వాణి విశ్వనాథ్ ఫ్యామిలీ నుంచి హీరోయిన్.. కోటి కుమారుడితో కెమిస్ట్రీ అదుర్స్.. క్రేజీగా సినీ వారసుల మూవీ
తెలుగు సినిమా పరిశ్రమలోకి వారసుల పరంపర కొనసాగుతూనే ఉంది. ఎంతో మంది సినీ నటులు, సాంకేతిక నిపుణుల వారసులను కళామతల్లి అక్కున చేర్చుకొని ఆదరిస్తున్నది. ఇటీవల కాలంలో యాక్టర్ల సంతతే కాకుండా సాంకేతిక నిపుణుల వారసులు సినీ రంగంలోకి అడుగుపెడుతున్నారు. అలా టాలీవుడ్‌లోకి ప్రవేశించిన వారిలో ప్రముఖ సంగీత దర్శకుడు కోటి సాలురి కుమారుడు రాజీవ్ సాలూరి, వాణి విశ్వనాథ్ కూతురు వర్ష విశ్వనాథ్ ఉన్నారు. రాజీవ్ నటిస్తున్న తాజా చిత్రం వైజాగ్‌లో శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్నది. ఈ సినిమా విశేషాలను దర్శకుడు, నిర్మాతలు వెల్లడించింది.
నిర్మాత గాజుల వీరేష్ (బళ్లారి) మాట్లాడుతూ.. మా టైగర్ హిల్స్ ప్రొడక్షన్, స్వస్తికా ఫిలిమ్స్ సంస్థలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్నది. ఇటీవలే రెండో షెడ్యూల్ ప్రారంభించాం. దర్శకుడు కిట్టు నల్లూరి మా అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. హీరో హీరోయిన్స్ రాజీవ్ సాలూరి, వర్ష విశ్వనాథ్ ఫెర్ఫార్మెన్స్ బాగుంది. వారిద్దరి అద్భుతమైన కెమిస్ట్రీ కనిపించింది. మణిశర్మ మా సినిమాకు సంగీతం అందిచడం మరో ప్రధాన ఆకర్షణ. ఈ చిత్రంలో కోటి గారు కూడా నటించడం విశేషం అని అన్నారు.

దర్శకుడు కిట్టు నల్లూరి మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఎంటర్‌టైనింగ్‌గా సినిమాను తెరకెక్కిస్తున్నాం. రాజీవ్ సాలూరి, వర్ష విశ్వనాథ్ పోటాపోటీగా నటించారు. నన్ను నమ్మి దర్శకుడిగా ఈ అవకాశం ఇచ్చినందుకు నిర్మాత గాజుల వీరేష్‌కి ధన్యవాదాలు. ఈ సినిమా అందరికీ మంచి పేరు తెస్తుంది. మణిశర్మ సంగీతం చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం అని అన్నారు.
రాజీవ్ సాలూర్, వర్ష విశ్వనాథ్ జంటగా టైగర్ హిల్స్ ప్రొడక్షన్, స్వస్తిక ఫిలిమ్స్ పతాకాలపై గాజుల వీరేష్ (బళ్లారి) నిర్మాత గా, కిట్టు నల్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ప్రొడక్షన్ నెంబర్ 1' చిత్రం షూటింగ్ సెకండ్ షెడ్యూల్ ఇటీవలే వైజాగ్‌లో ప్రారంభం అయ్యింది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఈశ్వర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. పవన్ కే అచల సంభాషణలు అందిస్తున్నారు. ఈ సినిమాలో ప్రముఖ సంగీత దర్శకుడు కోటి సాలూర్ ఓ ముఖ్య పాత్ర లో నటిస్తున్నారు. సదన్, లావన్య, రాజా రవీంద్ర, రాజా శ్రీ తదితరులు ఇతర పాత్రలు పోస్తిస్తున్నారు. విష్ణుసూర్య గుంత ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను వైజాగ్‌లోని అందమైన లొకేషన్స్‌లో చిత్రీకరిస్తున్నారు.

నటీనటులు, సాంకేతిక నిపుణులు
నటీనటులు: రాజీవ్ సాలూరి, వర్ష విశ్వనాథ్, కోటి సాలూరి, సదన్, లావన్య, రాజా రవీంద్ర, రాజా శ్రీ తదితరులు
స్టోరీ-స్క్రీన్ ప్లే- డైరెక్షన్: కిట్టు నల్లూరి
నిర్మాత: గాజుల వీరేష్ (బళ్లారి)
సినిమాటోగ్రఫీ: ఈశ్వర్
ఎడిటర్: రవి మాన్ల
డైలాగ్స్: పవన్ కె అచల
మ్యూజిక్: మణిశర్మ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విష్ణుసూర్య గుంత
బ్యానర్ : టైగర్ హిల్స్ ప్రొడక్షన్, స్వస్తికా ఫిలిమ్స్


Click it and Unblock the Notifications











