GV Prakash: విడాకుల విషయంలో విపరీతమైన ట్రోల్స్.. తమిళులు విలువ కోల్పోయారా అంటా ట్వీట్!
సౌత్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్న జీవీ ప్రకాష్ గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం మ్యూజిక్ మాత్రమే ఇవ్వకుండా పలు సినిమాల్లో నటించి మెప్పించిన ఈయన తాజాగా ఆయన భార్య సైంధవితో విడిపోతున్నట్లు ప్రకటించారు. రెండు రోజుల క్రితమే సోషల్ మీడియా వేదికగా ఇటు జీవీ ప్రకాష్, అటు సైంధవిలు ఈ విషయాన్ని వెల్లడించారు. దీంతో తమిళులు అంతా పెద్ద ఎత్తున ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. అయితే దీనిపై తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ స్పందించారు. అందరూ నోరు మూసేలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్.. సింగర్ సైంధవిలు చిన్నప్పటి నుంచే కలిసి చదువుకున్నారు. అలా ఏర్పడిన స్నేహమే వీరిద్దరి మధ్య ప్రేమగా మారింది. చాలా ఏళ్లుగా ప్రేమాయణం సాగించిన ఈ జంట ఇరుకుటుంబాలను ఒప్పించి మరీ ఘనంగా పెళ్లి చేసుకున్నాగు. 2013లో అత్యంత వైభవంగా జరిగిన వీరి పెళ్లి వేడుకకు వేల సంఖ్యలో అతిథులు వచ్చారు. ఎన్నో ఏళ్లు ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరి అన్యోన్య దాంపత్యానికి ప్రతీకగా ఓ పాప కూడా పుట్టింది. ఆ పాపే అన్వి. ప్రస్తుతం ఈమెకు నాలుగేళ్లు. అయితే పదకొండేళ్లుగా చాలా హాయిగా ఉన్న వీరికి ఈ మధ్య మనస్పర్థలు వస్తున్నాయట.

ఇద్దరూ కలిసి వాటిని ఎంత తగ్గించుకోవాలనుకున్నా ఎక్కువ కావడంతో.. ఇక కలిసి ఉండడం కష్టం అని భావించి విడాకులు తీసుకోవడానికి సిద్ధం అయ్యారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అయితే ఈ వార్తలపై పెద్ద ఎత్తున ట్రోల్స్ జరిగాయి. అందరూ తమకు నచ్చినట్లుగా వార్తలను క్రియేట్ చేసుకుంటూ ఏవోవో కామెంట్లు చేశారు. అయితే తాజాగా వీటిపై జీవీ ప్రకాష్ కుమార్ స్పందించారు. ఎక్స్ వేదికగా చాలా ఎమోషనల్ అవుతూ.. తమిళలుపై షాకింగ్ కామెంట్లు చేశారు.
ముఖ్యంగా ఎవరైనా భార్యాభర్తలు.. ఫేమస్ అయినంత మాత్రానా వారి వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి నాణ్యత లేని విమర్శలు చేయడం ఆమోదయోగ్యం కాదని చెప్పుకొచ్చారు. తమ ఊహలను మాటల ద్వారా వ్యక్తీకరించడం, సోషల్ మీడియాలో పెట్టి రచ్చ చేయడం వల్ల కొంద మంది వ్యక్తుల జీవితంపై ప్రభావితం చూపిస్తుందని గ్రహించలేనంతగా తమిళులు విలువ కోల్పోయారా అని ప్రశ్నించాడు. అలాగే పరస్పర అంగీకారంతో విడిపోవడానికి గల నేపథ్యం, కారణాలు నాతో సన్నిహితంగా ఉండే స్నేహితులు, బంధువులకు తెలుస్తాయని చెప్పుకొచ్చారు. మీ ఉద్దేశం ఏదైనా సరే మా నిర్ణయాన్ని గౌరవించమంటూ కోరారు.

అలాగే మా అందరి ఎమోషనన్స్ ను అర్థం చేసుకోండి అని.. జీవీ ప్రకాష్ విజ్ఞప్తి చేశారు. తనకు సపోర్ట్ గా నిలిచిన వారికి కృతజ్ఞతలు అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో జీవీ ప్రకాష్ చేసిన ఈ పోస్ట్ వైరల్ అయింది. ప్రతీ ఒక్కరూ ఓ పోస్టుపై పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. ఎవరేమన్నా పట్టించుకోవద్దని కొందరు, మీ జీవితాల్లో మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నామని స్పష్టం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











