించే ప్రయత్నాలు చేశారు అని ముంబై పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు.

    English summary
    Sushant Singh Rajput death leads one of the top trending issue in twitter. Mumbai Police said that 80000 fake twitter accounts created after Sushant Singh Rajput's death and made viral twitters to tarnish mumbai police.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X