నోరు జారితే చట్టపరమైన చర్యలు.. గట్టిగా వార్నింగ్ ఇచ్చిన మురుగదాస్!
ఇండియాలోని అగ్ర దర్శకుల జాబితాలో మురుగదాస్ ఒకరు. తన ప్రతి చిత్రంలో సమాజానికి ఏదో ఒక సందేశం ఇవ్వాలని ప్రయత్నిస్తుంటారు. మురుగదాస్ ప్రస్తుతం తమిళ స్టార్ హీరో విజయ్ తో సర్కార్ చిత్రం రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని సంబందించి విజయ్ తాజగా చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది.
తన అనుమతి లేకుండా కొందరు జూనియర్ ఆర్టిస్టులు సర్కార్ చిత్రం గురించి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇది సరైన పద్దతి కాదు. ఈ చిత్రం కోసం ఎంతో మంది తన శ్రమని ధారపోశారు. నా అనుమతి లేకుండా సర్కార్ చిత్రం గురించి ఇంటర్వ్యూలు ఇస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని మురుగదాస్ గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు.

సినిమాకు సంబందించిన విశేషాలు తెలియజేస్తే కథ లీకైపోయి ఆడియన్స్ థ్రిల్ కోల్పోయే ప్రమాదం ఉందనే ఉద్దేశంలో మురుగదాస్ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో విజయ్ అవినీతిని ప్రోత్సహించే ముఖ్యమంత్రి పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











