RP Patnaik: "నాకు మ్యూజిక్ రాదు, టాలెంట్ కూడా లేదు.. కానీ సక్సెస్‌కు కారణం అదే"
ఆర్పీ పట్నాయక్.. ఈ పేరు తెలియని తెలుగు సినీ ప్రేక్షకులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. మ్యూజిక్ డైరెక్టర్ గా ఎన్నెన్నో అద్భుతమైన పాటలను అందించిన ఈయన కేవలం మ్యూజిక్ డైరెక్టర్ గానే కాకుండా రచయితగా, డైరెక్టర్ గా, నటుడిగా కూడా తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నారు. అయితే తాజాగా ఓ షోలో పాల్గొన్న ఆయన షాకింగ్ కామెంట్లు చేశారు. తనకు మ్యూజిక్ రాదని, లాటెంట్ కూడా లేదని వివరించారు. కానీ తాను ఇంతగా సక్సెస్ కావడానికి కారణం ఒక్కటేనని చెప్పుకొచ్చారు. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
1999లో నీకోసం సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా తెలుగు రంగంలో అడుగు పెట్టిన ఆర్పీ పట్నాయక్.. ఆ తర్వాత అనేక సినిమాలకు పని చేశారు. టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. ఇప్పటికీ అనేక పాటలకు మ్యూజిక్ కంపోజ్ చేస్తూ.. తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటున్నారు. కేవలం మ్యూజిక్ డైరెక్టర్ గానే కాకుండా నటుడిగా కూడా చాలా సినిమాల్లో మెరిశారు. ముఖ్యంగా శీను వాసంతి లక్ష్మి సినిమాలో కళ్లు లేని వాడిలా నటించి.. తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాధించుకున్నాడు.

ఆ ఒక్క సినిమాలోనే కాకుండా మనలో ఒకడు, బ్రోకర్, తులసీదళం వంటి సినిమాల్లోనూ నటించాడు. కేవలం నటించడమే కాకుండా బ్రోకల్, తులసీ దళం సినిమాలకు దర్శకుడిగా కూడా వ్యవహరించారు. ఇలా తెలుగు సినీ రంగంలో తనలోని అన్ని రకాల టాలెంట్ లను బయట పెట్టిన ఈయన తాజాగా ఓ షోకు వచ్చారు. అక్కడే తన గురించి చెబుతూ అనేక షాకింగ్ కామెంట్లు చేశారు. ముఖ్యంగా తనకు అసలు మ్యూజిక్ అంటే ఏంటో కూడా తెలియదని ఏదైనా రాగం ఇచ్చి పాటలకు మ్యూజిక్ కంపోజ్ చేయమంటే తాను చేయలేనని వవిరంచారు. ఇది విన్న యాంకర్ షాక్ అయ్యారు.
తాను ఇంతగా సక్సెస్ కావడానికి తన లాటెంట్ కూడా కారణం కాదని.. అసలు తనకు అంతగా టాలెంట్ కూడా లేదని ఆర్పీ పట్నాయక్ వివరించారు. కాకపోతే.. చెన్నయ్ నుంచి తెలుగు సినీ రంగం హైదరాబాద్ వచ్చేశాకా... మ్యూజిక్, డ్యాన్స్ రంగాలు మాత్రం అక్కడే ఉన్నాయని.. దాంతో ఇక్కడికే వచ్చేయాలని అనుకుని తాను మొదటగా.. రాగా అంతా ఆదరించారని చెప్పుకొచ్చారు. దాని వల్లే తనకు ఎక్కువగా అవకాశాలు వచ్చాయని.. కనీసం తాను ఎవరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేయలేదని చెప్పుకొచ్చారు.

సాధారణంగా అలా పని చేయని వారికి మ్యూజిక్ డైరెక్టర్ గా అవకాశం ఇవ్వరని కానీ.. టాలీవుడ్ హైదరాబాద్ వచ్చాకా తామే ముందు ఇక్కడికి రావడంతోనే తమకు ఛాన్సులు ఎక్కువగా వచ్చి సక్సెస్ అయ్యామని అన్నారు. అలాగే ఓ ఇన్సిడెంట్ చెప్తే మనసులోంచి వచ్చే దాన్నే తాను మ్యూజిక్ మలుస్తానని.. కానీ ఏదైనా రాగం ఇచ్చి చేయమంటే తన వల్ల కాదని చెప్పుకొచ్చారు. అందుకే తాను ఇచ్చే మ్యూజిక్ కొత్తగా ఉండడం, అందరినీ ఆకట్టుకోవడం జరుగుతుందని కూడా అన్నారు.


Click it and Unblock the Notifications











