Murali Mohan : ‘శ్రీదేవిని పెళ్లి చేసుకోవాల్సింది నేనే.. అప్పట్లో ఆమె నా ఇంట్లోకి వచ్చి మరీ‘
టాలీవుడ్ సీనియర్ నటుడు మురళీమోహన్ 80, 90లో తెలుగు ప్రేక్షకులను నటుడిగా ఎంతగానో అలరించారు. హీరోగా, పలు కీలక పాత్రలతోనూ ఆడియన్స్ లో తనకంటూ మంచి గుర్తింపు దక్కించుకున్నారు. మురళీమోహన్ చలనచిత్ర పరిశ్రమలో 1973 నుంచి యాక్టివ్ గా ఉంటున్నారు. జగమే మాయ.. చిత్రంతో తొలిసారి హీరోగా నటించి మెప్పించారు. ఆ తర్వాత 1974లో దర్శక దిగ్గజం దాసరి నారాయణ డైరెక్టర్ చేసిన చిత్రం 'తిరుపతి' తో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత నుంచి వరుసగా హీరోగా ఎన్నో సినిమాలు చేశారు.
ఇప్పటివరకు మురళీమోహన్ 350 కి పైగా చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఆ తర్వాత పొలిటిషన్ గాను, ప్రొడ్యూసర్ గా, బిజినెస్ మెన్ గా తన జీవితంలో కీలక బాధ్యతలు చేపట్టారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఆరి తేరారు. రాజకీయాల్లోనూ చేరి ఎంపీగా ఎన్నికై ప్రజాసేవ చేశారు. ఇక బిజినెస్ పరంగాను ఎంతో మందికి తన సేవలు అందించారు. ఎందరినో మంచి మార్గంలో నడిపించి ఉన్నత భవిష్యత్తుకు బాటలు వేశారు. ఇప్పటికీ చిత్రపరిశ్రమలను, సమాజం పరంగాను పలు కార్యక్రమాల్లో యాక్టివ్ గా కనిపిస్తూ తన వాయిస్ వినిపిస్తుంటారు.

ఇక రీసెంట్ గా మురళీమోహన్ బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తన కెరీర్ ప్రారంభంలో జరిగిన కొన్ని విషయాలను అభిమానులకు, సినిమా ప్రియులకు తెలియజేస్తున్నారు. కాగా తాజాగా అలనాటి నటి, అతిలోక సుందరి, దివంగత శ్రీదేవి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నతో ఎవరు ఊహించని సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం మురళీమోహన్ మాటలు సినిమా సర్కిల్ లో వైరల్ గా మారాయి.
తన కెరియర్ ప్రారంభంలో మురళీమోహన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే శ్రీదేవి కూడా పలు చిత్రాలు నటిస్తూ రాణిస్తోంది. ఆ సమయంలో మురళీమోహన్ ను చూసిన శ్రీదేవి తల్లి అల్లుడుగా చేసుకోవాలని భావించిందంట. ఈ విషయాన్ని శ్రీదేవికి కూడా చెప్పి ఒప్పించిందంట. కానీ అప్పటికే మురళీమోహన్ కు వివాహమై ఇద్దరు పిల్లలకు కూడా తండ్రి అయ్యారు అనే విషయం శ్రీదేవి తల్లికి తెలియలేదంట. దాంతో శ్రీదేవిని తన ఇంట్లోకి తీసుకెళ్లి మరి పెళ్లి చేసుకోమని మురళీమోహన్ ను శ్రీదేవి తల్లి అడిగిందంట. ఒక్కసారిగా షాక్ అయినా మురళీమోహన్ కుదరదని చెప్పాడంట.
ఇక శ్రీదేవితో పాటు తన తల్లి కూడా ఇంటికి రావడంతో అప్పటికే ఇంట్లో ఉన్న మురళీమోహన్ భార్య పిల్లలను చూపించి తనకు పెళ్లయిందని వివరించాడంట. దాంతో మురళీమోహన్ శ్రీదేవిని పెళ్లి చేసుకోలేకపోయారు. అయితే ఈ విషయం చిత్ర పరిశ్రమలోని సీనియర్ నటులు, కొద్దిమంది ప్రముఖులకు మాత్రమే అప్పట్లో తెలిసిందంట. రీసెంట్ ఇంటర్వ్యూలో మురళీమోహన్ శ్రీదేవితో పెళ్లిపై స్పందించడంతో అందరికీ తెలిసిపోయింది.
ఈ విషయంతో మురళీమోహన్ అప్పట్లో చలనచిత్ర పరిశ్రమలో ఏ రేంజ్ స్థాయిని మెయింటైన్ చేశారనేది ఆసక్తికరంగా మారింది. ఇక శ్రీదేవి బాలీవుడ్ నిర్మాత భోణి కపూర్ను వివాహం చేసుకొని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. పెద్ద కూతురు జాన్వి కపూర్, చిన్న కూతురు ఖుషి కపూర్ కూడా చిత్ర పరిశ్రమ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తున్నారు. ప్రస్తుతం జాన్వీ కపూర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన ఆర్సీ 16 చిత్రంలో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











