మురళీ శర్మకు విషాదం.. టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖుల సంతాపం
టాలీవుడ్, బాలీవుడ్ చిత్రాల్లో తనదైన నటనతో రాణిస్తున్న మురళీ శర్మ ఇంట్లో విషాదం నెలకొన్నది. ఆయన తల్లి పద్మాశర్మ గుండెపోటుతో ముంబైలోని తమ నివాసంలో మరణించారు. ఆమె వయసు 76 సంవత్సరాలు. గతేడాది మురళి శర్మ తండ్రి విజ్‌భూషణ్ శర్మ కూడా మరణించడం తెలిసిందే. తల్లి మరణించడంతో విషాదంలో మునిగిపోయిన మురళీ శర్మకు పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపి ఓదార్చారు. ఆయనకు ఫోన్‌లో పరామర్శించి తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.

టాలీవుడ్‌లో మురళీ శర్మ తన కెరీర్‌ను అతిథి చిత్రంతో ప్రారంభించారు. ఆ తర్వాత కంత్రీ, ఊసరవెల్లి, ధోని, మిస్టర్ నూకయ్య, అధినాయకుడు, దువ్వాడ జగన్నాథం, భాగమతి, సరిలేరు నీకెవ్వరు, అలా వైకుంఠపురం చిత్రాల్లో నటించి మెప్పించారు. ఇటీవల రిలీజైన అల వైకుంఠపురంలో ఆయన నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇటీవల వచ్చిన పలు చిత్రాల్లో ఆయన నటన, ఫెర్ఫార్మెన్స్‌కు సినీ విమర్శకులు కూడా ప్రశంసలు అందించారు.
ఇక హిందీలో మై హు నా, అపహరణ్, ఢమాల్, ధోల్, జానే తు జా జానే నా, దంబంగ్, ఓ మై గాడ్, బేబి, బద్లాపూర్, ఏబీసీడీ 2, సాహో, స్ట్రీట్ డ్యాన్సన్ 3డీ చిత్రాల్లో నటించారు.


Click it and Unblock the Notifications











