అర్థరాత్రి థమన్, ఆది పినిశెట్టి అరెస్ట్.. పోలీసులు చుట్టుముట్టి , వెనుక ఆ మంత్రి హస్తం
హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రేక్షకులను అలరిస్తున్నారు ఆది పినిశెట్టి. హీరోగానే చేస్తాననే గిరి గీసుకుని కూర్చోకుండా తనకు నచ్చిన బాటలో సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతున్నారు ఆది. తాజాగా ఆయన నటించిన చిత్రం శబ్ధం ప్రేక్షకుల ముందుకురానుంది. మహా శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 28న తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలు వేగవంతం చేసింది.
సీనియర్ డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి కుమారుడే ఆది పినిశెట్టి. ఒక విచిత్రం సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన ఆది అన్ని రకాల పాత్రలు చేయగల నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. గుండెల్లో గోదారి, మలుపు, సరైనోడు, నిన్నుకోరి, రంగస్థలం, నీవెవరో, యూటర్న్, గుడ్ లక్ సఖి, క్లాప్, ది వారియర్, అజ్ఞాతవాసి వంటి సినిమాలలో ఆది పినిశెట్టి నటించారు. యాగవరాయనం నా కాక్క, మరగద నాణయం చిత్రాల్లో తనతో కలిసి నటించిన సహ నటి నిక్కీ గల్రానీతో ప్రేమలో పడిన ఆది పినిశెట్టి పెద్దల అంగీకారంతో రెండేళ్ల క్రితం ఆమెను పెళ్లాడారు. ప్రస్తుతం ఈ జంట హ్యాపీగా వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది.

శబ్ధం చిత్రానికి అరివళగన్ దర్శకత్వం వహించారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన వైశాలి అనే హార్రర్ థ్రిల్లర్ ప్రేక్షకులను భయపెట్టడంతో పాటు కలెక్షన్ల వర్షం కురిపించింది. లాంగ్ గ్యాప్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న శబ్ధం చిత్రంపై చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలున్నాయి. రిలీజ్ డేట్ దగ్గరపడటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటోంది. తాజాగా స్టార్ యాంకర్ సుమకు ఇచ్చిన ఇంటర్యూలో శబ్ధం యూనిట్ పాల్గొంది.
అరివళగన్, థమన్, ఆది పినిశెట్టి కాంబోలో వైశాలి వచ్చిన దాదాపు 16 ఏళ్ల తర్వాత శబ్ధం సినిమా రిలీజ్ అవుతోంది. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్‌లకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ సందర్భంగా ఆదితో తన ఫ్రెండ్‌షిప్, తాము చేసిన అల్లరి పనులను సంగీత దర్శకుడు థమన్ పంచుకున్నారు. చెన్నైలో ఉన్నప్పుడు ఆది నా బర్త్ డేకి సర్‌ప్రైజ్ చేస్తానని చెప్పి అర్ధరాత్రి 12 గంటలకు అప్పుడే కొత్తగా నిర్మించిన ఫ్లై ఓవర్ దగ్గరికి రమ్మన్నాడని థమన్ తెలిపారు. కేక్ కట్ చేసిన కాసేపటికే పెట్రోలింగ్ పోలీసులు అక్కడికి వచ్చి పోలీసులు అరివళగన్, ఆది పినిశెట్టిలను అరెస్ట్ చేశారని.. నా పుట్టిన రోజు కావడంతో తనను వదిలేశారని ఆయన గుర్తుచేసుకున్నారు.

రాత్రంతా టీ నగర్ పోలీస్ స్టేషన్‌లోనే ఆది, అరివళగన్ వున్నారని .. ఉదయాన్నే ఫోన్ చేసి మేం విడుదలయ్యామని, పార్టీ ఎక్కడ అని అడిగారని చెప్పారు. నిజానికి బర్త్ డే సందర్భంగా తాము ఫ్లై ఓవర్స్‌లో క్రాకర్స్ కాల్చడంతో పాటు దానికి పక్కనే కొందరు తమిళనాడు మంత్రి నివాసం ఉండటంతో ఆయన కుటుంబం నిద్రపోలేదని దాంతో పోలీసులు వచ్చారని థమన్ వెల్లడించారు. నాటి నుంచి అర్ధరాత్రి బర్త్ డే సెలబ్రేషన్స్ ఆపేశామని ఆయన గుర్తుచేశారు.


Click it and Unblock the Notifications











