twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వేగం పెంచిన 'సాహో' టీమ్.. మురళీశర్మ లుక్ రివీల్

    |

    ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం 'సాహో'. ఈ చిత్రంలో మురళీశర్మ కీలకమైన పాత్రలో నటించాడు. ఆయన పాత్ర పేరు డేవిడ్. సినిమా ప్రమోషన్లో భాగంగా ముఖ్యమైన పాత్రలను పరిచయం చేస్తూ వారి ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ చేస్తున్న చిత్ర బృందం తాజాగా మురళీశర్మ లుక్ రివీల్ చేసింది.

    యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి బాహుబలి త‌రువాత వ‌స్తున్న మూవీ కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగిన విధంగానే ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా క్వాలిటీకి ప్రాధాన్యత ఇస్తూ దీన్ని తెరకెక్కించారు. టెక్నికల్ వ్యాల్యూస్, యాక్షన్ ఎపిసోడ్స్ హాలీవుడ్ స్థాయిలో ఉండబోతున్నాయి. ఇప్పటికే విడుదలైన అన్ని అప్‌డేట్స్ సాహో రేంజ్ ఎలా ఉంటుందో ప్రేక్షక లోకానికి చెప్పేశాయి.

    Murli Sharma look released from Prabhas Saaho

    ఇక ఈ చిత్రంలో ప్ర‌భాస్ సరసన బ్యూటీ శ్ర‌ద్ధా క‌పూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. యువీ క్రియేష‌న్స్ బేనర్లో వంశీ, ప్ర‌మోద్, విక్ర‌మ్‌ రూ. 300 కోట్ల బడ్జెట్‌తో దీన్ని తెరకెక్కిస్తున్నారు. అగ‌ష్టు 30న ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్‍‌గా ఈ మూవీ విడుద‌ల కానుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించారు. చిత్రంలో ఇంకా జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్‌, అరుణ్ విజ‌య్‌, లాల్‌, వెన్నెల కిషోర్‌, ప్ర‌కాష్ బెల్వాది, ఎవిలిన్ శ‌ర్మ‌, చుంకి పాండే, మందిరా బేడి, మ‌హేష్ మంజ్రేఖ‌ర్‌, టిను ఆనంద్‌ ముఖ్య పాత్రల్లో నటించారు.

    English summary
    After Bahubali Young rebal star Prabhas new movie is Saaho. This movie is directed by sujeeth. The shooting is successfully completed. present saaho team busy with post production works and pramotions.Now Murli Sharma look released from saaho.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X