సుకుమార్ వల్ల బ్రతికిపోయాడు.. దేవి చేతిలో ఉన్న ఒకే ఒక్క బ్రహ్మాస్త్రం?

సినిమా ఇండస్ట్రీలో కాంబినేషన్లకు ఎలాంటి క్రేజ్ ఉందొ స్పెషల్ గా చెప్పనవసరం లేదు. హీరో హీరోయిన్స్ కాలం పోయి డైరెక్టర్ హీరో కాంబినేషన్ పై ఆసక్తి పెరుగుతోంది. అలాగే దర్శకుడు సంగీత దర్శకుడు అనే వారి మధ్య కూడా ఆడియో కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అవుతోంది. డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ కాంబినేషన్ అనగానే టాలీవుడ్ లో కొన్ని జోడీలు మాత్రమే గుర్తొస్తాయి.

 సుకుమార్ - దేవి కాంబినేషన్..

సుకుమార్ - దేవి కాంబినేషన్..

సుకుమార్ అనగానే వెంటనే గుర్తొచ్చే పేరు దేవి శ్రీ ప్రసాద్. సుకుమార్ తన సొంత ప్రొడక్షన్ లో చిన్న సినిమా చేసినా డిఎస్పీతోనే ట్యూన్స్ చేయించుకుంటాడు. ఆర్య నుంచి మొదలైన వీరి కాంబినేషన్ కి ఇప్పటివరకు ఒక్కసారి కూడా బ్రేక్ పడలేదు. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా దేవి సుకుమార్ సినిమాకు బెస్ట్ ఆల్బమ్ ఇస్తుంటాడు. ఇక నెక్స్ట్ పుష్ప సినిమా ద్వారా మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్ ఒకటయ్యింది.

 సుకుమార్ వల్లే..

సుకుమార్ వల్లే..

ఈ మధ్య కాలంలో దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ పై కొన్ని రకాల నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. ఆయన పాటలు ఎక్కువ రోజులు వినపడడం లేదని చాలా రొటీన్ గా ఉంటున్నట్లు టాక్ కూడా వచ్చింది. అయితే సుకుమార్ తో రెగ్యులర్ గా సినిమాలు చేస్తున్న రాక్ స్టార్ కి ఈ సారి బంగారం లాంటి అవకాశం మిస్ అయ్యేదట. బన్నీ పుష్ప సినిమా కోసం థమన్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా సెలెక్ట్ చేసుకుందామని చెప్పాడట. కానీ సుక్కు మాత్రం డిఎస్పీతో తప్ప మరొకరితో తాను ఫ్రీడమ్ గా వర్క్ చేయించుకోలేనని చెప్పాడట. దీంతో బన్నీ సుకుమార్ ని ఇబ్బంది పెట్టలేదని తెలుస్తోంది.

దేవి మారాల్సిందే..

దేవి మారాల్సిందే..

ప్రస్తుతం టాలీవుడ్ లో థమన్ జోరు ఎక్కువగా నడుస్తోంది. అల.. వైకుంఠపురములో.. సినిమాకు థమన్ ఇచ్చిన సంగీతం అతన్ని మరొక లెవెల్ కి తీసుకెళ్లింది. దీంతో ప్రతి ఒక్కరు థమన్ అయితేనే బెటర్ అంటూ దేవి శ్రీ ప్రసాద్ ని పట్టించుకోవడం లేదు. దేవి రొటీన్ మ్యూజిక్ కూడా అతని అవకాశాలకు గండి కొట్టింది. సుకుమార్ మాదిరిగా మొన్నటివరకు కొరటాల శివ కూడా మరో మ్యూజిక్ డైరెక్టర్ ని వెతుక్కోలేదు. ఇక భరత్ అనే నేను ఆడియో అనుకున్నంత సక్సెస్ కాకపోవడంతో ఇప్పుడు మెగాస్టార్ ఆచార్య సినిమాకు కొరటాల దేవిని సెలెక్ట్ చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. డిఎస్పీ తన మ్యూజిక్ విషయంలో మారకపోతే కెరీర్ పై ఎఫెక్ట్ పడేలా ఉందని ట్రోలింగ్స్ వస్తున్నాయి.

Recommended Video

Allu Arjun's Pushpa Breaks NTR Record With Most Liked First Look Poster
అదొక్కటే బ్రహ్మాస్త్రం..

అదొక్కటే బ్రహ్మాస్త్రం..

రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ చేతిలో ప్రస్తుతం ఉన్న ఒకే ఒక్క బ్రహ్మాస్త్రం పుష్ప. కొన్ని మీడియం బడ్జెట్ సినిమాలకు మ్యూజిక్ అందిస్తున్నప్పటికి అవి ఎంత సక్సెస్ అయినా దేవి అంతగా పికప్ అవ్వలేడు. కానీ బన్నీ పుష్ప సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానుంది కాబట్టి అన్ని భాషల్లో అదిరిపోయేలా మ్యూజిక్ ఇవ్వాల్సి ఉంటుంది. తమిళ్ లో కూడా దేవి బిజీ అవ్వాలంటే ఈ సినిమాతో హిట్టు కొట్టాల్సిందే. మరి దేవి ఈ అవకాశాన్ని ఎంతవరకు ఉపయోగించుకుంటాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X