సుశాంత్ సూసైడ్: ముంబై పోలీసుల ముందుకు కంగన రనౌత్
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు దర్యాప్తును ముంబై పోలీసులు మరింత వేగవంతం చేశారు. ఇప్పటి వరకు 35 మందిని విచారించిన అనంతరం ఆయన మరణం తర్వాత అనుమానాలు వ్యక్తం చేసిన పలువురిని ప్రశ్నించడానికి సిద్ధం అవుతున్నారు. వారి వ్యాఖ్యలకు ఆధారాలు ఏమిటి? వారి ఆరోపణల వెనుక ఎలాంటి ఉద్దేశం దాగి ఉన్నది అనే కోణంలో సమాచారాన్ని సేకరించడంపై పోలీసులు దృష్టిపెట్టారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగన రనౌత్‌ను ప్రశ్నించాలని బాంద్రా పోలీసులు నిర్ణయించినట్టు సమాచారం.
సుశాంత్ సింగ్ మరణం తర్వాత కంగన రనౌత్ ఘాటుగా స్పందిస్తూ వీడియోలు రిలీజ్ చేశారు. యువ హీరో మరణంపై సినీ ప్రముఖులు తమ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. చనిపోయిన తర్వాత కూడా అతడిని వదలకుండా అబద్దాలు పలుకుతున్నారు. సుశాంత్ మరణం, పర్వీన్ బాబీ మరణం ఒకేలా ఉందని మహేష్ భట్ పోల్చడంపై కంగన మండిపడ్డారు. బంధుప్రీతి అంశంతో బాలీవుడ్‌ను కొందరు రెండుగా విభజించి యువ నటుల జీవితాలతో ఆడుకొంటున్నారు అని కంగన ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాజాగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, గతంలో చాలా మంది ఇలాంటి దురాగతాలకు బలయ్యారు. ఇప్పటి వరకు జరిగిందేదో జరిగింది. ఇక నుంచి ఎలాంటి వారినైనా, ఎలాంటి పరిస్థితినైనా ఎదురించేందుకు సిద్ధంగా ఉన్నాను. ఎంతవరకు వెళ్లేందుకైనా రెడీగా ఉన్నాను. ఏం జరుగుతుందో.. ఏం చేస్తారో ఇక ముందు నేను చూసుకొంటాను అని కంగన రనౌత్ గతంలో విడుదల చేసిన వీడియోలో మాటల దాడిని పెంచిన విషయం తెలిసిందే.
ముంబై పోలీసు విభాగంలోని సీనియర్ అధికారి ఈ వార్తపై స్పందిస్తూ.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత జరుగుతున్న విచారణలో భాగంగా కంగన రనౌత్‌ను విచారించాలని నిర్ణయించాం. ప్రస్తుతం ఆమె హిమాచల్ ప్రదేశ్‌లో ఫ్యామిలీతో సమయాన్ని గడుపుతున్నారు. త్వరలోనే ఆమె స్టేట్‌మెంట్‌ను రికార్డు చేస్తాం అని అన్నారు.


Click it and Unblock the Notifications











