పోన్లే పాపం అని ఛాన్స్ ఇస్తే .. మ్యూజిక్ డైరెక్టర్‌కి ముచ్చెమటలు, బుద్ధి చూపిస్తోన్న సింగర్ సుచిత్ర

భారతదేశంలో మీ టూ ఉద్యమం ఉద్ధృతంగా సాగిన సమయంలో సింగర్ సుచిత్ర రేపిన కలకలం అంతా ఇంతా కాదు. సుచీ లీక్స్ పేరిట దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖుల గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ధనుష్, త్రిష, వంటి పెద్ద పెద్ద స్టార్ల వ్యక్తిగత విషయాలను సుచిత్ర బయటపెట్టారు. ఆమె అప్పట్లో చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ ఇండస్ట్రీలో చర్చనీయాంశమే.

ధనుష్- ఐశ్వర్య విడాకుల వ్యవహారంతో పాటు సైంధవి, జీవీ ప్రకాష్ కుమార్‌ల బంధంపైనా సుచిత్ర ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడింది. అయితే సుచిత్ర మానసిక పరిస్ధితి బాలేదని, అందుకే పిచ్చిపిచ్చిగా మాట్లాడుతోందని ఆమెను ఎవ్వరూ పట్టించుకోవద్దని భర్త స్వయంగా ఓ వీడియోను రిలీజ్ చేసినట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి.

Music Director Shakthi R Selva made sensational comments on singer Suchitra

సుచిత్ర బాధితుల్లో విలక్షణ నటుడు, కోలీవుడ్ నట దిగ్గజం కమల్ హాసన్ కూడా ఉన్నారు. కమల్ ఓ ట్రాన్స్‌జెండర్ అని.. అందుకే ఆయన ఎక్కువగా చుడీదార్, కుర్తాలు వంటి బట్టలను ఎక్కువగా వేసుకుంటారని బాంబు పేల్చింది. అంతేకాదు.. తాను చేసిన వ్యాఖ్యలపై తన మాజీ భర్త కార్తీక్ పోలీసులకు ఫిర్యాదు చేశారని , అప్పటి నుంచి పోలీసులు తనకు ఫోన్ చేస్తున్నారని మరో సందర్భంలో చెప్పారు సుచిత్ర. తాను కార్తీక్‌కు క్షమాపణలు చెప్పకుంటే, జైలుకు పంపుతామని బెదిరిస్తున్నారని ఆమె ఆరోపించారు. తనపై వస్తున్న విమర్శలకు భయపడ్డ సుచిత్ర.. తాను చేసిన వ్యాఖ్యలు ఫ్రాంక్స్ అని తప్పించుకునే ప్రయత్నం చేశారు.

అలా తన మాటలు, చేతలతో ఇండస్ట్రీని ఓ కుదుపు కుదిపిన సుచిత్రకు అవకాశాలు ఇచ్చేవారే కరువయ్యారు. ఈ నేపథ్యంలో ఆమెను ఆదుకుందామని ఆఫర్ ఇచ్చిన ఓ మ్యూజిక్ డైరెక్టర్‌కు సుచిత్ర చుక్కలు చూపిస్తోందట. ఈ వివరాల్లోకి వెళితే.. తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన సంగీత దర్శకుడు శక్తి ఆర్ సెల్వ, సుచిత్ర కలిసి '' టైటానిక్ సన్నీ సన్నీ '' అనే ఓ ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బమ్‌ను రూపొందించారు. కష్టపడి ఈ ఆల్బమ్‌ను రూపొందించగా.. ఇప్పుడు దీనిని ప్రమోట్ చేసే కార్యక్రమాలకు సుచిత్ర సహకరించడం లేదట. అంతేకాదు.. తన ఫోటోలను కూడా వాడకూడదని కండీషన్ పెట్టినట్లుగా సెల్వ ఆరోపించారు.

Music Director Shakthi R Selva made sensational comments on singer Suchitra

సుచీ లీక్స్ తర్వాత ఆమెకు ఎవ్వరూ ఆఫర్లు ఇవ్వడం లేదని .. అలాంటిది తాను మళ్లీ అవకాశం ఇస్తే తన పట్ల దురుసుగా ప్రవర్తిస్తోందని సెల్వ మండిపడ్డారు. గతంలో కంద అనే చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేసిన ఆయన అనారోగ్యం కారణంగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. దీంతో ప్రైవేట్ ఆల్బమ్స్ ద్వారా సత్తా చాటాలని భావిస్తున్న దశలో సుచిత్ర కారణంగా తన ప్రయత్నం వృథా అవుతోందని సెల్వ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై సుచిత్ర ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

More from Filmibeat

Read more about: singer suchitra movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X