రవితేజ కొంప ముంచింది అతడేనా?.. టైగర్ నాగేశ్వరరావులో అదే మైనసా?
ఎలాంటి సినిమాలకు అయినా పాటలు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చాలా ముఖ్యం. సినిమా కాస్త సాగదీతగా అనిపించినా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగుంటే ఆ ఫీల్ కూడా రాదు. చిన్న సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచి కోట్లాది రూపాయల కలెక్షన్లు వసూలు చేయడంలో ఇవి ముఖ్య పాత్ర పోషిస్తాయి. అందుకే అందరూ పాటలకు ప్రత్యేకమైన ఇంపార్టెన్స్ ఇస్తారు. తమ సినిమాలో పాటలు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగుండేలా చూసుకుంటారు. ఏమాత్రం బాగా లేదని అనిపించినా పదే పదే వాటిని మార్చుకుంటూ నచ్చే వరకూ ట్రై చేస్తూనే ఉంటారు.
ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాలు చేసేటప్పుడు మరింత ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. మ్యూజిక్ డైరెక్టర్ల సెలక్షన్ లో ఏమాత్రం తేడా కొట్టినా మొదటికే మోసం వస్తుంది. కేవలం బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగుండడం వల్లే సూపర్ డూపర్ హిట్లుగా నిలిచిన చిత్రాలు చాలా ఉన్నాయి. జైలర్, విక్రమ్ వంటి చిత్రాలకు అనిరుథ్ రవిచంద్రన్ అందించిన మంచి బ్యాగ్రౌండ్ స్కోర్ వల్లే ఈ సినిమాలు కంటెంట్ స్థాయిని మించి బాక్సాఫీసు వద్ద కెలక్షన్లు వసూలు చేసింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి రలేదు. అలాగే తమన్, దేవిశ్రీ ప్రసాద్ లాంటి వాళ్లు కూడా అఖండ, వాల్తేరు వీరయ్య వంటి చిత్రాల్లో ఇలాంటి అధ్భుతాలు సృష్టించారు.

అయితే తాజాగా వచ్చిన టైగర్ నాగేశ్వర రావు సినిమాకు మాత్రం బ్యూగ్రౌండ్ మ్యూజిక్ మైనస్ గా నిలిచింది. ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందించారనే విషయం అందరికీ తెలిసిందే. కేవలం మ్యూజిక్ డైరెక్టర్ గానే కాకుండా నటుడిగా కూడా అందరికీ సుపరిచితుడు అయిన ఇతడు.. డార్లింగ్, ఎందుకంటే ప్రేమంట వంటి సూపర్ హిట్ సినిమాలకు ఆల్బమ్స్ అందించాడు. అలాగే ఒంగోలు గిత్త వంటి సినిమాకు నాలుగు పాటలు, యుగానికి ఒక్కడు, షాపింగ్ మాల్ వంటి చిత్రానికి డబ్బింగ్ కూడా చెప్పాడు.
జీవీ ప్రకాష్ కుమార్ టాలెంట్ పై నమ్మకం పెట్టుకున్న టైగర్ నాగేశ్వర రావు డైరెక్టర్ వంశీ.. ఈ సినిమా బాధ్యతలను ఆయనకు అప్పగించాడు. కానీ జీవీ ప్రకాష్ మాత్రం అందుకు తగ్గట్లుగా ట్యూన్స్ ను అందించలేకపోయాడు. ఈ సినిమాకు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పెద్ద మైనస్ గా మారిపోయింది. ముఖ్యంగా మాస్ మహారాజ రవితేజ అభిమానులు షాక్ కు గురయ్యారు. ఇదేం బ్యాగ్రౌండ్ మ్యూజిక్ రా బాబూ అంటూ చెయ్యి తలకు పెట్టుకుంటున్నారు. రవితేజ దరిద్రం కాకపోతే.. జీవీ ప్రకాష్ ఇలాంటి మ్యూజిక్ ఇవ్వండ ఏంటని అనుకుంటున్నారు.

పని ఒత్తిడి ఎక్కువవడం వల్లే జీవీ ప్రకాష్ సరైన మ్యూజిక్ అందించలేదని మరికొంత మంది భావిస్తున్నారు. ఈయన ధనుష్ కెప్టెన్ మిల్లర్, వైష్ణవ్ తేజ్ ఆదికేశవ, విక్రమ్ తంగలాన్, కంగనా రనౌత్ ఎమర్జెన్సీ, కార్తీ జపాన్, అక్షయ్ కుమార్ ఆకాశం నీ హద్దురా వంటి అనేక చిత్రాలకు సంగీత దర్శకుడిగా పని చేస్తున్నాడు. ఇన్ని పనులు ఒకేసారి తలపై పెట్టుకోవడం వల్లే ఇలా జరిగిందని అంతా భావిస్తున్నారు. ఏది ఏమైనా తమకు నచ్చిన స్థాయిలో మంచి మ్యూజిక్ రాబట్టుకోవడం డైరెక్టర్ పని అని.. జీవీ ప్రకాష్ నుంచి వంశీ మంచి మ్యూజిక్ రాబట్టుకోవడంలో విఫలం అయ్యారని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.


Click it and Unblock the Notifications











