twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ సీన్ చూసి నన్ను చంపేయాలనుకున్నారట.. మురళీ శర్మ కామెంట్స్

    |

    మురళీ శర్మ గురించి, ఆయన నటన గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. అతిథి చిత్రంలో ఓ విభిన్న పాత్రను పోషించి నంది అవార్డును అందుకున్న మురళీ శర్మ.. తన నటనలో వైవిధ్యాన్ని ఎప్పటికప్పుడు ప్రదర్శిస్తూనే ఉన్నాడు. తాజాగా వచ్చిన అల వైకుంఠపురములో చిత్రంలో మురళీ శర్మ నటనకు ఆశ్చర్యపోని వారెవరూ ఉండరు. అల్లు అర్జున్ తరువాత అంతటి స్కోప్, అంతకంటే అద్బుతమైన నటనను కనబర్చి మరోసారి అందరి మనసులను దోచుకున్నాడు.

    మురళీ శర్మ పాత్రకు ప్రశంసలు..

    మురళీ శర్మ పాత్రకు ప్రశంసలు..


    అల వైకుంఠపురములో వచ్చి రెండు వారాలు అవుతున్నా.. సినిమా కలెక్షన్లు, ప్రశంసలు మాత్రం ఆగడమే లేదు. ఈ మూవీ చూసిన ప్రతీ ఒక్కరూ అల్లు అర్జున్, మురళీ శర్మ గురించి మాట్లాడుతూనే ఉంటున్నారు. అందులోనూ మురళీ శర్మ చూపించిన వేరియేషన్స్‌కు ఫిదా కానివారెవరూ లేరు. అయితే ఈ సినిమా విడుదలైన తరువాత మీడియా ముందుకు రాని మురళీ శర్మ.. ఓ జాతీయ మీడియా సంస్థతో ముచ్చటించాడు. ఆ విషయాలు ఓ సారి చూద్దాం..

    వారికోసం నేను చేసే చిన్న పని..

    వారికోసం నేను చేసే చిన్న పని..


    ‘రోజూ ఓ గంట వాకింగ్‌కు వెళ్తుంటాను.. అయితే ఇప్పుడు మాత్రం గంటా 45 నిమిషాలు చేస్తున్నాను. ఎందుకంటే సినిమా చూసిన ప్రతీ ఒక్కరూ వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. అలా నా వాకింగ్ టైమ్ పెరిగింది. అయితే వారు కేవలం సినిమా బాగుందనో.. పాత్ర బాగుందనో చెప్పి వదిలేయడం లేదు.. ప్రతీ సీన్ గురించి వివరించి చెబుతున్నారు. అది నాకు చాలా సంతోషంగా అనిపించింది. వారు వచ్చి నాతో మాట్లాడినప్పుడు, సెల్ఫీలు అడిగినప్పుడు ఇవ్వడం నేను వారికోసం చేయగలిగిన చిన్న పని.. అదే నేను వారికి చెప్పే థ్యాంక్స్ అనుకుంటాను.

    ఆ సీన్ చూసి..

    ఆ సీన్ చూసి..

    ఈ సినిమాలోని ఇంటర్వెల్ సీన్ చూశాక..కొందరు నన్ను చంపేయాలనుకున్నారట.. నాకు ఫోన్ చేసి చెబుతున్నారు. ఆ పాత్రను అంత గొప్పగా మలిచారని, త్రివిక్రమ్ గారి విజన్‌కు సరెండర్ అయిపోయి.. ఆయన చెప్పినట్టు చేశాను. మొదటి సారి కథ చెప్పేందుకు స్టార్ హోటల్‌లో కలిసినప్పుడు మనం ఓ సరదా సినిమా చేద్దామని త్రివిక్రమ్ చెప్పాడు.

    Recommended Video

    Allu Arjun Unbelievable Craze In Vizag
    నాకు ముప్పై యేళ్లు పట్టింది..

    నాకు ముప్పై యేళ్లు పట్టింది..


    కథ విన్నాక నాకు బాగా నచ్చింది.. నా పాత్ర తెలిశాక నాకు షాక్ అనిపించింది..ఆపై ఇంత మంచి పాత్ర ఇచ్చినందుకు చాలా సంతోషమేసింది. నా కోసం ప్రత్యేకమైన ఫాదర్ రోల్స్ రాసినప్పుడు నేను కూడా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. నిన్ను కోరి లాంటి వాటిలో కొత్తగా అనిపిస్తుంది. నేను ఇప్పటి వరకు 175కు పైగా చిత్రాలు చేశాను. ఈ స్థాయికి చేరుకోవడానికి నాకు ముప్పై యేళ్లు పట్టింద'ని చెప్పుకొచ్చాడు.

    English summary
    Murali Sharma About Ala Vaikunthapurramuloo Movie. Murali Sharma Says Interesting Points About Movie That Some people told me that by interval, they wanted to finish me off.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X