సంగీత దర్శకుడు శశి ప్రీతమ్‌కు గుండెపోటు.. షాక్‌లో సినీ వర్గాలు..
ప్రముఖ సంగీత దర్శకుడు శశి ప్రీతమ్ గుండెపోటుకు గురయ్యారు. శుక్రవారం ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబం సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వార్త బయటకు రావడంతో సినీ వర్గాలు ఆందోళనకు గురయ్యారు. ప్రస్తుతం శశి ప్రీతమ్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే..

ఛాతి నొప్పితో బాధపడుతున్నట్టు
సంగీత దర్శకుడు శశి ప్రీతమ్ తన ఛాతి నొప్పితో బాధపడుతున్నానని ఫిర్యాదు చేయడంతో కుటుంబ సభ్యులు బంజారా హిల్స్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన వైద్యులు వెంటనే శస్త్ర చికిత్స చేసి ఆయనకు హార్ట్‌కు స్టంట్ వేసినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.

గుండెపోటు అని తెలియగానే..
శశి ప్రీతమ్‌కు గుండెపోటు వచ్చిందనే వార్త తెలియగానే సినీ ప్రముఖులు, స్నేహితులు, సన్నిహితులు ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఫోన్ చేసి కుటుంబ సభ్యులను శశిప్రీతమ్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకొన్నారు. ఆయన కోలుకోవాలని సన్నిహితులు, స్నేహితులు ఆకాంక్షిస్తున్నారు.

గులాబీ మూవీతో సినీ పరిశ్రమలోకి
ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ, జేడీ చక్రవర్తి కాంబినేషన్‌లో వచ్చిన గులాబీ చిత్రం ద్వారా శశిప్రీతమ్ సంగీత దర్శకుడిగా సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత సముద్ర, హ్యాండ్సప్, రాఘవ చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. అంతేకాకుండా హిందీలో ఆమ్‌దానీ ఆఠానీ, ఖర్చ రుపాయా, ముఖబీర్ చిత్రాలకు సంగీతం అందించారు.

లాక్‌డౌన్ సమయంలో
కరోనా లాక్‌డౌన్‌తో సినీ పరిశ్రమలో క్లిష్ట పరిస్థితులు నెలకొని ఉంటే.. మరో పక్క విషాదాలు సినీ ప్రముఖులను చుట్టుమడుతున్నాయి. పలువురు తెలుగు, హిందీ సినీ ప్రముఖుల మరణాలు పరిశ్రమ వర్గాలను, అభిమానులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా RRR నిర్మాత డీవీవీ దానయ్యకు, శివాజీరాజాకు కూడా హార్ట్ సర్జరీ జరిగిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











