నేను క్షేమంగా ఉన్నా.. రూమర్లు నమ్మెద్దు.. హార్ట్ సర్జరీ తర్వాత శశి ప్రీతమ్
ప్రముఖ సంగీత దర్శకుడు శశి ప్రీతమ్ హార్ట్ సర్జరీ తర్వాత క్రమంగా కోలుకొంటున్నారు. ఛాతిలో నొప్పి అని చెప్పడంతో ఆయనను ఇటీవల హాస్పిటల్‌కు హుటాహుటిన తరలించిన సంగతి తెలిసిందే. దాంతో ఆయనకు జూన్ 4వ తేదీన హార్ట్ సర్జరీ చేశారు. వైద్యుల పర్యవేక్షణలో ఉన్న తర్వాత ఆయన జూన్ 9వ తేదీన హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయ్యారు. అయితే తన ఆరోగ్యంపై వస్తున్న రూమర్లపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు.
నా శ్రేయస్సును ఆకాక్షించే ప్రతీ ఒక్కరికి నమస్కారాలు. జూన్ 4 తేదీన నేను గుండెపోటుకు గురయ్యాను. వెంటనే నా స్నేహితుడు రాజు నన్ను బంజారాహిల్స్‌లోని సెంచరీ హాస్పిటల్‌లో చేర్పించడంతో పెద్ద ముప్పు తప్పింది. వైద్యులు పరీక్షలు నిర్వహించిన అనంతరం నా గుండెలో బ్లాకేజ్ ఉందనే విషయాన్ని చెప్పారు. వెంటనే ఆంజియోప్లాస్టీ చేయాలని సూచించారు. అనంతరం సర్జరీ చేసి నా గుండెలో స్టంట్ వేశారు. నన్ను తీవ్రమైన గుండె నొప్పి నుంచి కాపాడారు. నా ఆరోగ్యం కుదటపడిందని తెలుసుకొన్న తర్వాత నన్ను డిశ్చార్జ్ చేశారు. నా ఆరోగ్యం గురించి ప్రార్థించిన నా కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులకు నా ధన్యవాదాలు అని శశి ప్రీతమ్ ఓ ప్రకటనలో తెలిపారు.

శశిప్రీతమ్‌కు చికిత్స చేసిన డాక్టర్ అమీనుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. సెంచరీ హాస్పిటల్‌లో శశి ప్రీతమ్‌కు కన్సల్టెంట్ డాక్టర్‌ను. ఆయనకు 4వ తేదీన ఆంజియోప్లాస్టీ సర్జరీ చేశాను. 24 గంటలపాటు ఆయనను అబ్బర్వేషన్‌లో ఉంచాం. ఆయన త్వరగా రికవరీ అయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగున్నది అని వెల్లడించారు.


Click it and Unblock the Notifications











