twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగచైతన్యకు ఇష్టమైన ఇంట్లోనే సమంత.. ఆమెతో పాటు మరొకరు.. మొదటిసారి స్పందించిన మురళీమోహన్

    |

    నాగచైతన్య సమంత పెళ్లి చేసుకున్న తర్వాత ప్రత్యేకంగా వారికి నచ్చిన ఇంట్లోనే ఐదేళ్లపాటు హ్యాపీగా జీవితాన్ని కొనసాగించారు. అయితే ఒక విధంగా అక్కినేని కుటుంబ సభ్యుల కంటే కూడా వారు ఎక్కువగా మురళీమోహన్ ఫ్యామిలీకి దగ్గరగా ఉండేవారు. ఎందుకంటే మురళీమోహన్ ఉంటున్న అపార్ట్మెంట్ లోనే సమంత నాగచైతన్య కూడా ఉండేవారు. ఇక మొదటిసారి ఒక ఇంటర్వ్యూలో మురళీమోహన్ వారి గురించి అలాగే విడాకుల అనంతరం మళ్లీ ఆ ఇంటి విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అనే దానిపై కూడా వివరణ ఇచ్చారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

    నాగచైతన్య ఇష్టపడిన ఇల్లు

    నాగచైతన్య ఇష్టపడిన ఇల్లు

    నాగచైతన్య సమంత పెళ్లి చేసుకున్న తర్వాత ప్రత్యేకంగా ఒక ఇంట్లో ఉండాలని ముందుగానే ప్లాన్ చేసుకున్నారు. ఇక నాగచైతన్య మురళీమోహన్ కొడుకుతో మంచి సన్నిహిత్యం ఉండడంతో అతను వాళ్ళ ఇంటిని చూడడానికి ఒకసారి వెళ్ళాడు. అయితే అక్కడ మురళీమోహన్ తో పాటు అతని తమ్ముడు కొడుకు ఉండడానికి ప్రత్యేకంగా అపార్ట్మెంట్ కట్టుకున్నారు. అందులోనే స్విమ్మింగ్ పూల్ జిమ్ ఉండేవిధంగా కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇక ఆ ఇంటికి చూడగానే నాగచైతన్య ఫోకస్ కూడా ఎక్కువగా పడింది.

     నాగార్జునతో సెట్టయిన డీల్

    నాగార్జునతో సెట్టయిన డీల్

    అయితే అందులో ఒక రెండు పోర్షన్స్ ను సొంతం చేసుకోవాలి అని నాగచైతన్య ఎంతగానో ఆశపడ్డాడు. ప్రత్యేకంగా నాగార్జున దగ్గరికి వెళ్లి నేను ఆ అపార్ట్మెంట్లో ఉండాలని అనుకుంటున్నాను అని చెప్పడంతో నాగార్జున కూడా కొడుకు కోరిక మేరకు మురళీమోహన్ కుటుంబ సభ్యులతో మాట్లాడే ఆ ఇంట్లో ఒక రెండు ఫ్లోర్స్ కొనుగోలు చేయడం జరిగింది.

     హఠాత్తుగా విడిపోవడం

    హఠాత్తుగా విడిపోవడం

    ఇక రోజు నాగచైతన్య సమంత ఇద్దరినీ కూడా మురళీమోహన్ చాలా దగ్గరగా చూస్తూ వచ్చారు. జిమ్ లో కూడా ప్రత్యేకంగా కలుస్తూ ఉండేవారు. అయితే ఈ క్రమంలో వారు హఠాత్తుగా విడిపోవడం మాకు కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకు విడిపోయారు అనే విషయం పెద్దగా మాకు కూడా తెలియదు..అని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో మురళీమోహన్ తెలియజేశారు.

     గొడవ పడినట్లు

    గొడవ పడినట్లు

    అసలు వారు విడిపోతున్నట్లు అందరికీ తెలిసిన తర్వాతే మాకు తెలిసింది అని ఇంతకాలం పాటు వారు ఇంట్లో ఉన్నన్ని రోజులు ఎప్పుడూ కూడా పెద్దగా గొడవ పడినట్లు కనిపించలేదు అని అన్నారు. ఇంట్లో ఉన్నప్పుడు కూడా బయటికి పెద్దగా ఎలాంటి శబ్దాలు వచ్చేవి కాదు అని తరచుగా పార్టీలు కూడా చేసుకునే వారు కాదని అన్నారు. చాలా కూల్ గా సైలెంట్ గానే ఉన్నట్లుగా మురళీమోహన్ వివరణ ఇచ్చారు.

    విడాకుల అనంతరం

    విడాకుల అనంతరం

    అయితే మరి కొన్నాళ్ళకు సమంత నాగ చైతన్య తర్వాత ప్రైవసీగా ఒక ఇంటిని కట్టుకోవాలని అనుకున్నారు ప్రత్యేకంగా ఒక ఫ్లాట్ చూడడమే కాకుండా ఇంటి నిర్మాణానికి సంబంధించిన చర్చలు కూడా జరిపారు. కానీ అప్పుడే వారు విడిపోవడం జరిగింది. అయితే విడాకులు తీసుకున్న తర్వాత నాగచైతన్య ఆ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఇక తర్వాత ఆ ఇంటిని మరొకరికి అమ్మేయడానికి అగ్రిమెంట్ కూడా జరిగింది.. అన్నారు.

    సమంత అదే ఇంట్లో..

    సమంత అదే ఇంట్లో..

    ఇక అదే సమయంలో సమంత వచ్చి తాను ఆ ఇంట్లోనే ఉంటాను అని చెప్పింది. అయితే మరో డీల్ సెట్ అయిన తర్వాత ఎలా కుదురుతుంది అని అన్నప్పటికీ కూడా ఆమె బ్రతిమాలి మళ్లీ కొనుగోలు చేసిన వారితో మాట్లాడి ఆ ఇంటిని సొంతం చేసుకుంది. ప్రస్తుతం తన తల్లితో కలిసి సమంత.. నాగచైతన్య ఎంతో ఇష్టపడి కొనుక్కున్న అదే ఇంట్లో ఉంటున్నట్లుగా మురళీమోహన్ తెలియజేశారు.

    English summary
    Murali mohan about samantha naga chaitanya home after divorce
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X