Gaddar Film Awards 2014-2023: గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ .. RRR, బాహుబలి, బలగంకు అవార్డ్స్, విజేతలు వీరే!
2014 నుంచి 2023 వరకు గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్‌ను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అవార్డ్ కమిటీ జ్యూరీ ఛైర్మన్‌గా ఉన్న సీనియర్ నటుడు మురళీ మోహన్, తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ దిల్‌రాజులు హైదరాబాద్‌లో ఈ పురస్కారాలు ప్రకటించారు. రాష్ట్ర విభజన నాటి నుంచి నంది అవార్డులు ఇవ్వడం మానేశారని మురళీ మోహన్ అన్నారు. 2014 నుంచి 2023 వరకు ప్రతి యేడాది ఉత్తమ తొలి చిత్రం, రెండో చిత్రం, మూడో చిత్రం కింద పురస్కారాలను ప్రకటిస్తున్నట్లు మురళీ మోహన్ తెలిపారు.
రాష్ట్ర విభజన జరిగిన 2014 జూన్ 2 నుంచి సెన్సార్ జరుపుకున్న చిత్రాలను అవార్డుల కోసం పరిగణనలోనికి తీసుకున్నట్లు మురళీ మోహన్ పేర్కొన్నారు. వీటితో తెలుగు సినిమాకు సేవలందించిన వారికి ఆరు ప్రత్యేక పురస్కారాలను ప్రకటించారు. జూన్ 14న హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో అవార్డుల ప్రదానోత్సవం జరగనుందని కమిటీ తెలిపింది.

ఉత్తమ చిత్రం (2014)- రన్ రాజా రన్, పాఠశాల, అల్లుడు శ్రీను
ఉత్తమ చిత్రం (2015)- రుద్రమదేవి, కంచె, శ్రీమంతుడు
ఉత్తమ్ చిత్రం (2016) - శతమానం భవతి, పెళ్లిచూపులు, జనతా గ్యారేజ్
ఉత్తమ చిత్రం (2017) - బాహుబలి, ఫిదా, ఘాజీ
ఉత్తమ చిత్రం (2018)- మహానటి, రంగస్థలం, కేరాఫ్ కంచరపాలెం
ఉత్తమ చిత్రం (2019)- మహర్షి, జెర్సీ, మల్లేశం
ఉత్తమ చిత్రం (2020)- అల వైకుంఠపురంలో, కలర్ ఫోటో, మిడిల్ క్లాస్ మెలోడీస్
ఉత్తమ చిత్రం (2021)- ఆర్ఆర్ఆర్, అఖండ, ఉప్పెన
ఉత్తమ చిత్రం (2022)- సీతారాం, కార్తీకేయ 2, మేజర్
ఉత్తమ చిత్రం (2023)- బలగం, హనుమాన్, భగవంత్ కేసరి
ప్రత్యేక పురస్కారాలు:
ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్ - నందమూరి బాలకృష్ణ
బీఎన్ రెడ్డి ఫిలిం అవార్డ్ - సుకుమార్
నాగిరెడ్డి- చక్రపాణి ఫిల్మ్ అవార్డ్ - అట్లూరి పూర్ణ చంద్రరావు
రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డ్ - యండమూరి వీరేంద్రనాథ్
కాంతారావు ఫిల్మ్ అవార్డ్ - విజయ్ దేవరకొండ
పైడి జైరాజ్ ఫిల్మ్ అవార్డ్ - మణిరత్నం
కాగా.. ఇప్పటికే 2024 సంవత్సరానికి గాను గద్దర్ అవార్డ్స్‌ను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉత్తమ చిత్రంగా కల్కి, పుష్ప 2 చిత్రానికి గాను అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా, 35 ఇది చిన్నకథ కాదు చిత్రానికి గాను నివేదా థామస్ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. అలాగే ఉత్తమ దర్శకుడిగా కల్కి చిత్రానికి గాను నాగ్ అశ్విన్, ఉత్తమ సహాయ నటుడిగా సరిపోదా శనివారానికి గాను ఎస్‌జే సూర్య ఎంపికయ్యారు.
14 ఏళ్ల తర్వాత తెలంగాణ ప్రభుత్వం గద్ధర్ పేరిట అవార్డ్స్ ఇస్తున్నట్లు దిల్‌రాజు తెలిపారు. అవార్డులు సినీ రంగానికి బూస్టప్‌లా పనిచేస్తాయని , ఎంపిక విషయంలో ప్రభుత్వం తమకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చిందని జ్యూరీ కమిటీ ఛైర్మన్ జయసుధ పేర్కొన్నారు. ఎవరి ఒత్తిళ్లు, ప్రలోభాలు లేకుండా పూర్తి పారదర్శకంగా అవార్డులను ఎంపిక చేసినట్లు ఆమె స్పష్టం చేశారు. ఇందుకు సహకరించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలకు జయసుధ ధన్యవాదాలు తెలిపారు.


Click it and Unblock the Notifications











